హోమ్ /వార్తలు /క్రీడలు /

Ind vs Aus 2020 : ట్రోలింగ్స్ కు తట్టుకోలేక అలా చేసిన టీమిండియా ఓపెనర్ పృథ్వీ షా

Ind vs Aus 2020 : ట్రోలింగ్స్ కు తట్టుకోలేక అలా చేసిన టీమిండియా ఓపెనర్ పృథ్వీ షా

prithvi shaw

prithvi shaw

Ind vs Aus 2020 : ఆస్ట్రేలియాతో ఫస్ట్ టెస్ట్ లో టీమిండియా ఘోరంగా ఓడిపోయింది. ఈ మ్యాచ్ లో యంగ్ ఓపెనర్ పృథ్వీషా చెత్త ఆటతో విమర్శల పాలయ్యాడు. నెట్టింట్లో ఈ యంగ్ ప్లేయర్ ఓ ఆటాడుకుంటున్నారు. అయితే, తనపై వచ్చిన విమర్శలకు డైరక్ట్ గా స్పందించలేక...

ఇంకా చదవండి ...

  ఆస్ట్రేలియాతో ఫస్ట్ టెస్ట్ లో టీమిండియా ఘోరంగా ఓడిపోయింది. ఈ మ్యాచ్ లో యంగ్ ఓపెనర్ పృథ్వీషా చెత్త ఆటతో విమర్శల పాలయ్యాడు. నెట్టింట్లో ఈ యంగ్ ప్లేయర్ ఓ ఆటాడుకుంటున్నారు. పృథ్వీషా.. తనపై వచ్చే విమర్శలకు నేరుగా స్పందించలేక ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్టు పెట్టాడు. ‘ఏదైనా చేయడానికి ప్రయత్నిస్తుంటే.. కొందరు తక్కువ చేసి మాట్లాడుతుంటారు. అంటే మేము ఏదో ఒకటి చేయగలమని, వాళ్లు ఏమీ చేయలేరని అర్థం’ ఇన్‌స్టా స్టోరీస్‌లో పేర్కొన్నాడు. పృథ్వీ ఈ ఏడాది ఆరంభం నుంచీ సరిగ్గా ఆడటం లేదన్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరిలో న్యూజిలాండ్‌ పర్యటనలో విఫలమైన అతడు తర్వాత ఐపీఎల్లోనూ మంచి ప్రదర్శన చేయలేకపోయాడు. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా పర్యటనలో రాణించలేకపోతున్నాడు.

  అంతకుముందు రెండు ప్రాక్టీస్‌ మ్యాచ్‌ల్లో విఫలమైనా టెస్టుల్లో అతడికి మెరుగైన గత రికార్డు ఉండడంతో అడిలైడ్‌ టెస్టుకు ఎంపిక చేశారనే ఊహాగానాలు వినిపించాయి. అయితే, తొలి టెస్టుకు పృథ్వీని ఎంపిక చేసినప్పుడే పలువురు మాజీలు స్పందించారు. ఫామ్‌ కోల్పోయి ఇబ్బంది పడుతున్న అతడికి బదులు శుభ్‌మన్‌గిల్‌ను ఎంపిక చేయాల్సిందని పేర్కొన్నారు.

  PRUTHVI SHAW INSTAGRAM STORY
  PRUTHVI SHAW INSTAGRAM STORY

  ఇక తొలి టెస్టులో 0,4 పరుగులు చేయడంతో రెండో టెస్టుకు అతడిని తొలగించే వీలుందని మాజీ పేసర్‌ జహీర్‌ఖాన్‌ తాజాగా పేర్కొన్నాడు. ఒకవేళ అదే నిజమైతే పృథ్వీ ఇక మిగతా టెస్టుల్లోనూ ఆడడం సందేహంగా అనిపిస్తోంది. రెండో టెస్ట్ లో అతని స్థానంలో కచ్చితంగా గిల్ ఎంపికయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

  Published by:Sridhar Reddy
  First published:

  Tags: IND vs AUS, India vs Australia 2020, Instagram, Prithvi shaw

  ఉత్తమ కథలు