హోమ్ /వార్తలు /క్రీడలు /

IND L vs AUS L : సురేశ్ రైనా కళ్లు చెదిరే క్యాచ్.. చూస్తే వావ్ అనాల్సిందే.. క్యాచ్ తో 16 ఏళ్ల క్రితం రైనాను గుర్తు చేశాడు

IND L vs AUS L : సురేశ్ రైనా కళ్లు చెదిరే క్యాచ్.. చూస్తే వావ్ అనాల్సిందే.. క్యాచ్ తో 16 ఏళ్ల క్రితం రైనాను గుర్తు చేశాడు

PC : TWITTER

PC : TWITTER

IND L vs AUS L : ఒక వైపు టీమిండియా (Team India) సౌతాఫ్రికా (South Africa)తో టి20 సిరీస్ ఆడుతుంటే.. మరోవైపు భారత దిగ్గజ ప్లేయర్లు రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ (Road Saftey World Series)లో దుమ్ము లేపుతున్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

IND L vs AUS L : ఒక వైపు టీమిండియా (Team India) సౌతాఫ్రికా (South Africa)తో టి20 సిరీస్ ఆడుతుంటే.. మరోవైపు భారత దిగ్గజ ప్లేయర్లు రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ (Road Saftey World Series)లో దుమ్ము లేపుతున్నారు. రెండో సీజన్ అప్పుడే నాకౌట్ స్టేజ్ కు చేరుకుంది. రాయ్ పూర్ వేదికగా జరిగిన తొలి సెమీఫైనల్ పోరులో ఆస్ట్రేలియా లెజెండ్స్ (Australia Legends)తో భారత లెజెండ్స్ (India Legends) తలపడింది. వర్షం ఆటంకం కలిగించడంతో ఈ మ్యాచ్ నేటికి వాయిదా పడింది. వర్షంతో ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా జట్టు 17 ఓవర్లలో 5 వికెట్లకు 136 పరుగులు చేసింది. వర్షం రావడంతో మ్యాచ్ ను గురువారానికి వాయిదా వేశారు. ఈ మ్యాచ్ గురువారం మధ్యాహ్నం 3.30 గంటలకు పున:ప్రారంభం కానుంది.

ఇక ఈ మ్యాచ్ లో భారత ప్లేయర్ సురేశ్ రైనా అదరహో అనిపించాడు. కళ్లు చెదిరే క్యాచ్ తో 16 ఏళ్ల క్రితం సురేశ్ రైనాను గుర్తు చేశాడు. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా జట్టుకు ఓపెనర్లు షేన్ వాట్సన్ (30), అలెక్స్ డూలన్ (35) శుభారంభం చేశారు. వీరు తొలి వికెట్ కు 60 పరుగులు జోడించారు. అనంతరం వచ్చిన బెన్ డంక్ (45) కూడా రెచ్చిపోయి ఆడాడు. అయితే అభిమన్యు మిథున్ బౌలింగ్ లో బెన్ డంక్ పాయింట్ దిశగా షాట్ ఆడాడు. గాల్లోకి లేచిన బంతి బౌండరీ వైపు దూసుకెళ్లింది. అయితే బ్యాక్ వర్డ్ పాయింట్ లో ఫీల్డింగ్ చేస్తున్న రైనా.. తన ఎడమ వైపు డైవ్ చేస్తూ అద్భుతమైన క్యాచ్ ను అందుకున్నాడు. ఫలితంగా డంక్ పెవిలియన్ కు చేరుకున్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మొత్తం 8 జట్లతో ఈ సిరీస్ తన రెండో సీజన్ ను జరపుకుంటుంది.  గ్రూప్ దశ ముగిసిన తర్వాత శ్రీలంక లెజెండ్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. రెండో స్థానంలో ఆస్ట్రేలియా మూడో స్థానంలో భారత్.. నాలుగో స్థానంలో వెస్టిండీస్ జట్లు నిలిచాయి. తొలి సెమీఫైనల్ లో భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడితే.. రెండో సెమీఫైనల్లో శ్రీలంక, వెస్టిండీస్ జట్లు తలపడనున్నాయి. ఫైనల్ అక్టోబర్ 1న జరగనుంది.

Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: India vs australia, Sachin Tendulkar, Suresh raina, Team India, Virender Sehwag, Yuvraj Singh

ఉత్తమ కథలు