IND VS AUS MANISH PANDEY SHOULD GET CHANCE TO PLAY FOR TEAM INDIA RAISES QUESTIONS
IND vs AUS : మనీశ్ పాండే ఇంకేమీ నిరూపించుకోవాలి..? జట్టులోకి ఎందుకు తీసుకోవడం లేదంటూ ఫ్యాన్స్ ఫైర్
Manish Pandey
ఆస్ట్రేలియా సిరీస్‌లో టీమిండియా 2-1 తేడాతో వన్డే సిరీస్ ను కోల్పోయి బొక్క బొర్లా పడింది. ఈ సిరీస్ లో టాపార్డర్ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. వరుసగా విఫలమవుతున్న వారినే ఆడించడంపై విమర్శలు వస్తున్నాయి. మిడిలార్డర్ లో సత్తా చాటగల మనీశ్ పాండేకు ఎందుకు ఛాన్స్ ఇవ్వడం లేదంటూ ప్రశ్నిస్తున్నారు టీమిండియా ఫ్యాన్స్.
ఆస్ట్రేలియా సిరీస్‌లో టీమిండియా 2-1 తేడాతో వన్డే సిరీస్ ను కోల్పోయి బొక్క బొర్లా పడింది. మొదటి రెండు వన్డేల్లో టాస్ ఓడి, ప్రత్యర్థికి భారీ స్కోరు అప్పగించిన టీమిండియా, చేజింగ్ లో పోరాడి 300+ స్కోరు చేసింది. మూడో వన్డేలో ఏదో హార్దిక్ పాండ్య, జడేజాల మెరుపు బ్యాటింగ్ తో టీమిండియా భారీ స్కోరు సాధించింది. ఈ మ్యాచ్ లో కూడా టాపార్డర్ బ్యాట్స్‌మెన్ ఫెయిలయ్యారు. దీంతో మిడిలార్డర్ లో సత్తా చాటగల మనీశ్ పాండేకు ఎందుకు ఛాన్స్ ఇవ్వడం లేదంటూ ప్రశ్నిస్తున్నారు టీమిండియా ఫ్యాన్స్.
గత రెండేళ్లుగా టీమిండియాకు ఎంపికవుతూనే ఉన్నాడు మనీశ్ పాండే. అయితే తుది జట్టులో ఆడే అవకాశం మాత్రం రావడం లేదు. ప్రస్తుత వన్డే సిరీస్‌కి కూడా ఎంపికైన మనీశ్ పాండే. మూడో వన్డేల్లోనూ చోటు దక్కించుకోలేకపోయాడు. దీంతో టీమిండియా తీరుపై సెటైర్లు వినిపిస్తున్నాయి.
Manish Pandey
2016లో ఆస్ట్రేలియాపై వన్డే మ్యాచ్ ఆడిన మనీశ్ పాండే. రోహిత్, ధావన్, కోహ్లీ వంటి టాప్ బ్యాట్స్‌మెన్ ఫెయిల్ అయిన మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగి ఆదుకున్నాడు. అజేయ సెంచరీతో చెలరేగి టీమిండియాను వైట్ వాష్ నుంచి కాపాడాడు. అలాంటి మనీశ్ పాండేని కేవలం డగౌట్లో కూర్చొని మ్యాచ్ చూసేందుకే టీమిండియాకి ఎంపిక చేస్తున్నట్టుగా ఉందని కొందరు అంటుంటే. జట్టులో ఆడించకపోతే సెలక్ట్ చేయడం ఎందుకని విమర్శిస్తున్నారు.మనీశ్ పాండే స్థానంలో అంబటి రాయుడు లేదా సూర్యకుమార్ యాదవ్ ఉండి ఉంటే.ఇలా ఎంపిక చేసి, రిజర్వు బెంచ్‌కే పరిమితం చేస్తుందన్నందుకు ట్విట్టర్లో ఆగ్రహం వ్యక్తం చేసేవారని అంటున్నారు మరికొందరు.రెండేళ్లుగా భారత జట్టుకు ఎంపికవుతూ తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోతున్న మనీశ్ పాండే. అత్యధిక మ్యాచులు రిజర్వు బెంచ్‌కే పరిమితమైన బ్యాట్స్‌మెన్‌గా రికార్డు క్రియేట్ చేసి విమర్శలు గుప్పిస్తున్నారు ఫ్యాన్స్.
Manish Pandey
రెండు మ్యాచుల్లో విఫలమైన శిఖర్ ధావన్ కంటే, మూడు మ్యాచుల్లో పెద్దగా రాణించని శ్రేయాస్ అయ్యర్ కంటే.. కీలక సమయంలో పెవిలియన్ చేరే కెఎల్ రాహుల్ కంటే మనీశ్ పాండే మెరుగ్గా రాణించేవాడని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అతని అభిమానులు.ఐపీఎల్లో రాణించడం వల్లే శిఖర్ ధావన్, కెఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ టీమిండియాలో చోటు దక్కించుకుంటే, భారత జట్టు తరుపున అద్భుతంగా ఆడి కూడా మనీశ్ పాండే బెంచ్‌కే పరిమితం కావాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్. కనీసం టీ-20 సిరీస్ లో నైనా అతనికి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు.
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.