హోమ్ /వార్తలు /క్రీడలు /

IND L vs AUS L : పఠాన్ ఫటాఫట్.. సిక్సర్లతో ఇండియా లెజెండ్స్ ను ఫైనల్ కు చేర్చిన స్టార్ ఆల్ రౌండర్

IND L vs AUS L : పఠాన్ ఫటాఫట్.. సిక్సర్లతో ఇండియా లెజెండ్స్ ను ఫైనల్ కు చేర్చిన స్టార్ ఆల్ రౌండర్

PC : TWITTER

PC : TWITTER

IND L vs AUS L : రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ (Road Safety World Series) 2022లో ఇండియా లెజెండ్స్ (India Legends) ఫైనల్ కు చేరుకుంది. ఆస్ట్రేలియా లెజెండ్స్ (Australia Legends)తో జరిగిన సెమీఫైనల్ 1 పోరులో భారత్ లెజెండ్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

IND L vs AUS L : రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ (Road Safety World Series) 2022లో ఇండియా లెజెండ్స్ (India Legends) ఫైనల్ కు చేరుకుంది. ఆస్ట్రేలియా లెజెండ్స్ (Australia Legends)తో జరిగిన సెమీఫైనల్ 1 పోరులో భారత్ లెజెండ్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇండియా లెజెండ్స్ విజయం సాధించాలంటే చివరి 2 ఓవర్లలో 24 పరుగులు చేయాలి. ఈ తరుణంలో క్రీజులో ఉన్న ఇర్ఫాన్ పఠాన్ చెలరేగిపోయాడు. డర్క్ నానెస్ వేసిన 19వ ఓవర్ లో మూడు సిక్సర్లు బాదాడు. దాంతో భారత్ ఆ ఓవర్లో 21 పరుగులు పిండుకుంది. ఇక 20వ ఓవర్ లో రెండో బంతిని ఫోర్ బాదిన పఠాన్.. మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే ఇండియా లెజెండ్స్ ను ఫైనల్ కు చేర్చాడు. 172 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా లెజెండ్స్ 19.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించేసింది. నమాన్ ఓజా (62 బంతుల్లో 90 నాటౌట్; 7 ఫోర్లు, 5 సిక్సర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. చివర్లో ఇర్ఫాన్ పఠాన్ (12 బంతుల్లో 37 నాటౌట్; 2 ఫోర్లు,  సిక్సర్లు) జట్టుకు విజయాన్ని అందించాడు. రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ లో భారత్ ఫైనల్ చేరడం ఇది రెండోసారి. తొలి సీజన్ లో భారత్ చాంపియన్ గా నిలిచింది.

ఓజా ఒక్కడే

ఛేజింగ్ లో నమాన్ ఓజా అదరగొట్టాడు. సచిన్ టెండూల్కర్ (10)తో కలిసి ఓపెనర్ గా వచ్చిన అతడు తుది వరకు నిలిచి జట్టును ఆదుకున్నాడు. ఫోర్ కొట్టి టచ్ లో కనిపించిన సచిన్ ఫైన్ లెగ్ దిశలో ఆడే ప్రయత్నంలో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇక వన్ డౌన్ లో వచ్చిన సురేశ్ రైనా (11) విఫలం అయ్యాడు. యువరాజ్ సింగ్ (18) కూడా ఎక్కువ సేపు ఉండలేదు. స్టువర్ట్ బిన్ని (2), యూసఫ్ పఠాన్ (1) నిరాశ పరిచారు. దాాంతో భారత్ ఈ మ్యాచ్ ను గెలిచేలా కనిపించలేదు. మరో ఎండ్ లో ఉన్న ఓజా మాత్రం చక్కటి షాట్లతో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే కష్ట సమయంలో క్రీజులోకి వచ్చిన పఠాన్ రెచ్చిపోయాడు. సిక్సర్ల వర్షం కురిపించాడు. ముఖ్యంగా 19వ ఓవర్ లో మూడు సిక్సర్లు బాది మ్యాచ్ ను భారత్ వైపు తిప్పాడు. ఇక ఫోర్ కొట్టి ఇండియాను గెలిపించాడు.

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 5 వికెట్లకు 171 పరుగులు చేసింది. వర్షం కారణంగా బుధవారం 17 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. దాంతో గురువారం నిలిచిపోయిన చోటు నుంచి మ్యాచ్ ను మళ్లీ ఆరంభించారు. ఓవర్ నైట్ స్కోరు 17 ఓవర్లకు 136 పరుగులతో బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా మిగిలిన మూడు ఓవర్లలో 35 పరుగులు జోడించింది. దాంతో భారత్ ముందు 172 పరుగుల లక్ష్యాన్ని ఉంచగలిగింది. బెన్ డంక్ (26 బంతుల్లో 46; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), కెమరూన్ వైట్ (18 బంతుల్లో 30 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్సర్లు), అలెక్స్ డూలన్ (35), కెప్టెన్ వాట్సన్ (30) రాణించారు. భారత బౌలర్లలో అభిమన్యు మిథున్, యూసఫ్ పఠాన్ లు చెరో రెండు వికెట్లు తీశారు.

Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: India vs australia, Sachin Tendulkar, Suresh raina, Virender Sehwag, Yuvraj Singh

ఉత్తమ కథలు