హోమ్ /వార్తలు /క్రీడలు /

Sourav Ganguly : ‘నా కూతురును ఆమెలా ఉండాలని చెప్పేవాడిని’.. కూతురి విషయంలో గంగూలీ షాకింగ్ కామెంట్స్

Sourav Ganguly : ‘నా కూతురును ఆమెలా ఉండాలని చెప్పేవాడిని’.. కూతురి విషయంలో గంగూలీ షాకింగ్ కామెంట్స్

PC : TWITTER

PC : TWITTER

Sourav Ganguly : భారత మహిళ క్రికెట్‌లో ఒక శకం ముగియనుంది. మహిళల క్రికెట్‌లో ఆల్ టైమ్ అత్యధిక వికెట్లు తీసిన క్రీడాకారిణిగా గుర్తింపు పొందిన ఝులన్ గోస్వామి, ఆట నుంచి రిటైర్ అవుతోంది. లార్డ్స్‌ వేదికగా శనివారం ఇంగ్లడ్‌తో జరిగే మూడే మూడో వన్డే ఆమెకు ఆఖరి మ్యాచ్ కానుంది.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

Sourav Ganguly : భారత (India) మహిళ క్రికెట్‌లో ఒక శకం ముగియనుంది. మహిళల క్రికెట్‌లో ఆల్ టైమ్ అత్యధిక వికెట్లు తీసిన క్రీడాకారిణిగా గుర్తింపు పొందిన ఝులన్ గోస్వామి (Jhulan Goswami) ఆట నుంచి రిటైర్ అవుతోంది. లార్డ్స్‌ వేదికగా శనివారం ఇంగ్లడ్‌తో జరిగే మూడో వన్డే ఆమెకు ఆఖరి మ్యాచ్ కానుంది. ఆ తరువాత ఝులన్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పనుంది. ఈ నేపథ్యంలో బెంగాల్‌ (West Bengal)కు చెందిన ఈ ఫాస్ట్ బౌలర్‌ను పొగడ్తలతో ముంచెత్తాడు బీసీసీఐ అధ్యక్షుడు, టీమిండియా మాజీ సారధి సౌరబ్ గంగూలీ. తన కూతురు క్రికెట్ ఆడితే ఝులన్ లాగా ఉండమని చెప్పేవాడినని పేర్కొన్నాడు.

 ఝులన్ రియల్ లెజెండ్

ఝలన్ కెరీర్ , ఆమె ప్రాయాణం అద్భుతమని చెప్పాడు గంగూలీ. ‘ఆమె చాలా సంవత్సరాలు టాప్ క్లాస్ క్రికెట్ ఆడింది. నా కూతురు క్రికెట్ ఆడితే ఝులన్ గోస్వామిలా ఉండమని చెప్పేవాడిని. కానీ దురదృష్టవశాత్తు అది జరగలేదు. నేను గత మూడేళ్లుగా బీసీసీఐ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఈ సమయంలో నేను ఝులన్, స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్ కౌర్‌లతో మహిళల క్రికెట్‌పై చాలా సమావేశాలు, చర్చలు జరిపాను. నిజం చెప్పాలంటే, ఝులన్ కెరీర్ పట్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఆమె నిజంగా ఒక లెజెండ్.’ అంటూ గంగూలీ వ్యాఖ్యానించాడు.

ప్రస్తుతం ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో ఝులన్ అద్భుత ప్రదర్శన చేసింది. ఇక, లార్డ్స్ వంటి ప్రఖ్యాత గ్రౌండ్‌లో ఝులన్ రిటైర్మెంట్ నిస్సందేహంగా గొప్ప విషయమని గంగూలీ అభిప్రాయపడ్డాడు. రిటైర్మైంట్ సందర్భంగా ఝులన్‌ను గౌరవించాలని బీసీసీఐ సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం.

ఇది కూడా చదవండి : ’అవన్నీ వదంతులే.. టికెట్ల అమ్మకాల్లో మా ప్రమేయం లేదు‘ షాకింగ్ కామెంట్స్ చేసిన అజారుద్దీన్

వన్డేల్లో 200 వికెట్లతో వరల్డ్ రికార్డ్

ఝులన్ గోస్వామి నవంబర్ 25, 1982న పశ్చిమ బెంగాల్‌లోని చక్దాహాలో జన్మించింది. దీంతో ఆమెను ‘చక్దా ఎక్స్‌ప్రెస్‌’గా పిలుస్తారు. సుదీర్ఘ కెరీర్‌లో ఆమె ఎన్నో రికార్డులను సొంతం చేసుకుంది. వన్డేల్లో 200 వికెట్లు తీసిన తొలి మహిళా క్రికెటర్‌గా రికార్డుల్లోకి ఎక్కింది.

 2007లో ఐసీసీ మహిళా క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు

2006లో భారత మహిళల జట్టు ఇంగ్లండ్‌లో తొలి టెస్ట్ సిరీస్‌ను గెలుచుకోవడంలో ఝులన్ కీలక పాత్ర పోషించింది. ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లో 5 వికెట్ల చొప్పున పడగొట్టింది. 2007లో ఐసీసీ మహిళా క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును సైతం సొంతం చేసుకుంది. ఈ అవార్డును ఎంఎస్ ధోని చేతుల మీదుగా అందుకుంది. ఇక 2011లోనూ తిరిగి ఈ అవార్డును గెలుచుకుంది. 2016లో ఐసీసీ ప్రకటించిన ఉమెన్స్ వన్డే ర్యాంకింగ్స్‌లో ఝులన్ నంబర్ బౌలర్‌గా నిలిచింది.

కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ మాత్రమే ఝులన్ రిటైర్మెంట్ గురించి ప్రకటించారు. అయితే ఝులన్ మాత్రం తన వీడ్కోలు గురించి ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం. ఎంతో సుదీర్ఘకాలం భారత క్రికెట్‌కు తన సేవలు అందించిన ఝులన్ భవిష్యత్ తరాలకు అదర్శప్రాయురాలని క్రికెట్ ఫ్యాన్స్ కొనియాడుతున్నారు.

Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Bcci, Hardik Pandya, India vs australia, India vs england, Mithali Raj, Rohit sharma, Smriti Mandhana, Sourav Ganguly, Virat kohli

ఉత్తమ కథలు