క్రికెట్ లవర్స్ ఫోకస్ మొత్తం ఇండోర్ (Indore)కు షిఫ్ట్ అయ్యింది. బోర్డర్ గావస్కర్ ట్రోఫీ 2023 (Border Gavaskar Trophy)లో భాగంగా జఇప్పటికే తొలి రెండు టెస్టుల్లో నెగ్గిన భారత్ (India) సిరీస్ పై కన్నేసింది. మూడో టెస్టులో నెగ్గినా.. లేదా డ్రా చేసుకున్న బోర్డర్ గావస్కర్ ట్రోఫీ భారత్ ఖాతాలో చేరుతుంది. తొలి రెండు మ్యాచ్ ల్లోనూ ఓడిన ఆస్ట్రేలియా సిరీస్ ను సొంతం చేసుకునే అవకాశాన్ని కోల్పోయింది. అయితే ’డ్రా‘ చేసే అవకాశం మాత్రం ఉంది. అయితే వారి ఫామ్ ను చూస్తే ఇది కాస్త కష్టమనే చెప్పాలి. ఇక, ఈ మ్యాచులో టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచులో గెలిస్తే టీమిండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ లో సగర్వంగా అడుగుపెడుతుంది. దీంతో.. ఈ మ్యాచులో కూడా ఆస్ట్రేలియాను కంగారు పెట్టించాలని రోహిత్ సేన భావిస్తుంది.
ఇక, టీమిండియా రెండు మార్పులతో బరిలోకి దిగుతుంది. జిడ్డు స్టార్ కేఎల్ రాహుల్ పై వేటు వేసింది. అతని స్థానంలో పరుగుల వీరుడు శుభ్ మన్ గిల్ జట్టులోకి వచ్చాడు. ఇక.. షమీ స్థానంలో ఉమేష్ యాదవ్ జట్టులోకి వచ్చాడు. ఆస్ట్రేలియా జట్టు కూడా రెండు మార్పులతో బరిలోకి దిగుతుంది. వార్నర్, ప్యాట్ కమిన్స్ స్థానంలో స్టార్క్, గ్రీన్ జట్టులోకి వచ్చారు.
???? Toss Update from Indore ????#TeamIndia have elected to bat against Australia in the 3⃣rd #INDvAUS Test. Follow the match ▶️ https://t.co/xymbrIdggs@mastercardindia pic.twitter.com/qy7tRSIHS0
— BCCI (@BCCI) March 1, 2023
టీమిండియాలో కేఎల్ రాహుల్ పై ప్రస్తుతం పెద్ద డిబేట్ నడుస్తుంది. వరుసగా విఫలం అవుతున్న రాహుల్ ను పక్కనపెట్టి సూపర్ ఫామ్ లో ఉన్న శుబ్ మన్ గిల్ కు చోటు దక్కడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో ఆడిన 3 ఇన్నింగ్స్ ల్లో రాహుల్ కేవలం 38 పరుగులు మాత్రమే చేశాడు. మరోవైపు ఈ ఏడాది సెంచరీల మీద సెంచరీలు చేసిన శుబ్ మన్ గిల్ మాత్రం బెంచ్ కే పరిమితం అయ్యాడు. తొలి రెండు టెస్టులకు టీమిండియా వైస్ కెప్టెన్ గా ఉన్న రాహుల్ ను ఆ పదవి నుంచి తప్పించారు. దాంతో మూడో టెస్టులో రాహుల్ ను పక్కన పెట్టారు.
మరోవైపు.. ఆస్ట్రేలియా పరిస్థితి ఏ మాత్రం బాగాలేదు. గాయాలతో జోష్ హేజల్ వుడ్, డేవిడ్ వార్నర్ లు స్వదేశానికి వెళ్లిపోయారు. కుటుంబ సమస్యల కారణంగా కమిన్స్ కూడా స్వదేశానికి వెళ్లాడు. రఇక స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్ లు ఆశించిన స్థాయిలో ఆడటం లేదు. సింపుల్ గా చెప్పాలంటే ఆస్ట్రేలియా జట్టులో అయోమయపరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఇక మూడో టెస్టులో జట్టులో కమిన్స్ స్థానంలో మిచెల్ స్టార్క్, వార్నర్ స్థానంలో గ్రీన్ తుది జట్టులో చోటు దక్కించుకున్నారు.
తుది జట్లు
టీమిండియా
రోహిత్ శర్మ (కెప్టెన్), గిల్, ఛతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, శ్రీకర్ భరత్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, ఉమేష్ యాదవ్, సిరాజ్
ఆస్ట్రేలియా
స్టీవ్ స్మిత్ (కెప్టెన్), ఉస్మాన్ ఖవాజా, ట్రావిస్ హెడ్, మార్నస్ లబుషేన్, హ్యాండ్స్ కాంబ్, గ్రీన్, క్యారీ, స్టార్క్, మర్ఫీ, లయన్, మ్యాథ్యూ కున్మెన్
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: IND vs AUS, India vs australia, KL Rahul, Ravichandran Ashwin, Ravindra Jadeja, Rohit sharma, Shubman Gill, Steve smith, Virat kohli