IND vs AUS 1st Test : నాగ్ పూర్ (Nagpur) వేదికగా జరుగుతున్న బోర్డర్ గావస్కర్ 2023 (Border Gavaskar Trophy) తొలి టెస్టు జరుగుతుంది. తొలి రోజు టాస్ గెలిచిన ఆస్ట్రేలియా (Australia) బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి సెషన్ లో ఇరు జట్లు కూడా సమంగా నిలిచాయి. లంచ్ బ్రేక్ సమయానికి ఆస్ట్రేలియా 32 ఓవర్లలో 2 వికెట్లకు 76 పరుగులు చేసింది. మార్నస్ లబుషేన్ (110 బంతుల్లో 47 బ్యాటింగ్; 8 ఫోర్లు), స్టీవ్ స్మిత్ (74 బంతుల్లో 19 బ్యాటింగ్; 3 ఫోర్లు) నిలకడగా ఆడుతున్నారు. ఉస్మాన్ ఖవాజా (1), డేవిడ్ వార్నర్ (1)లు వెంట వెంటనే పెవిలియన్ కు చేరిన తర్వాత ఆస్ట్రేలియాను లబుషేన్, స్మిత్ ఆదుకున్నారు. వీరు అజేయమైన రెండో వికెట్ కు 74 పరుగులు జోడించారు. భారత బౌలర్లలో సిరాజ్, షమీలు చెరో వికెట్ ను సాధించారు.
టాస్ నెగ్గిన కమిన్స్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఓపెనర్లుగా ఖవాజా, వార్నర్ వచ్చారు. అయితే రెండో ఓవర్ లోనే ఆస్ట్రేలియాకు భారీ షాక్ తగిలింది. ఫామ్ లో ఉన్న ఖవాజాను సిరాజ్ ఎల్బీగా అవుట్ చేశాడు. మొదట అంపైర్ అవుట్ ఇవ్వక పోయినా.. రివ్యూకు వెళ్లిన రోహిత్ శర్మ సక్సెస్ అయ్యాడు. ఇక ఆ తర్వాతి ఓవర్లో షమీ మరో దెబ్బ తీశాడు. వార్నర్ ను క్లీన్ బౌల్డ్ చేశాడు. దాంతో ఒక దశలో ఆసీస్ 2 పరుగులకే 2 వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో క్రీజులో ఉన్నలబుషేన్, స్మిత్ ఆదుకున్నారు. ముఖ్యంగా లబుషేన్ దూకుడు కనబరిచాడు. మరో వికెట్ పడకుండా లంచ్ బ్రేక్ కు వెళ్లారు. ఇక ఈ మ్యాచ్ లో తెలుగు కుర్రాడు శ్రీకర్ భరత్ తో పాటు సూర్యకుమార్ యాదవ్ లు అరంగేట్రం చేశారు.
పిచ్ ఎలా ఉందంటే?
నాగ్ పూర్ పిచ్ పక్కా స్పిన్ ట్రాక్ లా ఉందని పిచ్ రిపోర్ట్ సమయంలో సంజయ్ మంజ్రేకర్, మ్యాథ్యూ హెడెన్ లు పేర్కొన్నారు. రెడ్ సాయిల్ కావడంతో టర్న్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా లెఫ్టాండ్ బ్యాటర్లకు ఈ మ్యాచ్ పీడకల లాంటిదని మంజ్రేకర్ పిచ్ రిపోర్ట్ సమయంలో తెలిపాడు. ఆస్ట్రేలియా తరఫున వార్నర్, ఖాజా, క్యారీ లకు అగ్ని పరీక్షలా ఉండే అవకాశం ఉంది.
తుది జట్లు
ఆస్ట్రేలియా
ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), ఉస్మాన్ ఖాజా, డేవిడ్ వార్నర్, లబుషేన్, స్మిత్, పీటర్ హ్యాండ్స్ కాబ్, అలెక్స్ క్యారీ, మ్యాట్, మర్ఫీ, లయన్, స్కాట్ బొలాండ్
టీమిండియా
రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యదవ్, జడేజా, భరత్, అశ్విన్, అక్షర్ పటేల్, షమీ, సిరాజ్
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: David Warner, IND vs AUS, India vs australia, Mohammed Shami, Mohammed Siraj, Rohit sharma, Steve smith, Team India