HOME » NEWS » sports » IND VS AUS HANUMA VIHARIS EPIC REPLY TO BJP MP BABUL SUPRIOS TWEET WINNING THE INTERNET SRD

Ind vs Aus : నోరు పారేసుకున్న బీజేపీ ఎంపీ..తనదైన స్టైల్ లో హనుమ విహారి పంచ్..

Ind vs Aus : సిడ్నీటెస్ట్ లో టీమిండియా ఓడిపోకుండా.. డ్రాతో గట్టెక్కిందంటే దానికి కారణం మన తెలుగు బిడ్డ హనుమ విహారీ. ఈ సిడ్నీ హీరో మరోసారి వార్తలో నిలిచాడు. ఈసారి ఆట‌తో కాకుండా బీజేపీ ఎంపీకి తాను వేసిన ట్వీట్ పంచ్‌తో ట్రెండ్ అవుతున్నాడు.

news18-telugu
Updated: January 13, 2021, 7:42 PM IST
Ind vs Aus : నోరు పారేసుకున్న బీజేపీ ఎంపీ..తనదైన స్టైల్ లో హనుమ విహారి పంచ్..
Hanuma Vihari - Babul Suprio
  • Share this:
సిడ్నీటెస్ట్ లో టీమిండియా ఓడిపోకుండా.. డ్రాతో గట్టెక్కిందంటే దానికి కారణం మన తెలుగు బిడ్డ హనుమ విహారీ. ఈ సిడ్నీ హీరో మరోసారి వార్తలో నిలిచాడు. ఈసారి ఆట‌తో కాకుండా బీజేపీ ఎంపీకి తాను వేసిన ట్వీట్ పంచ్‌తో ట్రెండ్ అవుతున్నాడు. సిడ్నీలో గాయంతోనూ అత‌ను ప్ర‌ద‌ర్శించిన తెగువ‌కు క్రికెట్ ప్ర‌పంచ‌మంతా స‌లాం కొడుతుంటే.. క్రికెట్ గురించి ఏమాత్రం అవ‌గాహ‌న లేద‌ని చెప్పుకుంటూనే బీజేపీ ఎంపీ బాబుల్ సుప్రియో.. విహారి ఇన్నింగ్స్‌ను విమ‌ర్శించారు. 109 బంతుల్లో కేవ‌లం 7 ప‌రుగులు చేస్తాడా.. అత‌ని వ‌ల్లే టీమిండియా చారిత్ర‌క విజ‌యాన్ని సాధించ‌లేక‌పోయింది. విజ‌యం కోసం ప్ర‌య‌త్నించ‌క‌పోవ‌డం నేర‌మే అవుతుందంటూ బాబుల్ సుప్రియో ట్వీట్ చేశారు. అయితే అందులో హ‌నుమ విహారి పేరును త‌న‌కు అల‌వాటైన నార్త్ ఇండియ‌న్ స్టైల్లో హ‌నుమ బిహారి అని రాశారు. దీనికి విహారి ఇచ్చిన రిప్లై నెటిజ‌న్ల‌ను ఆక‌ర్షిస్తోంది.

ఆయ‌న చేసిన విమ‌ర్శ‌ల‌ను ఏమాత్రం ప‌ట్టించుకోకుండా సింపుల్‌గా త‌న పేరు త‌ప్పు రాశార‌ని చెప్పేలా హ‌నుమ విహారి అని రిప్లై ఇచ్చాడు. ఈ రిప్లైకి నెటిజ‌న్లు ఫిదా అయిపోయారు. ట్వీట్ ఆఫ్ ద డెకేడ్ అని ఒక‌రు.. ఎపిక్ అని మ‌రొక‌రు.. మంచి ఆన్స‌ర్ ఇచ్చావ‌ని ఇంకొక‌రు విహారిపై ప్ర‌శంస‌లు కురిపించారు. బాబుల్ సుప్రియో ట్వీట్‌‌ని చాలా మంది నెటిజన్లు విమర్శించారు.  టీమిండియా ఆఫ్ స్పిన్నర్ కూడా విహారీ రిప్లై కు ఫిదా అయ్యాడు.














హనుమ విహారి గాయపడిన విషయాన్ని గుర్తు చేస్తూ.. చివరి సెషన్‌లో అతని ఇన్నింగ్స్‌ ఎలా విలువైందో వివరిస్తూ మొట్టికాయలు వేశారు. ప్లే బ్యాక్ సింగర్‌గా గుర్తింపు పొందిన బాబుల్ సుప్రియో.. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చాడు.తొడ కండరాల గాయంతో ఆస్ట్రేలియాతో బ్రిస్బేన్ వేదికగా ఈ నెల 15 నుంచి ప్రారంభంకానున్న నాలుగో టెస్టుకి విహారి దూరమయ్యాడు.
Published by: Sridhar Reddy
First published: January 13, 2021, 7:39 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading