IND VS AUS IT IS A DO OR DIE SERIES FOR RAHANE AND PUJARA SRD
Ind vs Aus : ఆస్ట్రేలియా సిరీస్ వారిద్ధరికీ ఎంతో కీలకం.. ఇదే లాస్ట్ ఛాన్స్..!
Cheteshwar Pujara
Ind vs Aus : టీమిండియా సీనియర్ ప్లేయర్లు ఛతేశ్వర్ పుజారా, అజింక్య రహానెకు తామెంటో నిరూపించుకునేందుకు ఇదే చివరి సిరీస్ కావొచ్చని మాజీ క్రికెటర్ దీస్ దాస్ గుప్తా అభిప్రాయపడ్డాడు.
టీమిండియా సీనియర్ ప్లేయర్లు ఛతేశ్వర్ పుజారా, అజింక్య రహానెకు తామెంటో నిరూపించుకునేందుకు ఇదే చివరి సిరీస్ కావొచ్చని మాజీ క్రికెటర్ దీస్ దాస్ గుప్తా అభిప్రాయపడ్డాడు. వీరిద్దరూ అద్భుతమైన ఆటగాళ్లే అయినా కొంతకాలంగా నిలకడగా రాణించడం లేదని పేర్కొన్నాడు. ఏదేమైనా బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో వారిపై బాధ్యతల బరువు ఎక్కువే ఉందని తెలిపాడు. ఇది వారికి చావోరేవో సిరీస్ అని వెల్లడించాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్టు సిరీసులో టీమ్ఇండియా 0-1తో వెనకబడింది. అడిలైడ్ వేదికగా గులాబి బంతితో జరిగిన డే/నైట్ టెస్టులో కోహ్లీసేన చిత్తుగా ఓడిపోయింది. రెండో రోజు పట్టుబిగించిన భారత్ మూడో రోజు రెండో ఇన్నింగ్స్లో 36కే కుప్పకూలింది. చరిత్రలోనే అత్యల్ప స్కోరుకు ఆలౌటైంది.
ఫస్ట్ టెస్ట్ లో సీనియర్స్ ప్లేయర్స్ రహనే, పుజారా అనుకున్నంతగా రాణించలేదు. ఇద్దరూ తక్కువ స్కోర్లుకే పరిమితమయ్యారు. తొలి టెస్టు ముగిశాక విరాట్ కోహ్లీ స్వదేశానికి బయల్దేరడంతో రహానె, పుజారా వంటి సీనియర్లపై బాధ్యత పెరిగింది. వారిప్పుడు కచ్చితంగా రాణించాల్సిన అవసరముందని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు.
‘అజింక్య రహానె, ఛతేశ్వర్ పుజారాకు ఇది పెద్ద సిరీస్ . ప్రత్యేకించి ఇప్పుడున్న సంక్లిష్ట సమయంలో మరీ ఎక్కువ బాధ్యత ఉంది. ఇప్పటికే రహానె అత్యుత్తమంగా ఆడటం లేదనే వ్యాఖ్యలూ వినిపిస్తున్నాయి. గత 2-3 ఏళ్లలో అతడు కొన్ని మ్యాచుల్లో బాగా రాణించాడు. ఎక్కువ శతకాలు చేయలేదన్న విషయాన్ని నేనూ అంగీకరిస్తాను. అందుకే అతడికి చావోరేవో తేల్చుకోవాల్సిన సిరీసే. ఇంకా చెప్పాలంటే పుజారాకూ అంతే’ అని దాస్గుప్తా అన్నాడు.
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.