బ్రిస్బేన్ వేదికగా ఆస్ట్రేలియా,భారత్ మధ్య జరుగుతోన్న చివరి టెస్టులో మూడో రోజు ఆట ముగిసింది. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ వికెట్ నష్టపోకుండా 6 ఓవర్లలో 21 పరుగులు చేసింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి డేవిడ్ వార్నర్(20), మార్కస్ హారిస్(1) క్రీజులో ఉన్నారు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోర్ 62 పరుగుల వద్ద ఆరంభమైన మూడోరోజు ఆటలో భారత్ వరుసగా వికెట్లు కోల్పోయింది. మెుదటిగా ఛెతేశ్వర్ పుజారా(25; 94 బంతుల్లో 2x4) హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో కీపర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
ఆ తర్వాత కెప్టెన్ అజింక్య రహానె(37), మయాంక్ అగర్వాల్(14) కొద్దిసేపు భారత్ ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్ళారు. కొద్దిసేపటి తర్వాత మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో మూడో స్లిప్‌లో ఉన్న వేడ్‌కు క్యాచ్ ఇచ్చి కెప్టెన్ అజింక్య రహానె(37; 93 బంతుల్లో 3x4) పెవిలియన్‌కు చేరాడు. ఇక మయాంక్ అగర్వాల్(38) సైతం హేజిల్‌వుడ్ బౌలింగ్‌లోనే ఔటయ్యాడు. అదుకుంటాడు అనుకున్న రిషభ్ పంత్(23) కూడా త్వరగానే వికెట్ సమర్పించుకున్నాడు. హేజిల్‌వుడ్ వేసిన 66.3 ఓవర్లో స్లిప్‌లో ఉన్న గ్రీన్ చేతికి చిక్కాడు. 186 పరుగులకు భారత్ ఆరో వికెట్లు కోల్పోయింది. ఈ సమయంలో భారత్ ఇన్నింగ్స్‌ను శార్ధుల్ ఠాకూర్(67) వాషింగ్టన్ సుందర్(60) ఆర్ధసెంచరీలతో చక్కదిద్దారు. అర్ధశతకాలతో ఏడో వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యాన్ని జోడించారు. ఆ తర్వాత కమిన్స్ ను ఠాకూర్‌ను పెవిలియన్ పంపగా, వాషింగ్టన్కు స్టార్క్ ఔట్ చేశాడు. ఆ తర్వాత వెంట వెంటనే భారత్ వికెట్లు కోల్పోయింది. దీంతో టీమ్ఇండియా 111.4 ఓవర్లలో 336 పరుగులు చేసింది. ఇక ఆసీస్ బౌలర్లలో హేజిల్‌వుడ్ 5 వికెట్లు తీయగా, స్టార్క్ 2, కమిన్స్ 2, లైయన్ ఒక వికెట్ తీశారు.
Published by:Rekulapally Saichand
First published:January 17, 2021, 14:05 IST