ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరుగుతున్న రెండో టెస్టు రసవత్తరంగా ప్రారంభమైంది. ఫస్ట్ లో ఆస్ట్రేలియా బ్యాటింగ్ దుమ్మురేపితే.. ఆ తర్వాత టీమిండియా బౌలర్లు వారి ధాటికి చెక్ పెట్టారు. దీంతో.. లంచ్ సమయానికి ఆస్ట్రేలియా మూడు వికెట్ల నష్టానికి 94 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో ఉస్మాన్ ఖవాజా (74 బంతుల్లో 50 పరుగులు నాటౌట్), ట్రావిస్ హెడ్ (1 పరుగు నాటౌట్) ఉన్నారు. వార్నర్ (15), లబుషేన్ (18), స్టీవ్ స్మీత్ (0) నిరాశపర్చారు. అశ్విన్ రెండు వికెట్లు తీయగా.. షమీ ఒక వికెట్ తీసుకున్నాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా ఓపెనర్లుకు ఫస్ట్ గంట ఓ పరీక్షగా సాగింది. టీమిండియా పేస్ బౌలర్లు మహ్మద్ షమీ, సిరాజ్ మంచి బంతులతో వార్నర్, ఖవాజాని ఇబ్బంది పెట్టారు. అయితే.. వార్నర్ ధాటిగా ఆడలేకపోయినా.. ఖవాజా మాత్రం చూడచక్కని షాట్లతో ఆలరించాడు. ఈ క్రమంలో ఈ ఇద్దరూ ఫస్ట్ వికెట్ కు 50 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే, ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడిని షమీ విడదీశాడు.
షమీ వేసిన అద్భుతమైన బంతికి.. భరత్ కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు వార్నర్. దీంతో.. 50 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత వచ్చిన లబుషేన్ దూకుడుగా ఆడాడు. వరుస బౌండరీలతో భారత బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టే ప్రయత్నం చేశాడు. అయితే.. అశ్విన్ అతని జోరుకు బ్రేకులు వేశాడు. 18 పరుగులు వేసిన లబుషేన్ అశ్విన్ బౌలింగ్ లో ఎల్బీగా వెనుదిరిగాడు. ఆ తర్వాత కాసేపటికే అశ్విన్ బౌలింగ్ లో భరత్ కి క్యాచ్ ఇచ్చి డకౌటయ్యాడు స్మిత్. దీంతో.. 91 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయింది ఆస్ట్రేలియా. ఆ తర్వాత హెడ్, ఖవాజా మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు.
Lunch on Day 1 of the 2nd Test Australia 94/3 Two wickets for @ashwinravi99 and a wicket for @MdShami11 in the morning session. Scorecard - https://t.co/1DAFKevk9X #INDvAUS @mastercardindia pic.twitter.com/6L4lJnRACW
— BCCI (@BCCI) February 17, 2023
ఈ మ్యాచులో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. టీమిండియా ఈ మ్యాచులో ఒక మార్పుతో బరిలోకి దిగుతుంది. సూర్యకుమార్ యాదవ్ స్థానంలో గాయం నుంచి కోలుకున్న శ్రేయస్ అయ్యర్ తిరిగి జట్టులో చోటు సంపాదించాడు. ఇక, ఆస్ట్రేలియా కూడా రెండు మార్పులతో బరిలోకి దిగుతుంది. మ్యాట్ రెన్ షా స్థానంలో ట్రావిస్ హెడ్ తిరిగి జట్టులో చోటు సంపాదించాడు. బోలాండ్ స్థానంలో లెఫ్టార్మ్ స్పిన్నర్ మ్యాథ్యూ కున్మెన్ జట్టులోకి వచ్చాడు. ఈ మ్యాచులో ఏకంగా ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగుతుంది ఆస్ట్రేలియా. కేవలం కెప్టెన్ ప్యాట్ కమిన్స్ మాత్రం పేస్ బౌలింగ్ లో బాధ్యతలు మోయనున్నాడు.
బోర్డర్- గవాస్కర్ 2023 ట్రోఫీ (Border Gavaskar Trophy)లో ఇండియా (India) బలమైన ముందడుగు వేసింది. నాలుగు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో మొదటి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను చిత్తు చేసి 1-0 ఆధిక్యం సాధించింది.
తుది జట్లు :
టీమిండియా : రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), ఛతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎస్ భరత్ (వికెట్ కీపర్, బ్యాటర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్
ఆస్ట్రేలియా : డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, పీటర్ హ్యాండ్స్ కోమ్, అలెక్స్ క్యారీ, ప్యాట్ కమిన్, టాడ్ ముర్ఫీ, నాథన్ లయన్, మాథ్యూ కున్మెన్
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cricket, IND vs AUS, India vs australia, Mohammed Shami, Ravichandran Ashwin, Rohit sharma, Steve smith