• HOME
  • »
  • NEWS
  • »
  • SPORTS
  • »
  • IND VS AUS AUSTRALIAN SPORTS JOURNALIST CHLOE AMANDA BAILEY POSTS COMEDIAN BRAHMANANDAM PHOTO WHICH GOES VIRAL SRD

Ind vs Aus : బ్రహ్మీ నువ్వు కేక.. బ్రహ్మానందం ఫోటోను పోస్ట్ చేసి క్రేజ్ తెచ్చుకున్న ఆస్ట్రేలియా లేడి జర్నలిస్ట్

Ind vs Aus : బ్రహ్మీ నువ్వు కేక.. బ్రహ్మానందం ఫోటోను పోస్ట్ చేసి క్రేజ్ తెచ్చుకున్న ఆస్ట్రేలియా లేడి జర్నలిస్ట్

బ్రహ్మానందం (File/Photo)

Ind vs Aus : బ్రహ్మానందం... ఈ పేరు వింటే చాలు, చాలామందికి నవ్వు వచ్చేసింది. తెర మీద ఆయన కనిపిస్తే చాలు, థియేటర్లో ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుకుంటారు. లేటెస్ట్ గా క్రికెట్ వరల్డ్ లో కూడా మన బ్రహ్మీకి తెగ క్రేజ్ వచ్చేసింది.లేటెస్ట్ గా సిడ్నీ టెస్టు సందర్భంగా ఓ ఆస్ట్రేలియా జర్నలిస్టు బ్రహ్మానందం పిక్‌ను పోస్టు చేయడమే ఇందుకు ప్రత్యేక్ష ఉదాహరణ.

  • Share this:
    బ్రహ్మానందం... ఈ పేరు వింటే చాలు, చాలామందికి నవ్వు వచ్చేసింది. తెర మీద ఆయన కనిపిస్తే చాలు, థియేటర్లో ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుకుంటారు. స్టార్ హీరోలకైనా హేటర్స్, యాంటీ ఫ్యాన్స్ ఉంటారేమో కానీ సినిమాలు చూసే ప్రతీ ఒక్కరూ బ్రహ్మానందం అంటే ఇష్టపడాల్సిందే, ఆయన కామెడీ చూసి పడి నవ్వాల్సిందే.బట్టతలతో ఎంట్రీ ఇచ్చి, క్లాస్... మాస్... బాల్కనీ, నేల టికెట్ అనే తేడా లేకుండా అందరితో విజిల్స్ వేయించగల స్టార్ ఎవ్వరైనా ఉన్నారా... అంటే అది కచ్చితంగా మన బ్రహ్మీ ఒక్కరే. ఇక మీమీ వరల్డ్ లో అయితే మన బ్రహ్మానందం ఓ లివింగ్ లెజెండ్.ఆయన ఎక్స్‌ప్రెషన్లతోనే రొటీన్ మీమీ కూడా జనాలను కడుపుబ్బా నవ్విస్తుంది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా బ్రహ్మానందానికి అభిమానులున్నారు. ఆయన మీమ్సీ, టెంప్లెట్స్‌కి క్రేజ్ ఉంది. లేటెస్ట గా సిడ్నీ టెస్టు సందర్భంగా ఓ ఆస్ట్రేలియా జర్నలిస్టు బ్రహ్మానందం పిక్‌ను పోస్టు చేయడమే ఇందుకు ప్రత్యేక్ష ఉదాహరణ.

    ‘సిడ్నీలో మళ్లీ వర్షం కురుస్తోంది. ఇప్పటికే ఓ సెట్ వర్షం కారణంగా కోల్పోయాం. ఆటకు వర్షం అడ్డంకి కలిగిందని చెప్పి నాకు వాతావరణ రిపోర్టు చెప్పిన స్నేహితుడి వైపు నేను ఇలా చూస్తున్నా...’ అంటూ బ్రహ్మానందం ఫన్నీ ఎక్స్‌ప్రెషన్‌ను ట్వీట్ చేసింది ఆస్ట్రేలియా లేడీ జర్నలిస్ట్ చోలీ అమాండా బెయిలీ. ఫన్నీగా ట్వీట్లు చేసే అమాండా, బ్రహ్మీ ఫోటో వాడడంతో తెలుగువారందరూ ఆమె ట్వీట్‌పై కామెంట్లు, లైకుల వర్షం కురిపించారు. అమాండా పోస్టులకి వచ్చే లైక్స్ కంటే బ్రహ్మీ పోస్టుకి కొన్ని వందల రెట్ల స్పందన రావడం విశేషం.


    మరోవైపు 166/2 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను కొనసాగించిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 338 పరుగులకు ఆలౌట్ అయింది. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్(131) సెంచరీతో చెలరేగగా.. మార్నస్ లబుషేన్(91) తృటిలో సెంచరీ కోల్పోయాడు. భారత బౌలర్లలో జడేజా నాలుగు వికెట్లు తీయగా.. నవ్‌దీప్ సైనీ, బుమ్రా రెండేసి వికెట్లు పడగొట్టారు. సిరాజ్‌కు ఒక వికెట్ దక్కింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన భారత్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 45 ఓవర్లలో 2 వికెట్లకు 96 రన్స్ చేసింది. క్రీజులో చతేశ్వర్ పుజారా(9 బ్యాటింగ్), అజింక్యా రహానే (4) ఉన్నారు. శుభ్‌మన్ గిల్(50) హాఫ్ సెంచరీతో పర్వాలేదనిపించినా.. ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన రోహిత్ శర్మ(26) తీవ్రంగా నిరాశపరిచాడు. హజెల్ వుడ్ బౌలింగ్‌లో రిటర్న్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. కొద్ది సేపటికే కమిన్స్ శుభ్‌మన్‌ను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు.
    Published by:Sridhar Reddy
    First published: