హోమ్ /వార్తలు /క్రీడలు /

IND L vs AUS L : లెజెండ్స్ సెమీఫైనల్ పోరులో భారత్ ముందు భారీ టార్గెట్ ఉంచిన ఆసీస్.. ఎంతంటే?

IND L vs AUS L : లెజెండ్స్ సెమీఫైనల్ పోరులో భారత్ ముందు భారీ టార్గెట్ ఉంచిన ఆసీస్.. ఎంతంటే?

PC : TWITTER

PC : TWITTER

IND L vs AUS L : రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ (Road Saftey World Series) 2022లో భాగంగా రాయ్ పూర్ (Raipur) వేదికగా జరుగుతోన్న తొలి సెమీఫైనల్ పోరులో ఇండియా లెజెండ్స్ (India Legends) ముందు ఆస్ట్రేలియా లెజెండ్స్ (Australia Legends) భారీ టార్గెట్ ను సెట్ చేసింది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

IND L vs AUS L : రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ (Road Saftey World Series) 2022లో భాగంగా రాయ్ పూర్ (Raipur) వేదికగా జరుగుతోన్న తొలి సెమీఫైనల్ పోరులో ఇండియా లెజెండ్స్ (India Legends) ముందు ఆస్ట్రేలియా లెజెండ్స్ (Australia Legends) భారీ టార్గెట్ ను సెట్ చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 5 వికెట్లకు 171 పరుగులు చేసింది. వర్షం కారణంగా బుధవారం 17 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. దాంతో గురువారం నిలిచిపోయిన చోటు నుంచి మ్యాచ్ ను మళ్లీ ఆరంభించారు. ఓవర్ నైట్ స్కోరు 17 ఓవర్లకు 136 పరుగులతో బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా మిగిలిన మూడు ఓవర్లలో 35 పరుగులు జోడించింది. దాంతో భారత్ ముందు 172 పరుగుల లక్ష్యాన్ని ఉంచగలిగింది. బెన్ డంక్ (26 బంతుల్లో 46; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), కెమరూన్ వైట్ (18 బంతుల్లో 30 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్సర్లు), అలెక్స్ డూలన్ (35), కెప్టెన్ వాట్సన్ (30) రాణించారు. భారత బౌలర్లలో అభిమన్యు మిథున్, యూసఫ్ పఠాన్ లు చెరో రెండు వికెట్లు తీశారు.

ఇక ఈ మ్యాచ్ లో భారత ప్లేయర్ సురేశ్ రైనా అదరహో అనిపించాడు. కళ్లు చెదిరే క్యాచ్ తో 16 ఏళ్ల క్రితం సురేశ్ రైనాను గుర్తు చేశాడు. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా జట్టుకు ఓపెనర్లు షేన్ వాట్సన్ (30), అలెక్స్ డూలన్ (35) శుభారంభం చేశారు. వీరు తొలి వికెట్ కు 60 పరుగులు జోడించారు. అనంతరం వచ్చిన బెన్ డంక్ (45) కూడా రెచ్చిపోయి ఆడాడు. అయితే అభిమన్యు మిథున్ బౌలింగ్ లో బెన్ డంక్ పాయింట్ దిశగా షాట్ ఆడాడు. గాల్లోకి లేచిన బంతి బౌండరీ వైపు దూసుకెళ్లింది. అయితే బ్యాక్ వర్డ్ పాయింట్ లో ఫీల్డింగ్ చేస్తున్న రైనా.. తన ఎడమ వైపు డైవ్ చేస్తూ అద్భుతమైన క్యాచ్ ను అందుకున్నాడు. ఫలితంగా డంక్ పెవిలియన్ కు చేరుకున్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మొత్తం 8 జట్లతో ఈ సిరీస్ తన రెండో సీజన్ ను జరపుకుంటుంది.  గ్రూప్ దశ ముగిసిన తర్వాత శ్రీలంక లెజెండ్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. రెండో స్థానంలో ఆస్ట్రేలియా మూడో స్థానంలో భారత్.. నాలుగో స్థానంలో వెస్టిండీస్ జట్లు నిలిచాయి. తొలి సెమీఫైనల్ లో భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడితే.. రెండో సెమీఫైనల్లో శ్రీలంక, వెస్టిండీస్ జట్లు తలపడనున్నాయి. ఫైనల్ అక్టోబర్ 1న జరగనుంది.

Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: India vs australia, Sachin Tendulkar, Suresh raina, Team India, Virender Sehwag, Yuvraj Singh

ఉత్తమ కథలు