హోమ్ /వార్తలు /క్రీడలు /

IND vs AUS 3rd T20 : గ్రీన్, టిమ్ డేవిడ్ బాదినా.. సూపర్ గా కమ్ బ్యాక్ చేసిన భారత్.. టీమిండియా టార్గెట్ ఎంతంటే?

IND vs AUS 3rd T20 : గ్రీన్, టిమ్ డేవిడ్ బాదినా.. సూపర్ గా కమ్ బ్యాక్ చేసిన భారత్.. టీమిండియా టార్గెట్ ఎంతంటే?

PC : TWITTER/BCCI

PC : TWITTER/BCCI

IND vs AUS 3rd T20 : సిరీస్ డిసైడర్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా (Australia) భారత్ (India) ముందు టఫ్ టార్గెట్ నే సెట్ చేసింది. హైదరాబాద్ (Hyderabad)లోని ఉప్పల్ స్టేడియంలో జరుగుతోన్న మూడో టి20లో టాస్ గెలిచిన టీమిండియా (Team India) కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) ఆస్ట్రేలియాను బ్యాటింగ్ కు ఆహ్వానించాడు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

IND vs AUS 3rd T20 : సిరీస్ డిసైడర్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా (Australia) భారత్ (India) ముందు టఫ్ టార్గెట్ నే సెట్ చేసింది. హైదరాబాద్ (Hyderabad)లోని ఉప్పల్ స్టేడియంలో జరుగుతోన్న మూడో టి20లో టాస్ గెలిచిన టీమిండియా (Team India) కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) ఆస్ట్రేలియాను బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 7 వికెట్లకు 186 పరుగులు చేసింది. టిమ్ డేవిడ్ (27 బంతుల్లో 54; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), గ్రీన్ (21 బంతుల్లో 52; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధ శతకాలతో రాణించారు. ఒక దశలో 200 పైనే పరుగులు సాధించేలా ఆసీస్ కనిపించినా భారత బౌలర్లు కమ్ బ్యాక్ చేయడంతో అనుకున్నన్ని పరుగులు సాధించలేకపోయింది. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ మరోసారి 3 వికెట్లతో చెలరేగాడు.

గ్రీన్ ధనాధన్

టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియాకు గ్రీన్ ధనాధన్ బ్యాటింగ్ తో అదిరిపోయే ఆరంభం అందించాడు. తొలి ఓవర్ రెండో బంతినే స్టాండ్స్ లోకి పంపిన అతడు తన ఉద్దేశాన్ని క్లియర్ గా చెప్పేశాడు. బౌలర్ ఎవరైనా కొడితే ఫోర్.. లేదంటే సిక్సర్ అన్నట్లు గ్రీన్ బ్యాటింగ్ సాగింది. ఒక ఎండ్ లో ఫించ్ (7) తొందరగా అవుటైనా.. గ్రీన్ మాత్రం రెచ్చిపోయి ఆడాడు. కేవలం 19 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. అయితే భువనేశ్వర్ ఈ డేంజరస్ బ్యాటర్ ను పెవిలియన్ కు పంపాడు. ఇక్కడి నుంచి ఆసీస్ ఇన్నింగ్స్ గాడి తప్పింది.  స్మిత్ (9), మ్యాక్స్ వెల్ (6) మరోసారి విఫలం అయ్యారు. సూపర్ ఫామ్ లో ఉన్న వేడ్ (1) ఈసారి మెరుపులు మెరిపించలేకపోయాడు. అక్షర్ పటేల్, చహల్ అద్భుతంగా బౌలింగ్ చేశారు. దాంతో ఆస్ట్రేలియా ఒక దశలో 150 పరుగులు కూడా చేస్తుందా అని అనిపించింది.

డేవిడ్ సూపర్ ఫినిష్

క్రీజులోకి వచ్చిన టిమ్ డేవిడ్ మొదట్లో చాలా నెమ్మదిగా ఆడాడు. అయితే క్రీజులో కుదురుకున్నాక రెచ్చిపోయాడు. సిక్సర్లు వర్షం కురిపించాడు. 200 స్ట్రయిక్ రేట్ తో దూకుడు కనబరిచాడు. అయితే ఆఖరి ఓవర్లో హర్షల్ షాట్ పిచ్ బాల్ కి బోల్తా పడ్డాడు. దాంతో ఆస్ట్రేలియా 200 మార్కుకు చేరువగా వచ్చి ఆగిపోయింది.

తుది జట్లు

టీమిండియా

రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, బుమ్రా, చహల్

ఆస్ట్రేలియా

ఫించ్ (కెప్టెన్),  గ్రీన్,  స్టీవ్ స్మిత్, గ్లెన్ మ్యాక్స్ వెల్, వేడ్, టిమ్ డేవిడ్, జాష్ ఇంగ్లిస్, జంపా, కమిన్స్, హేజల్ వుడ్, డేనియల్ స్యామ్స్

Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Axar Patel, Dinesh Karthik, Glenn Maxwell, Hardik Pandya, India vs australia, Jasprit Bumrah, KL Rahul, Pat cummins, Rohit sharma, Steve smith, Virat kohli

ఉత్తమ కథలు