భారత్ – ఆస్ట్రేలియా మధ్య చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరుగుతున్న మూడో వన్డేలో.. ఆస్ట్రేలియా ఆలౌట్ అయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా 49 ఓవర్లలో 269 పరుగులకు ఆలౌట్ అయింది. మిచెల్ మార్ష్ (47 బంతుల్లో 47 పరుగులు ; 8 ఫోర్లు, 1 సిక్సర్), అలెక్స్ క్యారీ (38 పరుగులు), ట్రావిస్ హెడ్ (33 పరుగులు), లబుషేన్ (28 పరుగులు), స్టొయినిస్ (25 పరుగులు), అబాట్ (26 పరుగులు) ఇలా తలా ఓ చెయ్యి వేశారు. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ లో ఒకరు కూడా హాఫ్ సెంచరీ చేయకపోవడం గమనర్హం. కెప్టెన్ స్టీవ్ స్మిత్ డకౌటయ్యాడు. మిగతా బ్యాటర్లందరూ డబుల్ డిజిట్ స్కోరు అందుకోవడం విశేషం. టీమిండియా బౌలర్లలో హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్ చెరో మూడు వికెట్లతో సత్తా చాటారు. సిరాజ్, అక్షర్ పటేల్ కు చెరో రెండు వికెట్లు దక్కాయి.
టాస్ గెలిచి బ్యాటింగుకు దిగిన ఆస్ట్రేలియాకు మంచి ఆరంభం లభించింది. ఫస్ట్ వికెట్ కు 68 పరుగులు జోడించారు ఆస్ట్రేలియా ఓపెనర్లు. అయితే.. వీరు జోరుకు హార్దిక్ బ్రేకులు వేశాడు. ఓపెనర్ ట్రావిస్ హెడ్(33)(Travis head) పెవిలియన్ కు పంపిన టీమిండియా వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా(Hardik pandya). ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ స్టీవ్ స్మిత్(0) ను.. దూకుడుగా ఆడుతోన్న మిచెల్ మార్ష్(47)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఇలా ఆస్ట్రేలియా జోరుకు బ్రేకులు వేశాడు. ఇక, మిడిల్ ఓవర్లలో కుల్దీప్ తన మ్యాజిక్ చూపించాడు.
Innings Break! Australia are all out for 2⃣6⃣9⃣ in the first innings! 3️⃣ wickets each for @hardikpandya7 & @imkuldeep18 2️⃣ wickets each for @akshar2026 & @mdsirajofficial Over to our batters ???????? Scorecard ▶️ https://t.co/eNLPoZpkqi #TeamIndia | #INDvAUS | @mastercardindia pic.twitter.com/2LcTkRSPiC
— BCCI (@BCCI) March 22, 2023
ఇక గత రెండు మ్యాచ్‌ల్లో ‘గోల్డెన్ డక్’ అయిన సూర్యకు ఈ మ్యాచ్‌లోనూ ఛాన్స్ ఇచ్చారు. సంజూ శాంసన్‌కు నిరాశ తప్పలేదు. ఇక మొదటి వన్డేలో గెలిచిన టీమిండియా.. రెండో వన్డేలో ఘోరంగా ఓడిపోయింది. విశాఖ వేదికగా జరిగిన సెకండ్ వన్డేలో 10వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. దీంతో.. ఈ మ్యాచ్ పై ప్రతి ఒక్కరిలోనూ ఆసక్తి నెలకొంది. ఈ మ్యాచ్ గెలిచిన జట్టు సిరీస్ దక్కించుకోవడంతో పాటు నెం.1 ర్యాంక్ ను కూడా కైవసం చేసుకుంటుంది. ప్రస్తుతం టీమిండియా నెం.1 స్థానంలో ఉంది. ఓడిపోతే.. టీమిండియా నెం.1 ర్యాంక్ను ఆస్ట్రేలియాకు చేజార్చుకుంటుంది.
తుది జట్లు:
భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), గిల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్
ఆస్ట్రేలియా: డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్(కెప్టెన్), మార్నస్ లబుషేన్, అలెక్స్ క్యారీ, మార్కస్ స్టోయినిస్, ఆస్టన్ అగర్, సీన్ అబాట్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cricket, Hardik Pandya, India vs australia, KL Rahul, Rohit sharma, Team India, Virat kohli