India vs Australia: టీమిండియాకు భారీగా బోనస్.. ప్రధాని మోదీ ఏమన్నారంటే..

టీమిండియా విజయం

బోర్డర్ గవాస్కర్ సిరీస్ గెలిచినందుకు భారత జట్టుకు రూ.5 కోట్ల బోనస్‌ను ప్రకటించింది బీసీసీఐ. భారత క్రికెట్‌కు ఇవి ప్రత్యేకమైన క్షణాలని.. టీమిండియా అద్భుతమైన నైపుణ్యం కనబరిచిందని బీసీసీఐ సెక్రటరీ జయ్ షా ట్వీట్ చేశారు.

  • Share this:
    ఆస్ట్రేలియాలో టీమిండియా చరిత్ర సృష్టించింది. గబ్బాలో విజయంతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని కైవసం చేసుకుంది. 2-1 తేడాతో సిరీస్‌ను గెలిచింది. ఆస్ట్రేలియా గడ్డపై టెస్ట్ సిరీస్‌ను గెలవడంతో పాటు.. 31 ఏళ్లుగా గబ్బాలో ఓటమి ఎరుగని ఆసీస్‌ను ఓడించడంతో.. ఈ గెలుపు భారత్‌కు ఎంతో చారిత్రాత్మకమైంది. అందుకే టీమిండియాపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది. ముఖ్యంగా కుర్రాళ్లు అద్భుతంగా ఆడిన తీరు అందరినీ ఆకట్టుకుంది. గబ్బా టెస్ట్‌లో విజయంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా స్పందించారు. ఆస్ట్రేలియాలో టీమిండియా అద్భుత విజయం ఎంతో సంతృప్తినిచ్చిందని అభినందించారు.


    బోర్డర్ గవాస్కర్ సిరీస్ గెలిచినందుకు భారత జట్టుకు రూ.5 కోట్ల బోనస్‌ను ప్రకటించింది బీసీసీఐ. భారత క్రికెట్‌కు ఇవి ప్రత్యేకమైన క్షణాలని.. టీమిండియా అద్భుతమైన నైపుణ్యం కనబరిచిందని బీసీసీఐ సెక్రటరీ జయ్ షా ట్వీట్ చేశారు.

    గబ్బా టెస్ట్‌లో మ్యాచ్‌ మొదటి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా జట్టు 369 పరుగులు చేసింది. ఇక టీమిండియా 336 పరుగులు చేసి.. కాస్త వెనకబడింది. రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా బౌలర్లు విజృంభించారు. 294 పరుగులకే ఆసీస్‌ను కట్టడి చేశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్‌కు దిగిన భారత కుర్రాళ్లు అదరగొట్టాడు. 3 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై గెలిచారు. ఈ టెస్ట్ మ్యాచ్‌ విజయంలో శుభమాన్ గిల్, రిషబ్ పంత్, వాషింగ్టన్ సుందర్, శార్దుల్ ఠాకూర్, మహమ్మద్ సిరాజ్ కీలక పాత్ర పోషించారు.
    Published by:Shiva Kumar Addula
    First published: