హోమ్ /వార్తలు /క్రీడలు /

IND vs AUS 3rd T20 : ఉప్పల్ మ్యాచ్ చూసేందుకు వెళ్తున్నారా.? అయితే ఈ నియమాలు పాటించండి.. ఏ ఇబ్బందులు తలెత్తవు

IND vs AUS 3rd T20 : ఉప్పల్ మ్యాచ్ చూసేందుకు వెళ్తున్నారా.? అయితే ఈ నియమాలు పాటించండి.. ఏ ఇబ్బందులు తలెత్తవు

PC : TWITTER

PC : TWITTER

IND vs AUS 3rd T20 : ఆస్ట్రేలియా (Australia)తో జరుగుతోన్న మూడు మ్యాచ్ ల టి20 సిరీస్ లో ఇప్పటికే రెండు మ్యాచ్ లు పూర్తయ్యాయి. తొలి టి20లో ఆస్ట్రేలియా విజయం సాధిస్తే.. రెండో టి20లో టీమిండియా (Team India) నెగ్గింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

IND vs AUS 3rd T20 : ఆస్ట్రేలియా (Australia)తో జరుగుతోన్న మూడు మ్యాచ్ ల టి20 సిరీస్ లో ఇప్పటికే రెండు మ్యాచ్ లు పూర్తయ్యాయి. తొలి టి20లో ఆస్ట్రేలియా విజయం సాధిస్తే.. రెండో టి20లో టీమిండియా (Team India) నెగ్గింది. దాంతో సిరీస్ విజేత ఎవరో హైదరాబాద్ (Hyderabad) వేదికగా జరిగే మ్యాచ్ తో తేలిపోనుంది. సెప్టెంబర్ 25న ఉప్పల్ వేదికగా చివరి టి20 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇక ఈ మ్యాచ్ ను ప్రత్యక్షంగా చూసేందుకు క్రికెట్ అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అయితే అభిమానుల కోసం పోలీసులు కీలక సూచనలను చేసింది. వ్యక్తిగత వాహనాలను పక్కన పెట్టి ప్రజా రవాణా (బస్సులు, మెట్రో)ను ఉపయోగించాల్సిందిగా అభిమానులను కోరింది.

అర్ధ రాత్రి 1 గంట వరకు మెట్రో

మ్యాచ్ ను దృష్టిలో ఉంచుకుని సెప్టెంబర్ 25న అర్ధరాత్రి 1 గంట వరకు మెట్రో రైళ్లను నడుపనున్నారు. ఉప్పల్ స్టేషన్ నుంచి ఈ మెట్రో రైళ్లను రాత్రి గం 11 నుంచి 1 గంట వరకు ప్రత్యేకంగా నడుపనున్నారు. అదే సమయంలో అమీర్ పేట్, జేబీయస్ పరేడ్ గ్రౌండ్స్ దగ్గర కనెక్టింగ్ రైళ్లను కూడా అందుబాటులో ఉంచనున్నారు. అయితే ఉప్పల్, ngri  మెట్రో స్టేషన్ ల దగ్గర మాత్రమే రాత్రి 11 తర్వాత లోపలికి అనుమతిస్తారు. మిగిలిన స్టేషన్స్ లో కేవలం బయటకు వెళ్లేందుకు మాత్రమే అనుమతి ఉంటుంది.  అదే సమయంలో ఆర్టీసీ కూడా ఈ మ్యాచ్ కోసం ప్రత్యేక సర్వీసులను నడుపనుంది. ఇక ఉప్పల్ నుంచి 25న 50 బస్సులను నడుపనున్నట్లు ఆర్టీసీ పేర్కొంది. ఉప్పల్ నుంచి జేబీఎస్, మేడ్చల్, సికింద్రాబాద్, మెహదీపట్నం, కోఠీ, ఘట్ కేసర్ లకు ఈ బస్సులను నడుపనున్నారు. వీటితో పాటు స్టేడియం లోపలికి అనుమతి ఇచ్చేవి అనుమతి లేనివి పై కూడా పోలీసులు ఆదేశాలు జారీ చేశారు.

స్టేడియంలోకి వీటిని తీసుకెళ్లొచ్చు

మొబైల్ ఫోన్, బ్లూటూత్ సెట్ లను స్టేడియంలోకి అనుమతించనున్నారు.

అనుమతి లేనివి

కెమెరాలు, ల్యాప్ టాప్ లు, సెల్ఫీ స్టిక్స్, కత్తులు, బ్లేడ్స్, మద్యం బాటిళ్లు, లైటర్స్, ఫైర్ క్రాకర్స్, నీళ్ల బాటిల్స్, బ్యాగ్ లు, హెల్మెట్లు, మాదక ద్రవ్యాలు

ఇలా చేయండి

మ్యాచ్ ను సజావుగా చూసి తిరిగి ఇంటికి చేరుకోవాలంటే మీరు సొంత వాహనాలను మైదానం వరకు తీసుకెళ్లకండి. ఎందుకంటే ట్రాఫిక్ లో ఇరుక్కునే ప్రమాదం ఉంది. పార్కింగ్ వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే ఛాన్స్ లు ఎక్కువగా ఉన్నాయి. బస్సు లేదా మెట్రోను ఉపయోగిస్తే మంచిది. ఒక వేళ మీ ప్రాంతంలో మెట్రో సౌలభ్యం లేకపోతే మీకు దగ్గర్లోని మెట్రో స్టేషన్ వరకు సొంత బైక్ లో వెళ్లి అక్కడి నుంచి మెట్రో ద్వారా స్టేడియంకు వెళ్లండి. ఇక టికెట్ల విషయంలో కూడా ముందు జాగ్రత్తగా ఉండండి. ముందే రిటర్న్ టికెట్ కూడా తీసి పెట్టుకోండి. మ్యాచ్ ముగిశాక టికెట్స్ తీసుకోవచ్చు అనుకుంటే మాత్రం ఇబ్బందులు పటే అవకాశం ఉంది.

Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Axar Patel, Hardik Pandya, Hyderabad, Hyderabad Metro, Hyderabad Metro rail, India vs australia, Jasprit Bumrah, KL Rahul, Rohit sharma, Tsrtc, Virat kohli

ఉత్తమ కథలు