IND vs AUS 1st Test: నాగ్ పూర్ (Nagpur) టెస్టులో టీమిండియా (Team India) జయభేరి మోగించింది. మూడో రోజే గ్రాండ్ విక్టరీని సాధించింది. రెండో ఇన్నింగ్స్ లో ఏ మాత్రం పోరాటం చేయని ఆస్ట్రేలియా టీమింటియా ముందు మోకరిల్లింది. రెండో ఇన్నింగ్స్ లో కేవలం 2 గంటలు మాత్రమే బ్యాటింగ్ చేసిన కంగారూలు 32.3 ఓవర్లలో 91 పరుగులకు ఆలౌటైంది. దాంతో భారత్ ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. భారత్ తరఫున రవిచంద్రన్ అశ్విన్ 5 వికెట్లతో చెలరేగితే.. రవీంద్ర జడేజా, మొహమ్మద్ షమీలు చెరో రెండు వికెట్లు తీశారు. మరో వికెట్ అక్షర్ పటేల్ ఖాతాలోకి చేరింది. ఆసీస్ తరఫున స్టీవ్ స్మిత్ (25) టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఈ విజయంతో నాలుగు మ్యాచ్ ల టెస్టు సిరీస్ లో భారత్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది.
మూడో రోజు లంచ్ విరామం తర్వాత 223 పరుగులు వెనుకబడి ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ ను ఆరంభించింది. 2వ ఓవర్ లోనే ఆస్ట్రేలియాకు అశ్విన్ షాకిచ్చాడు. ఖవాజా (1) మరోసారి విఫలం అయ్యాడు. ఆ తర్వాత కాసేపు లబుషేన్ (17), వార్నర్ (10) నిలకడగా ఆడే ప్రయత్నం చేశారు. అయితే బౌలింగ్ కు వచ్చిన జడేజా లబుషేన్ ను అవుట్ చేసి భారత్ కు రెండో వికెట్ ను అందించాడు. అనంతరం వార్నర్ ను అశ్విన్ అవుట్ చేశాడు. ఇక ఇక్కడి నుంచి ఆస్ట్రేలియా వరుస పెట్టి వికెట్లను కోల్పోయింది. స్మిత్ జడేజా ఓవర్లో బౌల్డ్ అయినా నాటౌట్ కావడంతో బతికి పోయాడు. అయితే షమీ వేసిన మరుసటి ఓవర్లో బొలాండ్ ఎల్బీగా అవుట్ అయ్యాడు. దాంతో ఆస్ట్రేలియా కథ ముగిసింది.
ఓవర్ నైట్ స్కోరు 321/7తో మూడో రోజు ఆట కొనసాగించిన భారత్ 139.3 ఓవర్లలో 400 పరుగులకు ఆలౌటైంది. రోహిత్ శర్మ (212 బంతుల్లో 120; 15 ఫోర్లు, 2 సిక్సర్లు) శతకంతో చెలరేగితే.. రవీంద్ర జడేజా (185 బంతుల్లో 70; 9 ఫోర్లు), అక్షర్ పటేల్ (174 బంతుల్లో 84; 10 ఫోర్లు; 1 సిక్స్) మిగతా పనిని పూర్తి చేశారు. దాంతో తొలి ఇన్నింగ్స్ లో భారత్ భారీ స్కోరును సాధించింది. తద్వారా ఆస్ట్రేలియాపై 223 పరుగుల లీడ్ ను సాధించింది. ఆసీస్ బౌలర్లలో టాడ్ ముర్ఫీ 7 వికెట్లు తీశాడు. ప్యాట్ కమిన్స్ 2 వికెట్లు సాధించగా.. మరో వికెట్ ను నాథన్ లయన్ దక్కించుకున్నాడు.
తుది జట్లు
ఆస్ట్రేలియా
ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), ఉస్మాన్ ఖాజా, డేవిడ్ వార్నర్, లబుషేన్, స్మిత్, పీటర్ హ్యాండ్స్ కాబ్, అలెక్స్ క్యారీ, మ్యాట్, మర్ఫీ, లయన్, స్కాట్ బొలాండ్
టీమిండియా
రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యదవ్, జడేజా, భరత్, అశ్విన్, అక్షర్ పటేల్, షమీ, సిరాజ్
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Axar Patel, IND vs AUS, India vs australia, Mohammed Shami, Ravichandran Ashwin, Ravindra Jadeja, Steve smith