హోమ్ /వార్తలు /క్రీడలు /

Gujarat Titans : గుజరాత్ టైటాన్స్ కు గుడ్ బై చెప్పిన స్టార్ ప్లేయర్! డబ్బే కారణమా? ఆ ట్వీట్ కు అర్థం ఇదే..

Gujarat Titans : గుజరాత్ టైటాన్స్ కు గుడ్ బై చెప్పిన స్టార్ ప్లేయర్! డబ్బే కారణమా? ఆ ట్వీట్ కు అర్థం ఇదే..

Gujarat Titans (IPL Twitter)

Gujarat Titans (IPL Twitter)

Gujarat Titans : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో అరంగేట్రం చేసిన గుజరాత్ టైటాన్స్ (GujaratTitans).. ఏకంగా చాంపియన్ గా నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎటువంటి అంచనాలు లేకుండా హార్దిక్ పాండ్యా (Hardik Pandya) నాయకత్వంలో బరిలోకి దిగిన గుజరాత్.. ఊహించని విధంగా విజయాలు సాధిస్తూ టాప్ లేపింది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Gujarat Titans : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో అరంగేట్రం చేసిన గుజరాత్ టైటాన్స్ (GujaratTitans).. ఏకంగా చాంపియన్ గా నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎటువంటి అంచనాలు లేకుండా హార్దిక్ పాండ్యా (Hardik Pandya) నాయకత్వంలో బరిలోకి దిగిన గుజరాత్.. ఊహించని విధంగా విజయాలు సాధిస్తూ టాప్ లేపింది. లీగ్ టేబుల్ ని అగ్రస్థానంతో ముగించిన గుజరాత్.. క్వాలిఫయర్ 1లో రాజస్తాన్ రాయల్స్ (Rajastan Royals)ను ఓడించి ఫైనల్ కు చేరింది. ఇక ఫైనల్లో మరోసారి రాజస్తాన్ రాయల్స్ పైనే గెలిచిన చాంపియన్ గా నిలిచింది. అయితే గుజరాత్ టైటాన్స్ చేసిన ఒక ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో దుమారానికి కారణం అయ్యింది. శుబ్ మన్ గిల్ ను ఉద్దేశిస్తూ చేసిన ఆ ట్వీట్ గురించి ప్రస్తుతం క్రికెట్ అభిమానులు తీవ్రంగా చర్చించుకుంటున్నారు.

‘ఈ ప్రయాణాన్ని మర్చిపోలేం. నీ భవిష్యత్తు విజయవంతంగా సాగాలని ఆశిస్తున్నాం’ అంటూ శుబ్ మన్ గిల్ ను ట్యాగ్ చేసింది గుజరాత్ టైటాన్స్. ఈ ట్వీట్ కు స్పందించిన గిల్ హగ్, హార్ట్ సింబల్స్ తో రీట్వీట్ చేశాడు. దాంతో గిల్ ను గుజరాత్ టైటాన్స్ వదులుకుంటుందంటూ పలువురు ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. డబ్బు కోసం గిల్ వేరే ఫ్రాంచైజీకి వెళ్తున్నట్లు కూడా మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఐపీఎల్ చాంపియన్ గా ఉన్న టీంను వదలడం అర్థం కావడం లేదని గిల్ తీరును తప్పుబడుతున్నారు. తనను రిలీజ్ చేయాల్సిందిగా గుజరాత్ ను గిల్ అడిగినట్లు సమాచారం. వేరే ఫ్రాంచైజీ ట్రాన్స్ ఫర్ విండో ద్వారా గుజరాత్ ను కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు కూడా వార్తుల వస్తున్నాయి. ఇదంతా ప్రాంక్ అంటూ కూడా కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఏది నిజమో తేలాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

2022 సీజన్ కోసం గిల్ ను రూ. 8 కోట్లకు గుజరాత్ టైటాన్స్ సొంతం చేసుకుంది. ఈ సీజన్ లో గిల్ 16 మ్యాచ్ ల్లో 483 పరుగులు చేశాడు. ఈ ఐపీఎల్ తర్వాత టీమిండియా తరఫున వన్డేల్లో కమ్ బ్యాక్ చేసిన గిల్ జింబాబ్వే పర్యటనలో సెంచరీ కూడా చేశాడు. భవిష్యత్తు టీమిండియా కెప్టెన్ అంటూ అందరి చేతా ప్రశంసలు అందుకుంటున్నాడు. అయితే గిల్ కోసం ముంబై ఇండియన్స్, కోల్ కతా నైట్ రైడర్స్ పోటీ పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Dinesh Karthik, Gujarat Titans, Hardik Pandya, India vs australia, India vs South Africa, IPL, IPL 2022, Jasprit Bumrah, KL Rahul, Mohammed Shami, Rishabh Pant, Rohit sharma, Team India, Virat kohli

ఉత్తమ కథలు