Ind vs Aus : నీ స్లెడ్జింగ్ ను మా కూతురు ఏడుపులా భావించాడేమో..టిమ్ పైన్ కు ప్రీతి అశ్విన్ చురకలు

Ashwin wife prithi

Ind vs Aus : ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్ పైన్ అయితే పదే పదే స్లెడ్జింగ్ కు దిగుతూనే ఉన్నాడు. ముఖ్యంగా అశ్విన్- విహారీ బ్యాటింగ్‌కు విసిగిపోయాడు. వారిద్దరి వికెట్ ఎలా తీయాలో తెలియక .. నోరు పారేసుకున్నాడు.

  • Share this:
    సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతోన్న మూడో టెస్టు మ్యాచ్‌ని భారత్ డ్రాగా ముగించింది. చివరి రోజు ఆటలో అద్భుతంగా పోరాడి బోర్డర్ గవాస్కర్ సిరీస్ పై ఆశలను సజీవంగా ఉంచుకుంది. అసలైన టెస్ట్ ఇన్నింగ్స్ అంటే ఏంటో ఆస్ట్రేలియన్లకు చూపించారు మన బ్యాట్స్ మెన్. ఇక 407 పరుగుల భారీ లక్ష్యం విధించిన ఆసీస్.. చివరి రోజు తమ పని సులవు అవుతుందని భావించింది. కానీ అలా జరగకపోవడంతో ఆ జట్టు ఆటగాళ్లు తీవ్ర అసహనానికి గురయ్యారు. భారత ఆటగాళ్లపై పదే పదే నోరు పారేసుకున్నారు.ముఖ్యంగా కెప్టెన్ టిమ్ పైన్ అయితే పదే పదే స్లెడ్జింగ్ కు దిగుతూనే ఉన్నాడు. ముఖ్యంగా అశ్విన్- విహారీ బ్యాటింగ్‌కు విసిగిపోయాడు. వారిద్దరి వికెట్ ఎలా తీయాలో తెలియక .. నోరు పారేసుకున్నాడు. బ్యాట్స్‌మెన్‌ను గాయపరచడమే లక్ష్యంగా పెట్టుకుని బౌలర్లు బంతులు విసరగా... ఆసీస్ కెప్టెన్ టిమ్ పైన్ నోటికొచ్చినట్టు మాట్లాడుతూ సెడ్జింగ్‌కు పాల్పడ్డాడు. ఇక భారత ఆటగాళ్లపై పదే పదే నోరుపారేసుకున్న ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్ పైన్‌కు రవిచంద్రన్ అశ్విన్ సతీమణి ప్రీతి అశ్విన్ గట్టిగా కౌంటరిచ్చారు. ఆస్ట్రేలియా కెప్టెన్ స్లెడ్జింగ్‌ను అశ్విన్ తమ కూతురు ఏడుపుగా భావించి ఓపికగా ఉండి ఉంటాడని ట్వీట్ చేశారు. ఇక వెన్ను గాయంతో ఇబ్బంది పడుతున్నా మైదానంలో అశ్విన్ చూపిన పోరాటపటిమ అద్భుతమని కొనియాడారు. ఇక బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో భాగంగా సిడ్నీ వేదికగా జరిగిన మూడో టెస్ట్‌ను భారత్ డ్రా చేసుకున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ చివరి రోజు హనుమ విహారీతో కలిసి అశ్విన్ అద్భుతంగా పోరాడాడు.

    అయితే ఈ ఇద్దరి నిలకడైన బ్యాటింగ్‌కు సహనం కోల్పోయిన ఆసీస్ ఆటగాళ్లు.. స్లెడ్జింగ్‌కు దిగారు. ముఖ్యంగా ఆసీస్ కెప్టెన్ టిమ్ పైన్ ఇంగిత జ్ఞానం లేకుండా ప్రవర్తించాడు. చెస్ట్ ప్యాడ్ కోసం వెళ్లిన అశ్విన్‌పై కేకలు వేశాడు. కావాలనే భారత ఆటగాళ్లు టైమ్ వృథా చేస్తున్నారని, చెస్ట్ ప్యాడ్ పెట్టుకోవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించాడు. ఇక పైన్ తీరుపై భారత అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా దుమ్మెత్తిపోశారు.




    దీంతో ప్రస్తుతం ఆసీస్‌లోనే ఉన్న అశ్విన్ సతీమణి ప్రీతి కూడా గట్టిగా కౌంటరిచ్చింది. అశ్విన్ సహనంగా ఉండటం అద్భుతమని, తమ కూతురు ఆధ్యా మూడు గంటలకు లేచి ఆగకుండా ఏడ్చినట్లు.. పైన్ స్లెడ్జింగ్ ఉందని భావించి ఉంటాడని ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్లు నెట్టింట వైరల్ అయ్యాయి. ప్రీతి ట్వీట్లపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. కౌంటర్ అదిరిపోయిందని కామెంట్ చేస్తున్నారు.
    Published by:Sridhar Reddy
    First published: