హోమ్ /వార్తలు /క్రీడలు /

IND vs AUS : అయ్యో కోహ్లీ ఎంత పనైంది.. ముగిసిన నాలుగో రోజు ఆట.. ఎవరు ఆధిక్యంలో ఉన్నారంటే?

IND vs AUS : అయ్యో కోహ్లీ ఎంత పనైంది.. ముగిసిన నాలుగో రోజు ఆట.. ఎవరు ఆధిక్యంలో ఉన్నారంటే?

PC : BCCI

PC : BCCI

IND vs AUS 4th Test Live Scores : అహ్మదాాబాద్ (Ahmedabad) వేదికగా ఆస్ట్రేలియా (Australia)తో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా (Team India) తొలి ఇన్నింగ్స్ లో భారీ స్కోరును సాధించింది. భారత్ తన తొలి ఇన్నింగ్స్ లో 178.5 ఓవర్లలో 571 పరుగులకు ఆలౌటైంది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

IND vs AUS 4th Test Live Scores : అహ్మదాాబాద్ (Ahmedabad) వేదికగా ఆస్ట్రేలియా (Australia)తో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా (Team India) తొలి ఇన్నింగ్స్ లో భారీ స్కోరును సాధించింది. భారత్ తన తొలి ఇన్నింగ్స్ లో 178.5 ఓవర్లలో 571 పరుగులకు ఆలౌటైంది. విరాట్ కోహ్లీ (364 బంతుల్లో 186; 15 ఫోర్లు) వీరోచిత సెంచరీతో కదంతొక్కాడు. శుబ్ మన్ గిల్ (235 బంతుల్లో 128; 12 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీ చేశాడు. అక్షర్ పటేల్ (113 బంతుల్లో 79; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధ శతకంతో ఆకట్టుకున్నాడు. నాథన్ లయన్, టాడ్ మర్ఫీలు చెరో మూడు వికెట్లు సాధించారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఆస్ట్రేలియా నాలుగో రోజు ముగిసే సమయానికి 6 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 3 పరుగులు చేసింది. క్రీజులో ట్రావిస్ హెడ్ (3 బ్యాటింగ్), కునెమన్ (0 బ్యాటింగ్) ఉన్నారు. ఆస్ట్రేలియా మరో 88 పరుగులు వెనుకబడి ఉంది.

నాలుగో రోజు ఆటలో కోహ్లీ ఇన్నింగ్స్ హైలైట్ గా నిలిచింది. మూడో రోజు అర్ధ సెంచరీతో  నాటౌట్ గా నిలిచిన కోహ్లీ.. నాలుగో రోజు సెంచరీ బాదాడు. ఈ క్రమంలో 1205 రోజుల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత టెస్టుల్లో మళ్లీ సెంచరీ అందుకున్నాడు. కోహ్లీకి ఇది 28వ టెస్టు సెంచరీ. మూడో సెషన్ లో కోహ్లీ, అక్షర్ పటేల్ లు సూపర్ బ్యాటింగ్ తో రెచ్చిపోయారు. ముఖ్యంగా అక్షర్ పటేల్ ధనాధన్ బ్యాటింగ్ తో ఆస్ట్రేలియా ప్లేయర్లపై విరుచుకుపడ్డాడు. వీరిద్దరూ 6వ వికెట్ కు 162 పరుగులు జోడించారు. దాంతో భారత్ ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ స్కోరును దాటేసింది. అయితే భారీ షాట్ ఆడే క్రమంలో అక్షర్ పటేల్ వికెట్ల మీదకు ఆడుకున్నాడు. అనంతరం అశ్విన్ (7), ఉమేశ్ యాదవ్ (0) వెంట వెంటనే అవుటయ్యారు. డబుల్ సెంచరీ చేస్తాడనుకున్న కోహ్లీ.. ఆఖరి వికెట్ గా వెనుదిరిగాడు. వెన్ను గాయంతో శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ కు రాలేదు.

అంతకుముందు ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్ లో 167.2 ఓవర్లలో 480 పరుగులకు ఆలౌటైంది. రవిచంద్రన్ అశ్విన్ 6 వికెట్లతో మెరిశాడు. ఓవర్ నైట్ స్కోరు 255/4తో రెండో రోజు ఆట కొనసాగించిన ఆస్ట్రేలియాకు గ్రీన్, ఖవాజాలు భారీ భాగస్వామ్యాన్ని అందించారు.  ఓవర్ నైట్ బ్యాటర్ కెమరూన్ గ్రీన్ (170 బంతుల్లో 114; 18 ఫోర్లు) శతకంతో మెరిశాడు. ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా (422 బంతుల్లో 180 ; 21 ఫోర్లు) కదం తొక్కారు.

టీమిండియా

రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్ మన్ గిల్, చేతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ శ్రీకర్ భరత్, జడేజా, అక్షర్ పటేల్, అశ్విన్, ఉమేశ్ యాదవ్, షమీ

ఆస్ట్రేలియా

ట్రావిస్ హెడ్, ఖవాజా, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్ (కెప్టెన్), గ్రీన్, హ్యాండ్స్ కాంబ్, అలెక్స్ క్యారీ, స్టార్క్, మర్ఫీ, కొనెమన్, నాథన్ లయన్

First published:

Tags: Axar Patel, IND vs AUS, India vs australia, Shubman Gill, Virat kohli

ఉత్తమ కథలు