Home /News /sports /

IND VS AUS 2ND T20 LIVE SCORES INDIA VS AUSTRALIA 2ND T20 MATCH PREVIEW PREDICTED PLAYING XI PITCH REPORT HEAD TO HEAD SJN

IND vs AUS : నిలవాలంటే గెలవాల్సిందే.. ఆ స్టార్ బౌలర్ ను ఆడిస్తారా? ఆసీస్ తో రెండో టి20.. భారత్ తుది జట్టు ఇదే

PC : TWITTER

PC : TWITTER

IND vs AUS 2nd T20 : ఆస్ట్రేలియా (Australia)తో మూడు మ్యాచ్ ల టి20 సిరీస్ ను భారత్ (India) ఓటమితో ఆహ్వానించిన సంగతి తెలిసిందే. మొహాలీ (Mohali) వేదికగా జరిగిన తొలి టి20లో భారత్ 4 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా చేతిలో ఓడిన సంగతి తెలిసిందే.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
IND vs AUS 2nd T20 : ఆస్ట్రేలియా (Australia)తో మూడు మ్యాచ్ ల టి20 సిరీస్ ను భారత్ (India) ఓటమితో ఆహ్వానించిన సంగతి తెలిసిందే. మొహాలీ (Mohali) వేదికగా జరిగిన తొలి టి20లో భారత్ 4 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా చేతిలో ఓడిన సంగతి తెలిసిందే. 208 పరుగులు చేసినా మరోసారి డెత్ ఓవర్స్ లో చేతులెత్తేసిన భారత్ గెలిచే మ్యాచ్ లో ఓటమిని ఆహ్వానించింది. రెండు రోజుల విరామం అనంతరం ఆసీస్ తో మరో మ్యాచ్ కు భారత్ సిద్ధమైంది. నాగ్ పూర్ వేదికగా 23న జరిగే ఈ మ్యాచ్ లో గెలిస్తేనే భారత్ సిరీస్ రేసులో ఉంటుంది. లేదంటే ఇక్కడితోనే ఆస్ట్రేలియాకు సిరీస్ ను అప్పగిస్తుంది. తొలి టి20లో నెగ్గిన ఆస్ట్రేలియా ఆత్మవిశ్వాసంతో ఈ మ్యాచ్ లో బరిలోకి దిగనుంది. బుమ్రా కమ్ బ్యాక్ ఖాయమేనా? మ్యాచ్ ఫిట్ నెస్ ఇంకా సాధించకపోవడంతో తొలి టి20లో జస్ ప్రీత్ బుమ్రా ఆడని విషయం తెలిసిందే. ఇక రెండో టి20లో అతడు కమ్ బ్యాక్ చేసే అవకాశం ఉంది. ఇది భారత్ కు ఆశాజనక వార్తే. అయితే అతడు మునుపటి రీతిలో బౌలింగ్ చేస్తాడా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఎందుకంటే గాయంతో కోలుకుని కమ్ బ్యాక్ చేసిన హర్షల్ పటేల్ తొలి టి20లో తేలిపోయిన సంగతి తెలిసిందే. అతడు ఉమేశ్ యాదవ్ స్థానంలో బరిలోకి దిగే అవకాశం ఉంది. ఒకవేళ బుమ్రా పూర్తి ఫిట్ నెస్ తో లేకపోతే మాత్రం దీపక్ చహర్ తుది జట్టులో ఆడే అవకాశం ఉంది. ఇక ఎన్నో ఆశలు పెట్టుకున్న చహల్ కూడా తొలి టి20లో పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. ఈ మధ్య కాలంలో అతడు ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. దాంతో అతడిని కొనసాగిస్తారా? లేక రవిచంద్రన్ అశ్విన్ కు ఛాన్స్ ఇస్తారో చూడాలి. ఇక వికెట్ కీపర్ గా దినేశ్ కార్తీక్ కు మరో అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉంది. దాంతో పంత్ బెంచ్ కే పరిమితం అయ్యే అవకాశం ఉంది. తీవ్ర ఒత్తిడిలో ఉన్న భువనేశ్వర్ కుమార్ కు ఈ సిరీస్ చాలా కీలకం. అతడు మళ్లీ విఫలం అయితే మాత్రం టి20 ప్రపంచకప్ లో బెంచ్ కే పరిమితం అయ్యే అవకాశం ఉంది. తొలి టి20లో భారత బ్యాటర్లు రాణించారు. స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ విఫలం అయినా.. హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్ లు అదిరిపోయే ప్రదర్శన చేశారు. దాంతో భారత్ 200 మార్కును దాటగలిగింది. అయితే ఫీల్డింగ్, బౌలింగ్ భారత్ ను ఓడిపోయేలా చేసింది. భారత్ తరఫున చక్కగా బౌలింగ్ చేసింది ఒక్క అక్షర్ పటేల్ మాత్రమే. భారత్ తన తప్పులను సరి చేసుకునేందుకు మరో 5 మ్యాచ్ లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆ తర్వాత నేరుగా టి20 ప్రపంచకప్ లో ఆడాల్సి ఉంటుంది. టీమిండియా తుది జట్టు (అంచనా) రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమర్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, దీపక్ చహర్/బుమ్రా, చహల్
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Axar Patel, Dinesh Karthik, Hardik Pandya, India vs australia, Jasprit Bumrah, KL Rahul, Ravichandran Ashwin, Rishabh Pant, Rohit sharma, Team India, Virat kohli

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు