ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరుగుతున్న రెండో టెస్టు ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా ఆలౌట్ అయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా 78.4 ఓవర్లలో 263 పరుగులకు ఆలౌట్ అయింది. ఉస్మాన్ ఖవాజా ( 81 పరుగులు), పీటర్ హ్యాండ్స్ కోమ్ (72 పరుగులు నాటౌట్), కమిన్స్ (33 పరుగులు) రాణించారు. వార్నర్ (15), లబుషేన్ (18), స్టీవ్ స్మీత్ (0) నిరాశపర్చారు. టీమిండియా బౌలర్లలో షమీ నాలుగు వికెట్లు తీయగా.. అశ్విన్, జడేజా చెరో మూడు వికెట్లు తీశారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా ఓపెనర్లుకు ఫస్ట్ గంట ఓ పరీక్షగా సాగింది. టీమిండియా పేస్ బౌలర్లు మహ్మద్ షమీ, సిరాజ్ మంచి బంతులతో వార్నర్, ఖవాజాని ఇబ్బంది పెట్టారు.
అయితే.. వార్నర్ ధాటిగా ఆడలేకపోయినా.. ఖవాజా మాత్రం చూడచక్కని షాట్లతో ఆలరించాడు. ఈ క్రమంలో ఈ ఇద్దరూ ఫస్ట్ వికెట్ కు 50 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే, ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడిని షమీ విడదీశాడు.
షమీ వేసిన అద్భుతమైన బంతికి.. భరత్ కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు వార్నర్. దీంతో.. 50 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత వచ్చిన లబుషేన్ దూకుడుగా ఆడాడు. వరుస బౌండరీలతో భారత బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టే ప్రయత్నం చేశాడు. అయితే.. అశ్విన్ అతని జోరుకు బ్రేకులు వేశాడు. 18 పరుగులు వేసిన లబుషేన్ అశ్విన్ బౌలింగ్ లో ఎల్బీగా వెనుదిరిగాడు. ఆ తర్వాత కాసేపటికే అశ్విన్ బౌలింగ్ లో భరత్ కి క్యాచ్ ఇచ్చి డకౌటయ్యాడు స్మిత్. దీంతో.. 91 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయింది ఆస్ట్రేలియా. ఆ తర్వాత హెడ్, ఖవాజా మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు.
Innings Break! Australia are all out for 263 in the first innings. 4️⃣ wickets for @MdShami11 ???????? 3️⃣ wickets apiece for @ashwinravi99 & @imjadeja ???????? Scorecard ▶️ https://t.co/hQpFkyZGW8 #TeamIndia | #INDvAUS pic.twitter.com/RZvGJjsMvo
— BCCI (@BCCI) February 17, 2023
లంచ్ తర్వాత ట్రావిస్ హెడ్ వికెట్ కోల్పోయిన ఆ తర్వాత. ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా (81) సెంచరీ దిశగా సాగాడు.. అతడికి మిడిలార్డర్ బ్యాటర్ పీటర్ హ్యాండ్స్‌కోమ్ అండగా నిలిచాడు. ఈ ఇద్దరూ కలిసి అర్థ సెంచరీ (57) భాగస్వామ్యం పూర్తి చేసి భారత బౌలర్లను విసిగించారు. కానీ రవీంద్ర జడేజా ఈ జోడీని విడదీశాడు. జడ్డూ వేసిన 46వ ఓవర్ ఐదో బంతికి షాట్ ఆడబోయిన ఖవాజా.. కెఎల్ రాహుల్ కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. టెస్టులలో జడేజాకు ఇది 250వ వికెట్. ఇక తర్వాతి ఓవర్లో ఆసీస్ కు అశ్విన్ మరో షాక్ ఇచ్చాడు. అతడు వేసిన 47వ ఓవర్లో వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ (0) ఫస్ట్ స్లిప్ లో విరాట్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.
ఆ తర్వాత కమిన్స్ తో కలిసి పీటర్ మరో భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కమిన్స్ దూకుడుగా ఆడితే.. హ్యాండ్స్ కోమ్ అతనికి సహకరించాడు. అయితే.. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడిని రవీంద్ర జడేజా విడదీశాడు. జడేజా బౌలింగ్ లో కమిన్స్ ఔటయ్యాడు. ఆ తర్వాత వెంటనే జడేజా బౌలింగ్ లోనే టాడ్ ముర్ఫీ డకౌటయ్యాడు. ఇక.. ఆఖర్లో లయన్, మ్యాథ్యు కున్మెన్ తో కలిసి వేగంగా పరుగులు చేశాడు పీటర్. ఈ క్రమంలో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే.. ఆఖర్లో షమీ లయన్, మ్యాథ్యూ వికెట్లు తీయడంతో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ ముగిసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: IND vs AUS, India vs australia, Mohammed Shami, Ravichandran Ashwin, Ravindra Jadeja