హోమ్ /వార్తలు /క్రీడలు /

IND vs AUS 3rd T20 : హైదరాబాద్ లో అడుగుపెట్టిన భారత్, ఆస్ట్రేలియా జట్లు

IND vs AUS 3rd T20 : హైదరాబాద్ లో అడుగుపెట్టిన భారత్, ఆస్ట్రేలియా జట్లు

PC : TWITTER

PC : TWITTER

IND vs AUS 3rd T20 : మూడు మ్యాచ్ ల టి20 సిరీస్ ల ో భాగంగా హైదరాబాద్ (Hyderabad) వేదికగా భారత్ (India), ఆస్ట్రేలియా (Australia) జట్ల మధ్య ఆఖరిదైన మూడో టి20 జరగనుంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

IND vs AUS 3rd T20 : మూడు మ్యాచ్ ల టి20 సిరీస్ ల ో భాగంగా హైదరాబాద్ (Hyderabad) వేదికగా భారత్ (India), ఆస్ట్రేలియా (Australia) జట్ల మధ్య ఆఖరిదైన మూడో టి20 జరగనుంది. హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో సెప్టెంబర్ 25న (ఆదివారం) జరగనుంది. ఇక ఈ మ్యాచ్ కోసం ఇరు జట్ల ఆటగాళ్లు శనివారం హైదరాబాద్ కు చేరుకున్నారు. ప్రత్యేక విమానాల్లో శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న ఇండియా,  ఆస్ట్రేలియా ప్లేయర్లకు ఘన స్వాగతం లభించింది. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ఎయిర్ పోర్ట్ లో పోలీసులు కట్టుదిట్టమైన చర్యలను తీసుకున్నారు.

విమానాశ్రయం నుంచి భారీ భద్రత నడుమ ప్రత్యేక బస్సులో ఇరు జట్ల ఆటగాళ్లు  తాజ్ కృష్ణ హోటల్ కు చేరుకున్నారు. నేడు విశ్రాంతి తీసుకోనున్న ప్లేయర్లు రేపు ప్రాక్టీస్ చేయనున్నారు. ఇక మ్యాచ్ ఆదివారం రాత్రి 7 గంటలకు ఆరంభం కానుంది.

చహల్ ను పక్కనబెడతారా?

ఇక టీమిండియా ప్రధాన స్పిన్నర్ గా ఉన్న యుజువేంద్ర చహల్ గత కొంతకాలంగా ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. ఆసియా కప్ లో దారుణంగా విఫలం అయిన అతడు.. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి రెండు మ్యాచ్ ల్లోనూ పేలవ ప్రదర్శన చేశాడు. మరో వైపు రెండో స్పిన్నర్ గా ఉన్న అక్షర్ పటేల్ రాణిస్తుంటే చహల్ మాత్రం దారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. ఈ క్రమంలో అతడిని మూడో టి20 నుంచి తప్పించే అవకాశం ఉంది. అతడి స్థానంలో అశ్విన్ ను తీసుకునే ఛాన్స్ ఉంది. నాగ్ పూర్ మ్యాచ్ లో జట్టులోకి వచ్చిన పంత్ మళ్లీ బెంచ్ కే పరిమితం అయ్యే ఛాన్స్ ఉంది. అతడి స్థానంలో భువనేశ్వర్ కుమార్ లేదా దీపక్ చహర్ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఇక హర్షల్ పటేల్ కు ఈ మ్యాచ్ ఎంతో కీలకం కానుంది. పునరాగమనంలో హర్షల్ మునుపటిలా బౌలింగ్ చేయడం లేదు. తొలి టి20లో 49 పరుగులు సమర్పించుకుంటే.. రెండో టి20లో 32 పరుగులు ఇచ్చాడు. ఇక బుమ్రా తుది జట్టులోకి రాావడంతో డెత్ బౌలింగ్ బలంగా మారుతుందని టీమిండియా అభిమానులు భావిస్తున్నారు.

టీమిండియా తుది జట్టు (అంచనా)

రోహిత్ శర్మ (కెప్టెన్), రాహుల్, కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, కార్తీక్, అక్షర్ పటేల్, అశ్విన్/చహల్, హర్షల్ పటేల్, దీపక్ చహర్ / భువనేశ్వర్ కుమార్, బుమ్రా

Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Dinesh Karthik, Glenn Maxwell, Hardik Pandya, India vs australia, Jasprit Bumrah, KL Rahul, Pat cummins, Rohit sharma, Steve smith, Team India, Virat kohli

ఉత్తమ కథలు