హోమ్ /వార్తలు /క్రీడలు /

IND vs AUS 3rd T20 : ఉప్పల్ లో మెరుపులు మెరిపించిన సూర్య, కోహ్లీ.. సిరీస్ టీమిండియాదే

IND vs AUS 3rd T20 : ఉప్పల్ లో మెరుపులు మెరిపించిన సూర్య, కోహ్లీ.. సిరీస్ టీమిండియాదే

PC : TWITTER

PC : TWITTER

IND vs AUS 3rd T20 : ఉప్పల్ స్టేడియంలో సూర్యకుమార్ యాదవ్ (SuryaKumar Yadav), విరాట్ కోహ్లీ (Virat kohli) మెరుపులు మెరిపించారు. వీరిద్దరు సూపర్ బ్యాటింగ్ తో భారత్ (India)కు విజయంతో పాటు సిరీస్ ను అందించారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

IND vs AUS 3rd T20 : ఉప్పల్ స్టేడియంలో సూర్యకుమార్ యాదవ్ (SuryaKumar Yadav), విరాట్ కోహ్లీ (Virat kohli) మెరుపులు మెరిపించారు. వీరిద్దరు సూపర్ బ్యాటింగ్ తో భారత్ (India)కు విజయంతో పాటు సిరీస్ ను అందించారు. ఆస్ట్రేలియా (Australia)తో జరిగిన మూడో టి20లో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. దాంతో మూడు మ్యాచ్ ల టి20 సిరీస్ ను 2-1తో సొంతం చేసుకుంది. 187 పరుగుల  భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 19.5 ఓవర్లలో 4 వికెట్లు నష్టపోయి 187 పరుగులు చేసి మరో బంతి మిగిలి ఉండగానే నెగ్గింది. సూర్యకుమార్ యాదవ్ (36 బంతుల్లో 69; 5 ఫోర్లు, 5 సిక్సర్లు), విరాట్ కోహ్లీ (48 బంతుల్లో 63; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధ సెంచరీలతో చెలరేగారు. చివర్లో హార్దిక్ పాండ్యా (16 బంతుల్లో 25 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) మ్యాచ్ ను ఫోర్ తో ముగించేశాడు.

నెమ్మదిగా ఆరంభమైనా

ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ లాగా భారత్ ఇన్నింగ్స్ ఆరంభం కాలేదు. చాలా నెమ్మదిగా ఆరంభమైంది. కేఎల్ రాహుల్ (1), రోహిత్ శర్మ (17) విఫలం అయ్యారు. దాంతో భారత్ 30 పరుగులకే రెండు వికెట్లను కోల్పోయింది. ఈ క్రమంలో క్రీజులో ఉన్న కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ జట్టు బాధ్యతను తీసుకున్నారు, ముఖ్యంగా సూర్యకుమార్ యాదవ్ రెచ్చిపోయి ఆడారు. సూర్యకుమార్ భారీ షాట్లతో విరుచుకుపడితే.. కోహ్లీ క్లాస్ షాట్లతో అలరించాడు. వీరిద్దరూ 104 పరుగులు జోడించారు. అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న సూర్యకుమార్.. భారీ షాట్ కు ప్రయత్నించి పెవిలియన్ కు చేరాడు. ఇక్కడి నుంచి కోహ్లీ విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో కోహ్లీ తన అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఇక ఆఖరి ఓవర్లో 11 పరుగులు అవసరం కాగా.. కోహ్లీ తొలి బంతిని సిక్సర్ బాదాడు. అయితే రెండో బంతికి అవుటయ్యాడు. క్రీజులోకి వచ్చిన దినేశ్ కార్తీక్ సింగిల్ తీసుకుని హార్దిక్ కు స్ట్రయిక్ ఇచ్చాడు. నాలుగో బంతిని హార్దిక్ ఆడలేకపోయాడు. దాంతో భారత విజయం సమీకరణం 2 బంతులకు 4 పరుగులుగా మారింది. ఈ క్రమంలో థర్డ్ మ్యాన్ దిశలో బౌండరీ బాదిన హార్దిక్ భారత్ ను మరో బంతి మిగిలి ఉండగానే గెలిపించాడు.

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 7 వికెట్లకు 186 పరుగులు చేసింది. టిమ్ డేవిడ్ (27 బంతుల్లో 54; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), గ్రీన్ (21 బంతుల్లో 52; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధ శతకాలతో రాణించారు. ఒక దశలో 200 పైనే పరుగులు సాధించేలా ఆసీస్ కనిపించినా భారత బౌలర్లు కమ్ బ్యాక్ చేయడంతో అనుకున్నన్ని పరుగులు సాధించలేకపోయింది. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ మరోసారి 3 వికెట్లతో చెలరేగాడు.

Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Axar Patel, Dinesh Karthik, Hardik Pandya, India vs australia, Jasprit Bumrah, KL Rahul, Rohit sharma, Virat kohli

ఉత్తమ కథలు