వెస్టిండీస్ ఆల్‌రౌండర్ ఆండ్రూ రసెల్ కన్నా టీమిండియా బ్యాట్స్‌మన్ హార్దిక్ పాండ్య మెరుగైన ఆటగాడని వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డాడు. నిన్న ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20లో పాండ్య(42*; 22 బంతుల్లో 3x4, 2x6) మెరుపు బ్యాటింగ్ చేసి టీమిండియాను గెలిపించాడు. దీంతో కోహ్లీసేన మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-1 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా భజ్జీ ‘ఇండియా టుడే’తో మాట్లాడుతూ ‘హార్దిక్‌కు ఎప్పటినుంచో నైపుణ్యం ఉంది. అతడు భారీ సిక్సులు కొడతాడనే విషయం మాకు ముందు నుంచే తెలుసు. అయితే, ఇప్పుడు నిలకడగా ఆడుతున్నాడు. క్రీజులో నిలదొక్కుకొని మ్యాచ్‌లను పూర్తి చేసే బాధ్యతను తెలుసుకున్నాడు’ అని వివరించాడు.
పాండ్య రోజురోజుకూ ఆత్మవిశ్వాసం పెంచుకుంటున్నాడని, టీమ్ఇండియాకు అతడే సరైన ఫినీషరని భజ్జీ ఆశాభావం వ్యక్తం చేశాడు. అతడు రసెల్‌లాంటి ఆటగాడని, విండీస్ ఆల్‌రౌండర్ కన్నా ఒకింత ఉత్తమ ఆటగాడని తెలిపాడు. అవసరమైన వేళ భారీ సిక్సులు బాదుతూనే.. టెక్నిక్‌తో సింగిల్స్ తీయగల సమర్థుడని ప్రశంసించాడు. ‘ఎవరిని ఎప్పుడు లక్ష్యంగా చేసుకోవాలో పాండ్యకు తెలుసు. ఆ విధంగానే ఫాస్ట్ బౌలర్లపై పరుగులు తీస్తూ, స్పిన్నర్లపై బౌండరీలతో దాడి చేయాలనే విషయం కూడా తెలుసు. పాండ్యను ఇలా ఫినీషర్‌గా చూడటం ఆనందంగా ఉంది’ అని హర్భజన్ సంతోషం వ్యక్తం చేశాడు.
హర్జజన్ సింగ్ (ఫైల్ ఫోటో)
మరోవైపు కోహ్లీసేన సిరీస్ గెలవడంపై ఓపెనర్ రోహిత్ శర్మ ఓ ట్వీట్ చేశాడు. రెండో టీ20లో ఆటగాళ్లంతా బాగా ఆడారని మెచ్చుకున్నాడు. ప్రతీ ఒక్కరూ ఓ చేయి వేసి కొండంత లక్ష్యాన్ని కరిగించారని అభినందనలు తెలిపాడు. కోహ్లీసేన ప్రదర్శన తనని ఆకట్టుకుందని పేర్కొన్నాడు హిట్ మ్యాన్.
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.