అడిలైడ్ టెస్ట్ లో టీమిండియా బౌలర్లు అదరగొడుతున్నారు. కచ్చితమైన లెంగ్త్ అండ్ లైన్ తో ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ ను ఇబ్బందులు పెడుతున్నారు. 122 పరుగులకే ఏడు వికెట్లు కోల్పయి పీకల్లోతు కష్టాల్లో పడింది ఆస్ట్రేలియా టీమ్. బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నా.. ఫీల్డర్ల తప్పిదాలతో ఆస్ట్రేలియా ఈ మాత్రం స్కోరైనా చేసింది. ఇక ఆసీస్ బ్యాట్స్ మెన్ మార్నర్ లబుషేన్ అయితే ఏకంగా నక్కతోక ను తొక్కి వచ్చినట్టున్నాడు. లబుషేన్ తన ఇన్నింగ్స్ లో మూడు సార్లు అవుటయ్యే ప్రమాదం నుంచి బయటపడ్డాడు. అయినా లబుషేన్ తనకు వచ్చిన అవకాశాల్ని ఉపయోగించుకోలేకపోయాడు. 47 పరుగులు చేసిన లబుషేన్.. ఉమేష్ యాదవ్ బౌలింగ్ లో ఎల్బీగా వెనుదిరిగాడు. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ లో ఇప్పటివరకు లబుషేన్ చేసిన 47 పరుగులే అత్యధికం. అతన్ని క్యాచ్ ముందుగానే పట్టి ఉంటే. .ఆస్ట్రేలియా ఎప్పుడో ఆలౌటై ఉండేది.
బుమ్రా బౌలింగ్‌లో మొదటిసారి 3 పరుగుల వద్ద ఉన్నప్పుడు లబుషేన్ ఇచ్చిన క్యాచ్‌ను సాహా వదిలేశాడు. మళ్లీ 12 పరుగుల వద్ద షమీ బౌలింగ్‌లో బుమ్రా లబుషేన్ క్యాచ్‌ను జారవిడిచాడు. అయితే ఈ క్యాచ్ కొంత కష్టతరమైనదే. మూడోసారి బుమ్రా బౌలింగ్‌లో 22 పరుగుల వద్ద లబుషేన్ ఇచ్చిన సులువైన క్యాచ్‌ను ఈసారి పృథ్వీ షా జారవిడిచాడు. ఇలా మూడు సార్లు ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న లబుషేన్ కీలకమైన 47 పరుగులు చేశాడు.
Poor from Saha...didn't even get a glove on that.
FOLLOW #AUSvIND LIVE:
👉 https://t.co/nrSvVZVdjZ 👈 #INDvAUS pic.twitter.com/MDAzQ13pyG
— 🏏FlashScore Cricket Commentators (@FlashCric) December 18, 2020
Dropped! Labuschagne gets a life on 12! #AUSvIND live: https://t.co/LGCJ7zSdrY pic.twitter.com/ooHxon8aCE
— cricket.com.au (@cricketcomau) December 18, 2020
Dropped, again!
Luck is with Marnus Labuschagne 👀pic.twitter.com/RseThp7IF5
— ICC (@ICC) December 18, 2020
టాస్ గెలిచి బ్యాటింగ్ ఆరంబించిన భారత్ 244 పరుగులకు ఆలౌటైంది. తొలి రోజు కొనసాగింపుగా వృద్ధిమాన్ సాహా (9), రవిచంద్రన్ అశ్విన్ (15) క్రీజ్‌లో వచ్చిన వారిద్దరూ ఎక్కువ సేపు ఆడలేకపోయారు. 233/6 వద్ద ప్రారంభమైన ఆట కేవలం 11 పరుగులకే మిగితా వికెట్స్‌ను కోల్పొయింది. 25 బంతుల్లోనే నాలుగు వికెట్లను చేజార్చుకుంది. ఇక ఆసీస్ బౌలర్లలో కమిన్స్, స్టార్క్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. కమిన్స్.. అశ్విన్,ఉమేశ్ యాదవ్‌కు ఔట్ చేయగా.. షమిని, సాహాను స్టార్క్ బోల్తా కొట్టించాడు. చివరకు బుమ్రా (4*) నాటౌట్‌గా నిలిచాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: IND vs AUS, India vs Australia 2020, Jasprit Bumrah, Prithvi shaw