IND vs AUS 3rd Test : క్రికెట్ లవర్స్ ఫోకస్ మొత్తం ఇండోర్ (Indore)కు షిఫ్ట్ అయ్యింది. ఎందుకంటే బోర్డర్ గావస్కర్ ట్రోఫీ 2023 (Border Gavaskar Trophy)లో భాగంగా జరిగే మూడో టెస్టు ఇండోర్ వేదికగానే జరగనుంది. ఇప్పటికే తొలి రెండు టెస్టుల్లో నెగ్గిన భారత్ (India) సిరీస్ పై కన్నేసింది. మూడో టెస్టులో నెగ్గినా.. లేదా డ్రా చేసుకున్న బోర్డర్ గావస్కర్ ట్రోఫీ భారత్ ఖాతాలో చేరుతుంది. తొలి రెండు మ్యాచ్ ల్లోనూ ఓడిన ఆస్ట్రేలియా సిరీస్ ను సొంతం చేసుకునే అవకాశాన్ని కోల్పోయింది. అయితే ’డ్రా‘ చేసే అవకాశం మాత్రం ఉంది. అయితే వారి ఫామ్ ను చూస్తే ఇది కాస్త కష్టమనే చెప్పాలి. మూడో టెస్టుకు ప్యాట్ కమిన్స్ దూరం కావడంతో స్టీవ్ స్మిత్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు.
ఆ ఇద్దరిలో ఎవరికి అవకాశం?
కేఎల్ రాహుల్ పై ప్రస్తుతం పెద్ద డిబేట్ నడుస్తుంది. వరుసగా విఫలం అవుతున్న రాహుల్ ను పక్కనపెట్టి సూపర్ ఫామ్ లో ఉన్న శుబ్ మన్ గిల్ కు అవకాశం ఇవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు. బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో ఆడిన 3 ఇన్నింగ్స్ ల్లో రాహుల్ కేవలం 38 పరుగులు మాత్రమే చేశాడు. మరోవైపు ఈ ఏడాది సెంచరీల మీద సెంచరీలు చేసిన శుబ్ మన్ గిల్ మాత్రం బెంచ్ కే పరిమితం అయ్యాడు. తొలి రెండు టెస్టులకు టీమిండియా వైస్ కెప్టెన్ గా ఉన్న రాహుల్ ను ఆ పదవి నుంచి తప్పించారు. దాంతో మూడో టెస్టులో రాహుల్ ఆడేది అనుమానమే. లేదు మరో అవకాశం ఇవ్వాలని మేనేజ్ మెంట్ భావిస్తే మాత్రం గిల్ మరోసారి బెంచ్ కే పరిమితం కావాల్సి ఉంటుంది.
అయోమయంలో ఆసీస్
ఆస్ట్రేలియా పరిస్థితి ఏ మాత్రం బాగాలేదు. గాయాలతో జాష్ హేజల్ వుడ్, డేవిడ్ వార్నర్ లు స్వదేశానికి వెళ్లిపోయారు. రెండో స్పిన్నర్ గా భారత్ కు వచ్చిన అగర్ ను కూడా వెనక్కి పంపేశారు. ఇక స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్ లు ఆశించిన స్థాయిలో ఆడటం లేదు. సింపుల్ గా చెప్పాలంటే ఆస్ట్రేలియా జట్టులో అయోమయపరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఇక మూడో టెస్టులో జట్టులో రెండు మార్పులు ఉండే అవకాశం ఉంది. కమిన్స్ స్థానంలో మిచెల్ స్టార్క్, రెన్ షా స్థానంలో గ్రీన్ తుది జట్టులో ఆడే అవకాశం ఉంది. రెండో టెస్టులో ఆసీస్ కేవలం ఒక పేసర్ తో మాత్రమే బరిలోకి దిగింది. ఇద్దరు పేసర్లతో బరిలోకి దిగాల్సి వస్తే మాత్రం మ్యాథ్యూ కునెమన్ స్థానంలో బొలాండ్ తుది జట్టులో ఆడే అవకాశం ఉంది. ఇండోర్ వికెట్ తొలి రెండు రోజులు పేసర్లకు అనుకూలించే అవకాశం ఉంది.
తుది జట్లు (అంచనా)
రోహిత్ శర్మ (కెప్టెన్), గిల్/రాహుల్, పుజారా, కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, శ్రీకర్ భరత్, జడేజా, అక్షర్ పటేల్, అశ్విన్, షమీ, సిరాజ్
ఆస్ట్రేలియా
స్టీవ్ స్మిత్ (కెప్టెన్), ఉస్మాన్ ఖవాజా, ట్రావిస్ హెడ్, మార్నస్ లబుషేన్, హ్యాండ్స్ కాంబ్, గ్రీన్, క్యారీ, స్టార్క్, మర్ఫీ, లయన్, బొలాండ్
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: IND vs AUS, India vs australia, KL Rahul, Rohit sharma, Shubman Gill, Steve smith