హోమ్ /వార్తలు /క్రీడలు /

IND vs AUS 3rd T20 : ఉప్పల్ మ్యాచ్ లో ‘బ్లాక్ దందా’ రూ. 1500 టికెట్ ను ఎన్నివేలకు అమ్ముతున్నారంటే?

IND vs AUS 3rd T20 : ఉప్పల్ మ్యాచ్ లో ‘బ్లాక్ దందా’ రూ. 1500 టికెట్ ను ఎన్నివేలకు అమ్ముతున్నారంటే?

PC : TWITTER

PC : TWITTER

IND vs AUS 3rd T20 : ఆస్ట్రేలియా (Australia), భారత్ (India) జట్ల మధ్య మూడు మ్యాచ్ ల టి20 సిరీస్ ఫైనల్ స్టేజ్ కు చేరుకుంది. ఇప్పటి వరకు రెండు మ్యాచ్ లు జరగ్గా ఇరు జట్లు ఒక్కో మ్యాచ్ లో నెగ్గాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

IND vs AUS 3rd T20 : ఆస్ట్రేలియా (Australia), భారత్ (India) జట్ల మధ్య మూడు మ్యాచ్ ల టి20 సిరీస్ ఫైనల్ స్టేజ్ కు చేరుకుంది. ఇప్పటి వరకు రెండు మ్యాచ్ లు జరగ్గా ఇరు జట్లు ఒక్కో మ్యాచ్ లో నెగ్గాయి. దాంతో సిరీస్ విజేత ఎవరో మూడో టి20లో తేలనుంది. ఇక మూడో టి20 హైదరాబాద్ (Hyderabad) వేదికగా జరగనున్న సంగతి తెలిసిందే. దాదాపు 3 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత హైదరాబాద్ లో అంతర్జాతీయ మ్యాచ్ జరగనుంది. దాంతో ఈ మ్యాచ్ ను గ్రౌండ్ లో చూడాలని ఉద్దేశంతో టికెట్ల కోసం ఎగబడ్డారు. అయితే టికెట్లు క్షణాల్లో అయిపోవడం.. ఆ తర్వాత ఆఫ్ లైన్ అంటూ జింఖానా స్టేడియం దగ్గర తొక్కిసలాట వంటి విషయాలతో హైదరాబాద్ క్రికెట్ సంఘం (HCA) తన పరువును పోగొట్టుకుంది.

అయితే తాజాగా ఈ మ్యాచ్ కు సంబంధించిన టికెట్లను బ్లాక్ లో విక్రయిస్తున్నారు. మ్యాచ్ రోజు కూడా ఈ టికెట్ల దందా కొనసాగడం గమనార్హం. రూ. 1,500 టికెట్లను బ్లాక్ లో రూ. 6 వేలకు.. రూ. 1,000 టికెట్లను రూ. 5 వేలకు విక్రయిస్తున్నారు. రూ.1,500 టిక్కెట్లను రూ. 6వేలకు అమ్ముతుండగా సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఆరు టికెట్లను స్వాధీనం చేసుకుని బ్లాక్‌లో టిక్కెట్లు అమ్మినవారిని బేగంపేట్ పోలీసులకు అప్పగించారు .

ఇక మ్యాచ్ సెప్టెంబర్ 25 రాత్రి 7 గంటలకు ఆరంభం కానుంది. అధికారికంగా స్టేడియం కెపాసిటీ 55 వేలు. ఇక అభిమానులు ఇప్పటికే గ్రౌండ్ వద్దకు భారీ సంఖ్యలో చేరుకున్నారు. వీరిని సాయంత్రం 5 గంటల తర్వాత మాత్రమే గ్రౌండ్ లోకి అనుమతించనున్నారు. ఇక స్టేడియం లోపల, బయట పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు. ఇక మ్యాచ సందర్భంగా సెప్టెంబర్ 25న అర్ధ రాత్రి వరకు మెట్రో రైళ్లను నడుపనున్నారు.

Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Cyberabad police, Dinesh Karthik, Hardik Pandya, Hyderabad, Hyderabad police, India vs australia, Jasprit Bumrah, Rachakonda, Rachakonda Police, Rishabh Pant, Rohit sharma, Virat kohli

ఉత్తమ కథలు