• HOME
  • »
  • NEWS
  • »
  • SPORTS
  • »
  • IND VS AUS INDIAN CRICKET TEAM PLAYERS AND SUPPORT STAFF TEST NEGATIVE FOR COVID 19 SU

Ind Vs Aus: భారత అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన బీసీసీఐ.. నేడు సిడ్నీకి టీమిండియా

Ind Vs Aus: భారత అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన బీసీసీఐ.. నేడు సిడ్నీకి టీమిండియా

BCCI (ఫైల్ ఫోటో)

భారత క్రికెట్ అభిమానులు బీసీసీఐ (Board of Control for Cricket in India) శుభవార్త చెప్పింది.

  • Share this:
    భారత క్రికెట్ అభిమానులు బీసీసీఐ (Board of Control for Cricket in India) శుభవార్త చెప్పింది. ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న టీమిండియ ఆటగాళ్ల అందరికి కరోనా నిర్ధారణ పరీక్షల్లో నెగిటివ్‌గా తేలిందని బీసీసీఐ వెల్లడించింది. భారత ఆటగాళ్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, రిషబ్ పంత్, నవదీప్ సైనీ, పృథ్వీ షాలు బయో బబుల్ నిబంధనలు ఉల్లంఘించినట్టుగా వారిపై ఆరోపణలు వచ్చాయి. వీళ్లు ఐదుగురు క్రికెట్ ఆస్ట్రేలియా ప్రొటోకాల్‌కు వ్యతిరేకంగా న్యూ ఇయర్ సందర్భంగా మెల్‌బోర్న్‌లోని ఓ రెస్టారెంట్‌కు వెళ్లి ఫుడ్ తినడంతో ఈ ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో ఆ ఐదురుగు క్రికెటర్లను ఐసోలేషన్‌లో ఉంచారు. ఈ నేపథ్యంలో వీరు మిగతా టీమ్ సభ్యులతో కలిసి జనవరి 4వ తేదీన సిడ్నీకి వెళ్లకపోవచ్చనే వార్తలు వెలువడ్డాయి. అయితే తాజాగా టీమిండియా క్రికెటర్స్ అందరికి కరోనా నెగిటివ్‌గా తేలిందని BCCI ప్రకటించింది. "టీమిండియా తరఫున ఆడుతున్న ఆటగాళ్లకు, సహాయక సిబ్బందికి జనవరి 3వ తేదీన కరోనా నిర్ధారణ కోసం RT-PCR Test నిర్వహించడం జరిగింది. అందరికి కరోనా నెగిటివ్ ఫలితాలు వచ్చాయి" అని బీసీసీఐ పేర్కొంది. దీంతో ఐసోలేషన్‌లో ఉన్న ఆటగాళ్లు కూడా సిడ్నీ బయలుదేరేందుకు మార్గం సుగమైనట్టుగా సమాచారం.

    ఇక, భారత్, ఆస్ట్రేలియా క్రికెట్ జట్లు సోమవారం ఒకే విమానంలో మెల్‌బోర్న్ నుంచి సిడ్నీకి చేరుకోనున్నాయి. సిడ్నీలోని జనవరి 7 నుంచి ప్రారంభం కానున్న మూడో టెస్ట్ మ్యాచ్‌లో ఇరు జట్లు తలపడనున్నాయి. మొత్తం నాలుగు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో.. ఇప్పటివరకు రెండు మ్యాచ్‌లు పూర్తి అయ్యాయి. అందులో మొదటి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విజయం సాధించగా, బాక్సింగ్ డే టెస్ట్‌లో టీమిండియా గెలుపు సాధించి సిరీస్‌పై ఆశలను సజీవంగా నిలుపుకుంది. ప్రస్తుతం 1-1 ‌తో ఇరుజట్లు సమంగా ఉన్నాయి. దీంతో మిగిలిన రెండు మ్యాచ్‌లపై క్రికెట్ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

    మరోవైపు మూడో టెస్ట్ మ్యాచ్ ముగిశార టీమిండియా, ఆస్ట్రేలియా జట్లు క్వీన్స్‌లాండ్‌లోని బ్రిస్బేన్‌కు బయలుదేరి వెళ్లాల్సి ఉంది. అక్కడ నాలుగో మ్యాచ్‌లో ఇరు జట్లు తలపడనున్నాయి. అయితే కరోనా నేపథ్యంలో సిడ్నీ ఉన్న న్యూసౌత్ వేల్స్ రాష్ట్రంతో బార్డర్‌ను క్వీన్స్‌లాండ్ మూసివేసింది. అయితే క్రికెట్ ఆస్ట్రేలియా రిక్వెస్ట్‌తో ప్రత్యేక అనుమతి ఇచ్చింది. అయితే తమ దేశంలోకి అడుగుపెట్టే ఆటగాళ్లు కఠిన నిబంధనలు పాటించాల్సి ఉంటుందని క్వీన్స్‌లాండ్ పేర్కొంది. ఈ నేపథ్యంలో బ్రిస్బేన్‌కు వెళ్లేందుకు టీమిండియా అయిష్టత ప్రదర్శిస్తుంది. నాలుగో టెస్ట్‌ను బ్రిస్బేన్‌లో కాకుండా సిడ్నీలోనే నిర్వహించాలని టీమిండియా కోరుకుంటుంది.
    Published by:Sumanth Kanukula
    First published:

    అగ్ర కథనాలు