• HOME
  • »
  • NEWS
  • »
  • SPORTS
  • »
  • IND VS AUS FIVE TEAM INDIA PLAYERS PUT ON ISOLATION BY VIOLATING RULES SRD

Ind vs Aus : హద్దు దాటారు..ఐసోలేషన్ లో కూర్చున్నారు..టీమిండియా ఆటగాళ్లపై చర్యలు

Ind vs Aus : హద్దు దాటారు..ఐసోలేషన్ లో కూర్చున్నారు..టీమిండియా ఆటగాళ్లపై చర్యలు

టీమిండియా ప్లేయర్స్

Ind vs Aus : ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న టీమిండియాకు కీలక పరిమాణం చోటు చేసుకుంది. రోహిత్ శర్మ, రిషబ్ పంత్, శుభ్ మాన్ గిల్, పృథ్వీ షా, నవదీప్ సైనీలను టీమ్ మేనేజ్ మెంట్ ఐసోలేషన్ లో ఉంచింది.

  • Share this:
    ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న టీమిండియాకు కీలక పరిమాణం చోటు చేసుకుంది. రోహిత్ శర్మ, రిషబ్ పంత్, శుభ్ మాన్ గిల్, పృథ్వీ షా, నవదీప్ సైనీలను టీమ్ మేనేజ్ మెంట్ ఐసోలేషన్ లో ఉంచింది. న్యూ ఇయర్ సందర్భంగా టీమిండియా క్రికెటర్లు ఓ హోటల్‌కు వెళ్లారు. అక్కడ ఏంచక్కా భోజనం చేశారు. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కరోనా ఎఫెక్ట్ తో భారత్-ఆస్ట్రేలియా సిరీస్ ను బయో బబుల్ లో నిర్వహిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా బుడగ దాటి వెళ్లకూడదు. ఐతే ఆ హోటల్‌లో వారు కూర్చున్న టేబుల్ పక్కనే నవలదీప్ సింగ్ అనే ఇండియన్ కూర్చున్నాడు. టీమిండియా క్రికెటర్లు అక్కడే ఉన్నారని తెలిసి అతడు ఎంతో సంతోషపడ్డాడు. వారు భోజనం చేస్తుండగా వీడియో తీశాడు. అందులో రిషబ్ పంత్, రోహిత్ శర్మ, శుభమాన్ గిల్, నవదీప్ సైని కనిపించారు. ఐతే వారి భోజనం ఇక పూర్తయిందనుకున్న సమయంలో.. నవల్‌దీప్ సింగ్ నేరుగా కౌంటర్ వద్దకు వెళ్లి బిల్లు కట్టాడు.




    తర్వాత రోహిత్ శర్మ తన దగ్గరకు వచ్చి.. డబ్బులు తీసుకో బ్రదర్, బాగోదు అని చెప్పినట్లు నవల్‌దీప్ తెలిపాడు. రిషబ్ పంత్ తనను హగ్ చేసుకున్నాడని తెలిపాడు. క్రికెటర్లను కలుకోవడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నాడు. లంచ్ స్పాన్సర్ చేసినందుకు అందరూ థ్యాంక్స్ చెప్పినట్లు ట్విటర్లో వివరించాడు. ఈ ట్వీటే టీమిండియా క్రికెటర్లను చిక్కుల్లో పడేలా చేసింది.


    దీనిపై ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ఓ ప్రకటన విడుదల చేసింది. "ఆస్ట్రేలియా, భారత జట్ల వైద్య బృందాల సలహా మేరకు టూర్ మధ్యలో కొందరు ఆటగాళ్లను ముందు జాగ్రత్త చర్యగా ఐసోలేషన్ లో ఉంచుతున్నాం. ప్రయాణాల్లోనూ, సాధన సమయంలోనూ వీళ్లు భారత, ఆస్ట్రేలియా జట్లకు దూరంగా ఉంటారు" అని వివరించింది. ఈ ఘటనపై బీసీసీఐ, క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) విచారణ జరుపుతున్నాయి. బయో సెక్యూర్ బబుల్ లో ఉండాల్సిన ఆటగాళ్లు విందు కోసం బయటికి ఎలా వెళ్లారన్న దానిపై నిగ్గు తేల్చనున్నారు.ఆ అభిమానిని పంత్ ఆత్మీయంగా హత్తుకున్న విషయం ఇప్పుడు చర్చకు వస్తోంది. ఇది బయో సెక్యూర్ ప్రోటోకాల్ ఉల్లంఘన అని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో, తనను పంత్ హత్తుకున్నట్టు నిర్ధారణ అయితే ఆటగాళ్లు చిక్కుల్లో పడతారని భావించిన ఆ అభిమాని... పంత్ తనను అస్సలు హత్తుకోలేదని, తానే ఉద్వేగానికి లోనై అలా చెప్పానని తెలిపాడు.
    Published by:Sridhar Reddy
    First published: