హోమ్ /వార్తలు /క్రీడలు /

IND vs AUS 3rd T20 tickets Issue : ’అవన్నీ వదంతులే.. టికెట్ల అమ్మకాల్లో మా ప్రమేయం లేదు‘ షాకింగ్ కామెంట్స్ చేసిన అజారుద్దీన్

IND vs AUS 3rd T20 tickets Issue : ’అవన్నీ వదంతులే.. టికెట్ల అమ్మకాల్లో మా ప్రమేయం లేదు‘ షాకింగ్ కామెంట్స్ చేసిన అజారుద్దీన్

PC : TWITTER

PC : TWITTER

IND vs AUS 3rd T20 tickets Issue : భారత్ (India), ఆస్ట్రేలియా (Australia) జట్ల మధ్య మూడు మ్యాచ్ ల సిరీస్ జరుగుతుంది. మూడో టి20 హైదరాబాద్ (Hyderabad)లోని ఉప్పల్ వేదికగా జరగాల్సి ఉంది. అయితే ఈ మ్యాచ్ టికెట్ల విషయంలో హైదరాబాద్ క్రికెట్ సంఘం (HCA) పరువు రోడ్డున పడింది. టికెట్ల అమ్మకాల్లో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

IND vs AUS 3rd T20 tickets Issue : భారత్ (India), ఆస్ట్రేలియా (Australia) జట్ల మధ్య మూడు మ్యాచ్ ల సిరీస్ జరుగుతుంది. మూడో టి20 హైదరాబాద్ (Hyderabad)లోని ఉప్పల్ వేదికగా జరగాల్సి ఉంది. అయితే ఈ మ్యాచ్ టికెట్ల విషయంలో హైదరాబాద్ క్రికెట్ సంఘం (HCA) పరువు రోడ్డున పడింది. టికెట్ల అమ్మకాల్లో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అదే సమయంలో జింఖానా గ్రౌండ్ లో ఆఫ్ లైన్ టికెట్ల కోసం ఫ్యాన్స్ ఎగబడటం.. పోలీసుల లాాఠీ చార్జ్.. తొక్కిసలాట వంటి అంశాలతో HCA అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్ ఇరుకునపడ్డాడు. దాంతో సీరియస్ అయిన తెలంగాణ ప్రభుత్వం దీనికి బాధ్యత వహించాల్సిందిగా అజారుద్దీన్ ను ఆదేశించింది. అంతేకాకుండా టికెట్ల విషయంలో ఏం జరిగిందో తమకు పూర్తి రిపోర్ట్ కావాలని కూడా ఆదేశాలను జారీ చేసింది. ఇలాంటి సంఘటనలు మళ్లీ రిపీట్ అయితే స్టేడియం నిర్వహణను తామే చూసుకుంటామని కాస్త గట్టిగానే చెప్పింది.

ఇక టికెట్ల విషయంలో ఏం జరిగిందో వివరాలను వెల్లడించేందుకు అజారుద్దీన్ ప్రెస్ కాన్ఫరెన్స్ ను నిర్వహించారు. ఇందులో అతడు కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆన్ లైన్ టికెట్స్ ను పేటీఎం చక్కగా అమ్మినట్లు పేర్కొన్నారు. టికెట్ల విషయంలో అనవసరంగా రచ్చ చేస్తున్నట్లు ఘాటు వ్యాఖ్యలు చేశారు. పారదర్శకంగా టికెట్లను అమ్మితే.. అక్రమాలు ఎలా జరిగాయని అంటారని మీడియానే ఎదురు ప్రశ్నించారు. ఆన్ లైన్ ద్వారా ఒక వ్యక్తి నాలుగు టికెట్లను కొనే అవకాశం ఉందని.. అలా టికెట్లు కొన్న వ్యక్తే మళ్లీ ఆఫ్ లైన్ లో టికెట్స్ కొనేందుకు వచ్చారని అందుకే ఆదార్ కార్డ్ ను అడిగినట్లు తెలిపారు. నాలుగు టికెట్లు కొన్నవారు ఏం చేస్తున్నారో మాకెలా తెలుస్తుందంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు.

సాంకేతికత పెరిగిన వేళ.. టికెట్లపై కొన్న వారి పేరు, ఆధార్ నంబర్ ను ప్రింట్ చేసేలా చర్యలు తీసుకోవచ్చని.. కానీ  HCA అటువంటివి పట్టించుకోలేదని కొందరు పేర్కొంటున్నారు. టికెట్లను ఏయే మార్గాలో ఎన్నెన్ని విక్రయించారో కూడా అజారుద్దీన్ మీడియాకు వివరించారు. 15వ తేదీన పేటియం ద్వారా 11,450.. పేటియం కార్పోరేట్ ద్వారా 4,000, మిగతా ఆన్ లైన్ సేల్స్ ద్వారా 2,100.. ఆఫ్ లైన్ (సెప్టెంబర్ 22న) 3,000.. మరో 6 వేల టికెట్లను స్టేక్ హోల్డర్స్, స్పాన్సర్స్, కార్పొరేట్స్ లకు అమ్మినట్లు తెలిపారు. మ్యాచ్ ను అందరు కలిసి విజయవంతం చేయాలంటూ కోరారు. టికెట్ల అమ్మకాలకు సంబంధించిన రిపోర్టును తెలంగాణ ప్రభుత్వానికి అందజేస్తామని కూడా ఆయన తెలిపారు. HCA కార్యదర్శి విజయానంద్ మాట్లాడుతూ.. టికెట్ల అమ్మకాల్లో తమ ప్రమేయం లేదని పేర్కొన్నారు. టికెట్ల విషయాన్ని పేటీఎం చూసుకుందని పేర్కొన్నారు.

Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Azaharuddin, Hyderabad, India vs australia, Rohit sharma, Team India, Virat kohli

ఉత్తమ కథలు