హోమ్ /వార్తలు /క్రీడలు /

IND vs AUS 1st T20 : ఆ అద్భుత ఘట్టానికి నేటికి 15 ఏళ్లు.. కొడుకుతో కలిసి సెలబ్రేట్ చేసుకున్న సిక్సర్ల కింగ్

IND vs AUS 1st T20 : ఆ అద్భుత ఘట్టానికి నేటికి 15 ఏళ్లు.. కొడుకుతో కలిసి సెలబ్రేట్ చేసుకున్న సిక్సర్ల కింగ్

PC : TWITTER

PC : TWITTER

IND vs AUS 1st T20 : భారత (India) క్రికెట్ చరిత్రలో 2007 టి20 ప్రపంచకప్ (T20 World Cup)కు ప్రత్యేక స్థానం ఉంటుంది. 1983 తర్వాత భారత్ మరోసారి జగజ్జేతగా నిలిచిన ఏడాది అది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

IND vs AUS 1st T20 : భారత (India) క్రికెట్ చరిత్రలో 2007 టి20 ప్రపంచకప్ (T20 World Cup)కు ప్రత్యేక స్థానం ఉంటుంది. 1983 తర్వాత భారత్ మరోసారి జగజ్జేతగా నిలిచిన ఏడాది అది. 1983లో ఎటువంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగి వన్డే ప్రపంచ కప్ ను ఎలా గెలుచుకున్నామో.. అదే రీతిలో ఎటువంటి అంచనాలు ఆశలు లేకుండా బరిలోకి దిగిన భారత్ 2007 టి20 ప్రపంచకప్ చాంపియన్ గా నిలిచింది. టీమిండియా (Team India) అభిమానులకు 2007 ఇచ్చిన కిక్ అలాంటిది. ఇక ఈ టోర్నీ యువరాజ్ సింగ్ (Yuvraj Singh)కు కూడా ఎంతో ప్రత్యేకమైనది. ద్వైపాక్షిక సిరీస్ లలో అతడి ప్రదర్శన ఎలా ఉన్నా కానీ.. ఐసీసీ టోర్నీల్లో మాత్రం యువరాజ్ సింగ్ ప్రాణం పెట్టి ఆడతాడనే చెప్పాలి. జట్టు కోసం చివరి వరకు పోరాడాతాడు. భారత్ గెలిచిన 2007, 2011 ప్రపంచకప్ లలో యువరాజ్ పాత్ర ఎంతో ఉంది.

ఇక 2007 టి20 ప్రపంచకప్ విషయానికి వస్తే.. ఇంగ్లండ్ తో జరిగిన మ్యాచ్ లో యువరాజ్ సింగ్ 6 బంతుల్లో 6 సిక్సర్లు బాది కొత్త చరిత్రను నమోదు చేస్తాడు. సెప్టెంబర్ 19, 2007న బ్రాడ్ వేసిన 19వ ఓవర్ లో యువరాజ్ ఈ ఘనతను సాధిస్తాడు. నేటికి ఈ అద్భుత ఘట్టానికి 15 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ క్రమంలో యువరాజ్ సింగ్ ఈ ఫీట్ ను మరోసారి టీవీలో కొడుకు ఓరియన్ తో కలిసి వీక్షించాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది.

డర్బన్ వేదికగా జరిగిన ఆ మ్యాచ్ లో భారత్ తొలుత బ్యాటింగ్ చేస్తుంది. సెమీఫైనల్ కు వెళ్లాలంటే భారత్ తప్పక నెగ్గాల్సిన మ్యాచ్ అది. 18 ఓవర్లు ముగిసే సరికి భారత్ స్కోరు 3 వికెట్లకు 171 పరుగులుగా ఉంటుంది. అయితే 18వ ఓవర్ వేసిన ఫ్లింటాఫ్ బౌలింగ్ లో యువీ ఫోర్ కొడతాడు. దాంతో ఫ్లింటాఫ్ యువీతో మాటల యుద్ధం మొదలు పెడతాడు. ఆ కసి అంతా 19వ ఓవర్ వేసిన బ్రాడ్ పై యువీ తీర్చుకుంటాడు. 19వ ఓవర్ లో వరుసగా 6, 6, 6, 6, 6, 6 కొట్టి 36 పరుగులు పిండుకుంటాడు. ఈ సిక్సర్లను మైదానం నలువైపులా నుండి రాబట్టడం విశేషం. ఆ మ్యాచ్ లో యువీ 12 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధిస్తాడు. అంతర్జాతీయ టి20ల్లో ఇదే అత్యంత వేగవంతమైన అర్ధ సెంచరీగా ఇప్పటికీ ఉంది.

Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Gautam Gambhir, India vs australia, India vs england, MS Dhoni, Rohit sharma, Team India, Virat kohli, Virender Sehwag, Yuvraj Singh