హోమ్ /వార్తలు /క్రీడలు /

IND vs AUS 1st Test : టాస్ నెగ్గిన ఆస్ట్రేలియా.. డెబ్యూ చేయనున్న తెలుగు క్రికెటర్, స్కై.. తుది జట్లు ఇవే

IND vs AUS 1st Test : టాస్ నెగ్గిన ఆస్ట్రేలియా.. డెబ్యూ చేయనున్న తెలుగు క్రికెటర్, స్కై.. తుది జట్లు ఇవే

PC : BCCI

PC : BCCI

Border Gavaskar Test Series 2023 - IND vs AUS 1st Test : ఎప్పుడెప్పుడా అని ఆత్రుతగా ఎదురు చూస్తున్న క్షణం రానే వచ్చింది. గత కొన్ని రోజులుగా ఊరిస్తూ వస్తోన్న బోర్డర్ గావస్కర్ టెస్టు సిరీస్ 2023 (Border Gavaskar Test Series 2023) మరికొన్ని నిమిషాల్లో ఆరంభం కానుంది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Border Gavaskar Test Series 2023 - IND vs AUS 1st Test : ఎప్పుడెప్పుడా అని ఆత్రుతగా ఎదురు చూస్తున్న క్షణం రానే వచ్చింది. గత కొన్ని రోజులుగా ఊరిస్తూ వస్తోన్న బోర్డర్ గావస్కర్ టెస్టు సిరీస్ 2023 (Border Gavaskar Test Series 2023) మరికొన్ని నిమిషాల్లో ఆరంభం కానుంది. భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా (India vs Australia) జట్ల మధ్య నాగ్ పూర్ (Nagpur) వేదికగా తొలి టెస్టు జరగనుంది. ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గిన ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇక ఈ మ్యాచ్ ద్వారా టీమిండియా  తరఫున టెస్టుల్లో సూర్యకుమార్ యాదవ్, శ్రీకర్ భరత్ లు అరంగేట్రం చేయనున్నారు. శుబ్ మన్ గిల్ ను పక్కన పెట్టడం గమనార్హం.

తెలుగు క్రికెటర్ అరంగేంట్రం

వైజాగ్ కుర్రాడు శ్రీకర్ భరత్ టీమిండియా తరఫున టెస్టుల్లో అరంగేంట్రం చేయనున్నాడు. గత కొంత కాలంగా రెండో వికెట్ కీపర్ గా జట్టులో ఉంటున్న శ్రీకర్ భరత్ కు.. పంత్ గైర్హాజరీలో తుది జట్టులో చోటు దక్కింది. తనకు వచ్చిన ఈ అవకాశాన్ని రెండు చేతుల్లా ఒడిసి పట్టుకునేందుకు భరత్ రెడీగా ఉన్నాడు. ఇక టి20 ఫార్మాట్ లో సూపర్ ఫామ్ లో ఉన్న సూర్యకుమార్ యాదవ్ కూడా టెస్టుల్లో డెబ్యూ చేయాలనుకుంటున్నాడు. పంత్ లేకపోవడంతో అతడిలా దూకుడుగా ఆడే మరో ప్లేయర్ ను జట్టులోకి తీసుకోవాలని టీమిండియా ఉంది. దాంతో సూర్యకుమార్ ను ప్లేయింగ్ ఎలెవెన్ లో తీసుకుంది. అయితే శుబ్ మన్ గిల్ ను పక్కన పెట్టడం కాస్త విచిత్రంగా అనిపించే విషయం. ఇక ఈ మ్యాచ్ కోసం భారత్ ముగ్గరు స్పిన్నర్లు, ఇద్దరు పేసర్లతో బరిలోకి దిగనుంది. కుల్దీప్ యాదవ్ స్థానంలో అక్షర్ పటేల్ ను తీసుకుంది. ఇక ఆస్ట్రేలియా ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగనుంది.

పిచ్ ఎలా ఉందంటే?

నాగ్ పూర్ పిచ్ పక్కా స్పిన్ ట్రాక్ లా ఉందని పిచ్ రిపోర్ట్ సమయంలో సంజయ్ మంజ్రేకర్, మ్యాథ్యూ హెడెన్ లు పేర్కొన్నారు. రెడ్ సాయిల్ కావడంతో టర్న్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా లెఫ్టాండ్ బ్యాటర్లకు ఈ మ్యాచ్ పీడకల లాంటిదని మంజ్రేకర్ పిచ్ రిపోర్ట్ సమయంలో తెలిపాడు. ఆస్ట్రేలియా తరఫున వార్నర్, ఖాజా, క్యారీ లకు అగ్ని పరీక్షలా ఉండే అవకాశం ఉంది.

తుది జట్లు

ఆస్ట్రేలియా

ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), ఉస్మాన్ ఖాజా, డేవిడ్ వార్నర్,  లబుషేన్, స్మిత్, పీటర్ హ్యాండ్స్ కాబ్, అలెక్స్ క్యారీ, మ్యాట్, మర్ఫీ, లయన్, స్కాట్ బొలాండ్

టీమిండియా

రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యదవ్, జడేజా, భరత్, అశ్విన్, అక్షర్ పటేల్, షమీ, సిరాజ్

First published:

Tags: David Warner, IND vs AUS, India vs australia, KL Rahul, Mohammed Shami, Mohammed Siraj, Pat cummins, Ravichandran Ashwin, Ravindra Jadeja, Rohit sharma, Shubman Gill, Steve smith, Virat kohli

ఉత్తమ కథలు