హోమ్ /వార్తలు /క్రీడలు /

India vs Australia : బ్యాటింగ్ రాదు.. ఫీల్డింగ్ కూడా చేయడం తెలియదా..? పృథ్వీ షా పై ట్రోల్స్

India vs Australia : బ్యాటింగ్ రాదు.. ఫీల్డింగ్ కూడా చేయడం తెలియదా..? పృథ్వీ షా పై ట్రోల్స్

prithvi shaw

prithvi shaw

India vs Australia : టీమిండియా ఆటగాడు పృథ్వీ షా మరోసారి ట్రోల్స్‌ బారీన పడ్డాడు. అడిలైడ్‌ వేదికగా జరగుతున్న డే నైట్‌ టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో ఓపెనర్‌గా వచ్చిన పృథ్వీ షా డకౌట్‌ అయి విమర్శలు మూట గట్టుకున్నాడు. తాజాగా పృథ్వీ షా మరోసారి నెటిజన్లకు అడ్డంగా దొరికిపోయాడు.

ఇంకా చదవండి ...

టీమిండియా ఆటగాడు పృథ్వీ షా మరోసారి ట్రోల్స్‌ బారీన పడ్డాడు. అడిలైడ్‌ వేదికగా జరగుతున్న డే నైట్‌ టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో ఓపెనర్‌గా వచ్చిన పృథ్వీ షా డకౌట్‌ అయి విమర్శలు మూట గట్టుకున్నాడు. గిల్‌ స్థానంలో పృథ్వీ ని ఎంపిక చేసిన మేనేజ్‌మెంట్‌ నిర్ణయాన్ని తప్పుబడుతూ ట్విటర్‌లో నెటిజన్లు తమదైన శైలిలో ట్రోల్‌ చేశారు. తాజాగా పృథ్వీ షా మరోసారి నెటిజన్లకు అడ్డంగా దొరికిపోయాడు. ఆసీస్‌ ఇన్నింగ్స్‌ సమయంలో 23వ ఓవర్‌లో మార్నస్‌ లబుషేన్‌ ఇచ్చిన సులువైన క్యాచ్‌ను పృథ్వీ షా వదిలేశాడు. అయితే అతను వదిలేసిన క్యాచ్‌ అంత కష్టంగా కూడా లేదు. బ్యాటింగ్‌లో డకౌట్‌ అయ్యాడన్న విమర్శలున్న షాను నెటిజన్లు మరోసారి టార్గెట్‌ చేశారు.

'పృథ్వీ షా జట్టుకు భారంగా మారాడు... నీకు బ్యాటింగే రాదనుకున్నాం.. ఇప్పుడు క్యాచ్‌ పట్టడం కూదా రాదని తెలిసిపోయింది... పృథ్వీ షా కెరీర్‌ డేంజర్‌ జోన్‌లో పడింది.. సాహా, పృథ్వీ షాలు జట్టుకు భారం.. భారత్‌ 10 మంది..ఆసీస్‌ 12 మందితో ఆడుతుంది..క్యాచ్‌లు పట్టడం రానివాడు అసలు అంతర్జాతీయ కెరీర్‌లోకి ఎలా వచ్చాడు..'అంటూ చురకలంటించారు.

నిన్న టీమిండియా ఇన్నింగ్స్‌లో మిచెల్ స్టార్క్ వేసిన రెండో బంతికే పృథ్వీ షా క్లీన్ బౌల్డ్ అయ్యాడు. గుడ్‌ లెంగ్త్‌ డెలివరీని అంచనా వేయడంలో వైఫల్యం చెందిన పృథ్వీ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో పృథ్వీ షాపై సోషల్‌ మీడియాలో నెటిజన్స్ సెటైర్స్ వెస్తున్నారు. గిల్‌,రాహుల్‌ను కాదని పృథ్వీ షాకు అవకాశాలు ఎందుకిస్తారో అర్థం కాదు. వరుసగా విఫలమవుతున్న అతని ఇంకెన్ని అవకాశలు ఇస్తారో తెలియదు. అలాంటి వాడు ఇంట్లో కూర్చోవడమే బెటర్ ' అంటూ ట్రోల్‌ చేశారు.

First published:

Tags: IND vs AUS, India vs Australia 2020, Jasprit Bumrah, Prithvi shaw

ఉత్తమ కథలు