హోమ్ /వార్తలు /క్రీడలు /

IND vs AUS 3rd T20 : డిసైడర్ లో టాస్ నెగ్గిన రోహిత్.. ఒక మార్పు చేసిన టీమిండియా.. తుది జట్లు ఇవే

IND vs AUS 3rd T20 : డిసైడర్ లో టాస్ నెగ్గిన రోహిత్.. ఒక మార్పు చేసిన టీమిండియా.. తుది జట్లు ఇవే

PC : TWITTER

PC : TWITTER

IND vs AUS 3rd T20 : ఆస్ట్రేలియా (Australia)తో మూడు మ్యాచ్ ల టి20 సిరీస్ ఆఖరి అంకానికి చేరుకుంది. తొలి రెండు టి20ల్లో ఆస్ట్రేలియా ఒకసారి భారత్ (India) మరోసారి విజయం సాధించడంతో సిరీస్ సమమైంది. ఇక సిరీస్ విజేతను తేల్చే బాధ్యతను హైదరాబాద్ (Hyderabad) తీసుకుంది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

IND vs AUS 3rd T20 : ఆస్ట్రేలియా (Australia)తో మూడు మ్యాచ్ ల టి20 సిరీస్ ఆఖరి అంకానికి చేరుకుంది. తొలి రెండు టి20ల్లో ఆస్ట్రేలియా ఒకసారి భారత్ (India) మరోసారి విజయం సాధించడంతో సిరీస్ సమమైంది. ఇక సిరీస్ విజేతను తేల్చే బాధ్యతను హైదరాబాద్ (Hyderabad) తీసుకుంది. ఇక్కడి ఉప్పల్ స్టేడియంలో మరికాసేపట్లో ఆరంభం అయ్యే డిసైడర్ పోరులో టాస్ నెగ్గిన టీ మిండియా (Team India) కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ కోసం భారత్ ఒక మార్పు చేసింది. రిషభ్ పంత్ ను పక్కన పెట్టి అతడి స్థానంలో భువనేశ్వర్ కుమార్ ను తుది జట్టులోకి తీసుకుంది. ఇక అదే సమయంలో ఆస్ట్రేలియా కూడా ఒక మార్పు చేసింది. షాన్ అబాట్ ను పక్కన పెట్టి జాష్ ఇంగ్లిస్ ను తీసుకుంది.

చహల్ కు మరోసారి అవకాశం

గత కొన్ని మ్యాచ్ ల్లో యుజువేంద్ర చహల్   తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడం లేదు. భారీగా పరుగులు సమర్పించుకుంటున్నాడు. వికెట్ టేకింగ్ బౌలర్ గా ఉన్న అతడు భారత్ కు అవసరం అయిన సందర్భంలో వికెట్లు తీయలేకపోతున్నాడు. దాంతో అతడి స్థానంలో రవిచంద్రన్ అశ్విన్ కు అవకాశం ఇస్తారని అంతా అనుకున్నారు. అయితే చహల్ ను కొనసాగించేందుకు కోచ్ ద్రవిడ్ మొగ్గు చూపాడు.

కోహ్లీ భారీ ఇన్నింగ్స్ బాకీ..

అఫ్గానిస్తాన్ తో సెంచరీ అనంతరం కోహ్లీ.. పరుగులు సాధించడంలో విఫలం అవుతున్నాడు. తొలి మ్యాచ్ లో 2 పరుగులు మాత్రమే చేసిన అతడు.. రెండో టి20లో 11 పరుగులు చేశాడు. దాంతో కోహ్లీ భారీ ఇన్నింగ్స్ ఆడాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఉప్పల్ స్టేడియంలో చివరిసారిగా జరిగిన టి20 మ్యాచ్ లో కోహ్లీ 50 బంతుల్లో  94 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇందులో 6 ఫోర్లు, 6 సిక్సర్లు ఉన్నాయి. కేఎల్ రాహుల్ 40 బంతుల్లో 62 పరుగులు చేశాడు. ఇక గత మ్యాచ్ లో రోహిత్ మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ తో పాటు దినేశ్ కార్తీక్ సూపర్ ఫినిషింగ్ జట్టులో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. బౌలింగ్, ఫీల్డింగ్ మరికొంత మెరుగుపడితే టీమిండియాను ఆపడం అంత సులభం కాదు.

తుది జట్లు

టీమిండియా

రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, బుమ్రా, చహల్

ఆస్ట్రేలియా

ఫించ్ (కెప్టెన్),  గ్రీన్,  స్టీవ్ స్మిత్, గ్లెన్ మ్యాక్స్ వెల్, వేడ్, టిమ్ డేవిడ్, జాష్ ఇంగ్లిస్, జంపా, కమిన్స్, హేజల్ వుడ్, డేనియల్ స్యామ్స్

Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Dinesh Karthik, Glenn Maxwell, Hardik Pandya, India vs australia, Jasprit Bumrah, KL Rahul, Pat cummins, Rishabh Pant, Rohit sharma, Steve smith, Team India, Virat kohli

ఉత్తమ కథలు