Ind vs Aus : బుద్దొచ్చింది.. భారతీయుల్ని, టీమిండియాను తక్కువ అంచనా వేయం..

Ind vs Aus

Ind vs Aus : ఆసీస్ గడ్డపై టీమిండియా చరిత్ర తిరగరాసింది. 33 ఏళ్లుగా ఓటమెరగని గబ్బా మైదానంలో ఆస్ట్రేలియాను మట్టి కరిపించింది. గబ్బా గర్జనతో ఆస్ట్రేలియాకు షాకిచ్చింది. ఈ విజయంపై పలువురు మాజీ క్రికెటర్లు, ప్రముఖులు టీమిండియాపై ప్రశంసల జల్లు కురిపించారు. ఇదిలా ఉంటే ఆస్ట్రేలియా కోచ్ జస్టిన్ లాంగర్..

  • Share this:
    ఆసీస్ గడ్డపై టీమిండియా చరిత్ర తిరగరాసింది. 33 ఏళ్లుగా ఓటమెరగని గబ్బా మైదానంలో ఆస్ట్రేలియాను మట్టి కరిపించింది. గబ్బా గర్జనతో ఆస్ట్రేలియాకు షాకిచ్చింది. ఈ విజయంపై పలువురు మాజీ క్రికెటర్లు, ప్రముఖులు టీమిండియాపై ప్రశంసల జల్లు కురిపించారు. ఇదిలా ఉంటే ఆస్ట్రేలియా కోచ్ జస్టిన్ లాంగర్ టీమిండియా విక్టరీపై చేసిన ఆసక్తికర కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయ్. అనుభవం లేని, గాయాల టీమిండియా ఇచ్చిన షాక్ ఆస్ట్రేలియా హెడ్ కోచ్ జస్టిన్ లాంగర్ కు బాగానే తగిలినట్టుంది. "ఈ మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించడానికి అన్ని అర్హతలు ఉన్నాయి. టీమిండియా ఆడిన తీరు అద్భుతం. ఈ టెస్టు సిరీస్ నుంచి మేము చాలా పాఠాలు నేర్చుకున్నాం. టీమిండియాను ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదు. 1.5 బిలియన్ల భారతీయులతో బలమున్న టీమిండియాను ఎన్నడూ తక్కువ అంచనా వేయకండి. సీనియర్ ఆటగాళ్ల గైర్హాజరీలో యువ క్రికెటర్లు అత్యుత్తమ ప్రదర్శన కనబరచడమే కాకుండా స్పూర్తిదాయకంగా ఆడారు. మరోసారి టెస్టు క్రికెట్ విలువేంటో కనిపించింది" అని జస్టిన్ లాంగర్ తెలిపాడు.

    అయితే, ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారాయి. పాపం లాంగర్.. ఓడిపోయినా తర్వాతైనా అసలు విషయాన్ని గ్రహించాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. బ్రిస్బేన్ వేదికగా ముగిసిన ఆఖరి టెస్ట్ లో 328 పరుగుల ఛేజింగ్ కు దిగిన టీమిండియా.. మరో మూడు వికెట్లు ఉండగానే విజయాన్ని అందుకుని టెస్ట్ సిరీస్‌ను 2-1తో గెలుచుకుంది.


    గబ్బా స్టేడియంలో ఆస్ట్రేలియాకి అజేయ రికార్డ్ ఉండడంతో టీమిండియా డ్రా కోసం ప్రయత్నిస్తుందని అంతా ఊహించారు. కానీ అద్భుతంగా ఆడిన రహానే సేన.. అందరి అంచనాల్ని తలకిందులు చేస్తూ చారిత్రక విజయాన్ని సొంతం చేసుకుంది. యువ ఆటగాళ్లు పటిష్ట పేస్ దళాన్ని ఎదుర్కొని పరుగుల వరద పారించారు. నాలుగు టెస్టుల సిరీస్‌ని 2-1తో గెలిచిన టీమిండియా.. ఆస్ట్రేలియా గడ్డపై రెండోసారి టెస్టు సిరీస్ గెలిచిన తొలి ఆసియా జట్టుగా నిలిచింది.
    Published by:Sridhar Reddy
    First published: