Ind vs Aus : రూల్స్ బ్రేక్ చేసి ఆ నలుగురు క్రికెటర్లు అడ్డంగా బుక్ అయ్యారా..? చర్యలు తప్పవా..

టీమిండియా ప్లేయర్స్

Ind vs Aus : భారత క్రికెటర్లు ఆస్ట్రేలియా పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. ఒకవైపు ప్రాక్టీస్ ను చేస్తూనే.. మరోవైపు కాస్త సమయం దొరికినప్పుడు ఎంజాయ్ చేసున్నారు. అయితే న్యూ ఇయర్ సందర్భంగా టీమిండియా క్రికెటర్లు ఓ హోటల్‌కు వెళ్లారు. అక్కడ ఏంచక్కా భోజనం చేశారు. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కరోనా రూల్స్ బ్రేక్ చేయడంతో వారిపై చర్యలు తప్పేలా లేవు.

  • Share this:
    భారత క్రికెటర్లు ఆస్ట్రేలియా పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. ఒకవైపు ప్రాక్టీస్ ను చేస్తూనే.. మరోవైపు కాస్త సమయం దొరికినప్పుడు ఎంజాయ్ చేసున్నారు. అయితే న్యూ ఇయర్ సందర్భంగా టీమిండియా క్రికెటర్లు ఓ హోటల్‌కు వెళ్లారు. అక్కడ ఏంచక్కా భోజనం చేశారు. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కరోనా రూల్స్ బ్రేక్ చేయడంతో వారిపై చర్యలు తప్పేలా లేవు. కరోనా ఎఫెక్ట్ తో భారత్-ఆస్ట్రేలియా సిరీస్ ను బయో బబుల్ లో నిర్వహిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా బుడగ దాటి వెళ్లకూడదు. అయితే, బాక్సింగ్ డే టెస్ట్‌లో విజయం తర్వాత టీమిండియా క్రికెటర్లు కాస్త రిలాక్స్ అయ్యారు. మ్యాచ్ అనంతరం మెల్‌బోర్న్ వీధుల్లో తిరిగారు. ఓ రెస్టారెంట్‌కు వెళ్లి తమకు ఇష్టమైన ఫుడ్‌ను లాగించేశారు. ఐతే ఆ హోటల్‌లో వారు కూర్చున్న టేబుల్ పక్కనే నవలదీప్ సింగ్ అనే ఇండియన్ కూర్చున్నాడు. టీమిండియా క్రికెటర్లు అక్కడే ఉన్నారని తెలిసి అతడు ఎంతో సంతోషపడ్డాడు. వారు భోజనం చేస్తుండగా వీడియో తీశాడు. అందులో రిషబ్ పంత్, రోహిత్ శర్మ, శుభమాన్ గిల్, నవదీప్ సైని కనిపించారు. ఐతే వారి భోజనం ఇక పూర్తయిందనుకున్న సమయంలో.. నవల్‌దీప్ సింగ్ నేరుగా కౌంటర్ వద్దకు వెళ్లి బిల్లు కట్టాడు. ఈ విషయం క్రికెటర్లకు తెలియదు.



    భోజనం పూర్తయ్యాక టీమిండియా క్రికెటర్లు కౌంటర్ వద్దకు వెళ్లి బిల్లు కట్టేందుకు ప్రయత్నించారు. ఐతే మీ బిల్లును ఆ వ్యక్తి కట్టాడని నవల్‌దీప్ సింగ్ వైపు చూపించారు హోటల్ సిబ్బంది. అనంతరం రోహిత్ శర్మ తన దగ్గరకు వచ్చి.. డబ్బులు తీసుకో బ్రదర్, బాగోదు అని చెప్పినట్లు నవల్‌దీప్ తెలిపాడు. రిషబ్ పంత్ తనను హగ్ చేసుకున్నాడని తెలిపాడు. క్రికెటర్లను కలుకోవడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నాడు. లంచ్ స్పాన్సర్ చేసినందుకు అందరూ థ్యాంక్స్ చెప్పినట్లు ట్విటర్లో వివరించాడు. ఈ ట్వీటే టీమిండియా క్రికెటర్లను చిక్కుల్లో పడేలా చేసింది.


    సిడ్నీ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య జనవరి 7 నుంచి మూడో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. ప్రస్తుతం మెల్‌బోర్న్‌లోనే రెండు జట్లూ బస చేస్తున్నాయి. సిడ్నీలో కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకు పెరుగుతుండటంతో మ్యాచ్‌కి మూడు రోజులు ముందు మాత్రమే రెండు జట్లు అక్కడికి వెళ్లనున్నాయి. అంటే.. 4వ తేదీన ఇరు జట్లు సిడ్నీ చేరుకుంటాయి. ఈలోపే భారత ఆటగాళ్లు నలుగురు బయో-సెక్యూర్ బబుల్ రూల్స్ బ్రేక్ చేశారు. రెస్టారెంట్‌కు వెళ్లి ఫుడ్ తినడమే కాకుండా.. అక్కడ ఓ అభిమానికి హాగ్ కూడా ఇచ్చారు. ఇది బబుల్ నియమాలకు విరుద్ధం. దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. దీనిపై బీసీసీఐ దర్యాప్తు మొదలుపెట్టింది. ఈ విషయంపై బీసీసీఐ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.
    Published by:Sridhar Reddy
    First published: