హోమ్ /వార్తలు /క్రీడలు /

IND vs AUS 3rd T20 : పంత్ అవుట్.. ఆ స్పిన్నర్ పై వేటు ఖాయం.. ఆసీస్ తో మూడో టి20.. టీమిండియా తుది జట్టు ఇదే

IND vs AUS 3rd T20 : పంత్ అవుట్.. ఆ స్పిన్నర్ పై వేటు ఖాయం.. ఆసీస్ తో మూడో టి20.. టీమిండియా తుది జట్టు ఇదే

PC : TWITTER

PC : TWITTER

IND vs AUS 3rd T20 : భారత్ (India), ఆస్ట్రేలియా (Australia) జట్ల మూడు మ్యాచ్ ల టి20 సిరీస్ ఆఖరి ఘట్టానికి చేరుకుంది. తొలి టి20లో ఆస్ట్రేలియా.. రెండో టి20లో భారత్ నెగ్గడంతో సిరీస్ సమం అయ్యింది. ఇక సిరీస్ విజేతను తేల్చే బాధ్యత హైదరాబాద్ (Hyderabad)లోని ఉప్పల్ స్టేడియం తీసుకుంది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

IND vs AUS 3rd T20 : భారత్ (India), ఆస్ట్రేలియా (Australia) జట్ల మూడు మ్యాచ్ ల టి20 సిరీస్ ఆఖరి ఘట్టానికి చేరుకుంది. తొలి టి20లో ఆస్ట్రేలియా.. రెండో టి20లో భారత్ నెగ్గడంతో సిరీస్ సమం అయ్యింది. ఇక సిరీస్ విజేతను తేల్చే బాధ్యత హైదరాబాద్ (Hyderabad)లోని ఉప్పల్ స్టేడియం తీసుకుంది. సెప్టెంబర్ 25 (ఆదివారం) జరిగే పోరులో ఇరు జట్లు కూడా తాడో పేడో తేల్చుకోనున్నాయి. టి20 ప్రపంచకప్ (T20 World cup) ముందు జరుగుతున్న సిరీస్ కావడంతో అందరిలోనూ ఆసక్తి నెలకొని ఉంది. రెండో టి20లో విజయంతో భారత్ ఆత్మవిశ్వాసంతో ఉంది. అదే సమయంలో మూడో టి20లో నెగ్గి సిరీస్ ను గెలవాలనే పట్టుదలగా ఆస్ట్రేలియా ఉంది. ఇక ఉప్పల్ స్టేడియం బ్యాటింగ్ పిచ్ కావడంతో పరుగుల వరద ఖాయం.

చహల్ ను పక్కన పెడతారా?

ఇక టీమిండియా ప్రధాన స్పిన్నర్ గా ఉన్న యుజువేంద్ర చహల్ గత కొంతకాలంగా ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. ఆసియా కప్ లో దారుణంగా విఫలం అయిన అతడు.. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి రెండు మ్యాచ్ ల్లోనూ పేలవ ప్రదర్శన చేశాడు. మరో వైపు రెండో స్పిన్నర్ గా ఉన్న అక్షర్ పటేల్ రాణిస్తుంటే చహల్ మాత్రం దారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. ఈ క్రమంలో అతడిని మూడో టి20 నుంచి తప్పించే అవకాశం ఉంది. అతడి స్థానంలో అశ్విన్ ను తీసుకునే ఛాన్స్ ఉంది. నాగ్ పూర్ మ్యాచ్ లో జట్టులోకి వచ్చిన పంత్ మళ్లీ బెంచ్ కే పరిమితం అయ్యే ఛాన్స్ ఉంది. అతడి స్థానంలో భువనేశ్వర్ కుమార్ లేదా దీపక్ చహర్ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఇక హర్షల్ పటేల్ కు ఈ మ్యాచ్ ఎంతో కీలకం కానుంది. పునరాగమనంలో హర్షల్ మునుపటిలా బౌలింగ్ చేయడం లేదు. తొలి టి20లో 49 పరుగులు సమర్పించుకుంటే.. రెండో టి20లో 32 పరుగులు ఇచ్చాడు. ఇక బుమ్రా తుది జట్టులోకి రాావడంతో డెత్ బౌలింగ్ బలంగా మారుతుందని టీమిండియా అభిమానులు భావిస్తున్నారు.

కోహ్లీ భారీ ఇన్నింగ్స్ ఆడతాడా?

అఫ్గానిస్తాన్ తో సెంచరీ అనంతరం కోహ్లీ.. పరుగులు సాధించడంలో విఫలం అవుతున్నాడు. తొలి మ్యాచ్ లో 2 పరుగులు మాత్రమే చేసిన అతడు.. రెండో టి20లో 11 పరుగులు చేశాడు. దాంతో కోహ్లీ భారీ ఇన్నింగ్స్ ఆడాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఉప్పల్ స్టేడియంలో చివరిసారిగా జరిగిన టి20 మ్యాచ్ లో కోహ్లీ 50 బంతుల్లో  94 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇందులో 6 ఫోర్లు, 6 సిక్సర్లు ఉన్నాయి. కేఎల్ రాహుల్ 40 బంతుల్లో 62 పరుగులు చేశాడు. ఇక గత మ్యాచ్ లో రోహిత్ మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ తో పాటు దినేశ్ కార్తీక్ సూపర్ ఫినిషింగ్ జట్టులో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. బౌలింగ్, ఫీల్డింగ్ మరికొంత మెరుగుపడితే టీమిండియాను ఆపడం అంత సులభం కాదు.

టీమిండియా తుది జట్టు (అంచనా)

రోహిత్ శర్మ (కెప్టెన్), రాహుల్, కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, కార్తీక్, అక్షర్ పటేల్, అశ్విన్/చహల్, హర్షల్ పటేల్, దీపక్ చహర్ / భువనేశ్వర్ కుమార్, బుమ్రా

Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Axar Patel, Dinesh Karthik, Glenn Maxwell, Hardik Pandya, India vs australia, Jasprit Bumrah, KL Rahul, Pat cummins, Rishabh Pant, Rohit sharma, Steve smith, Team India, Virat kohli

ఉత్తమ కథలు