• HOME
  • »
  • NEWS
  • »
  • SPORTS
  • »
  • IND VS AUS AUSSIE MARNUS LABUSCHAGNE TRIED TO SLEDGE ROHIT SHARMA AND SHUBMAN GILL VIDEO GOES VIRAL SRD

Ind vs Aus : మూడో టెస్ట్ లో నోటికి పని చెప్పిన ఆసీస్ ప్లేయర్స్.. రోహిత్, గిల్ లను రెచ్చగొట్టిన లబుషేన్

Ind vs Aus : మూడో టెస్ట్ లో నోటికి పని చెప్పిన ఆసీస్ ప్లేయర్స్.. రోహిత్, గిల్ లను రెచ్చగొట్టిన లబుషేన్

marnus labuschagne (Photo : Twitter)

Ind vs Aus : ఆస్ట్రేలియా క్రికెట‌ర్లు అంటనే స్లెడ్జింగ్. వీరుకున్నంత నోటి దురుసు ఏ టీమ్ ఆటగాళ్లకు ఉండదు. క్రికెట్‌లో ఆట‌తోపాటు నోటికి ప‌ని చెప్పి గెల‌వ‌డం వాళ్ల‌కే చెల్లింది. అస‌లు క్రికెట్‌కు స్లెడ్జింగ్‌ను ప‌రిచ‌యం చేసిందే వాళ్లు. అయితే ఈ మ‌ధ్య కంగారూలు కాస్త త‌గ్గారు. కానీ తొలిసారి ఆ టీమ్ బ్యాట్స్‌మ‌న్ మార్న‌స్ ల‌బుషేన్‌ .. టీమిండియా బ్యాట్స్‌మెన్‌ను రెచ్చ‌గొట్టే ప్ర‌య‌త్నం చేశాడు.

  • Last Updated:
  • Share this:
    ఆస్ట్రేలియా క్రికెట‌ర్లు అంటనే స్లెడ్జింగ్. వీరుకున్నంత నోటి దురుసు ఏ టీమ్ ఆటగాళ్లకు ఉండదు. క్రికెట్‌లో ఆట‌తోపాటు నోటికి ప‌ని చెప్పి గెల‌వ‌డం వాళ్ల‌కే చెల్లింది. అస‌లు క్రికెట్‌కు స్లెడ్జింగ్‌ను ప‌రిచ‌యం చేసిందే వాళ్లు. అయితే ఈ మ‌ధ్య కంగారూలు కాస్త త‌గ్గారు. ఇంత‌కుముందు నోటి దురుసు వాళ్ల‌లో క‌నిపించ‌డం లేదు. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న సిరీస్‌లోనూ వాళ్లు ఆట‌కే ప్రాధాన్యం ఇస్తున్నారు. కానీ తొలిసారి ఆ టీమ్ బ్యాట్స్‌మ‌న్ మార్న‌స్ ల‌బుషేన్‌ .. టీమిండియా బ్యాట్స్‌మెన్‌ను రెచ్చ‌గొట్టే ప్ర‌య‌త్నం చేశాడు. ఓపెన‌ర్లు రోహిత్ శ‌ర్మ‌, శుభ్‌మ‌న్ గిల్ ఆడుతున్న స‌మ‌యంలో వాళ్ల ఏకాగ్ర‌త‌ను దెబ్బ‌తీయ‌డానికి ప్ర‌య‌త్నించాడు. సూటి పోటి మాటలతో ప్రత్యర్థి ఆటగాళ్ల ఏకాగ్రతను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. రెండో రోజు ఆటలో టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్‌లను ఆసీస్ ప్లేయర్ మార్నస్ లబుషేన్ కవ్వించాడు. సరదా ప్రశ్నలు, మాటలతో విసిగించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది.

    ఫార్వ‌ర్డ్ షార్ట్‌లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న ల‌బుషేన్‌‌.. ప‌దేప‌దే మాట‌ల‌తో గిల్, రోహిత్‌ల‌ను రెచ్చ‌గొట్టిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. నీ ఫేవ‌రెట్ ప్లేయ‌ర్ ఎవ‌రు.. స‌చినా, కోహ్లినా అంటూ గిల్‌ను అడిగాడు లాబుషేన్‌. త‌ర్వాత చెబుతాను అని గిల్ అంటున్నా.. ఈ బాల్ త‌ర్వాత చెబుతావా.. స‌చినా? కోహ్లినా అంటూ ప‌దే ప‌దే అడిగాడు. ఆ వెంటనే సచినా? అని ప్రశ్నిస్తూ.. విరాట్ కోహ్లీని లెక్కలోకి తీసుకోవా? అని అడిగాడు. అటు రోహిత్ శ‌ర్మ బ్యాటింగ్ చేస్తున్న స‌మ‌యంలో క్వారంటైన్‌లో ఏం చేశావ్ అంటూ ప్ర‌శ్నించాడు. ఈ సరదా సంభాషణకు సంబంధించిన వీడియోను ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ట్వీట్ చేయగా నెట్టింట వైరల్ అయింది.




    మరోవైపు 166/2 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను కొనసాగించిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 338 పరుగులకు ఆలౌట్ అయింది. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్(131) సెంచరీతో చెలరేగగా.. మార్నస్ లబుషేన్(91) తృటిలో సెంచరీ కోల్పోయాడు. భారత బౌలర్లలో జడేజా నాలుగు వికెట్లు తీయగా.. నవ్‌దీప్ సైనీ, బుమ్రా రెండేసి వికెట్లు పడగొట్టారు. సిరాజ్‌కు ఒక వికెట్ దక్కింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన భారత్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 45 ఓవర్లలో 2 వికెట్లకు 96 రన్స్ చేసింది. క్రీజులో చతేశ్వర్ పుజారా(9 బ్యాటింగ్), అజింక్యా రహానే (4) ఉన్నారు. శుభ్‌మన్ గిల్(50) హాఫ్ సెంచరీతో పర్వాలేదనిపించినా.. ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన రోహిత్ శర్మ(26) తీవ్రంగా నిరాశపరిచాడు. హజెల్ వుడ్ బౌలింగ్‌లో రిటర్న్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. కొద్ది సేపటికే కమిన్స్ శుభ్‌మన్‌ను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు.
    Published by:Sridhar Reddy
    First published:

    అగ్ర కథనాలు