హోమ్ /వార్తలు /క్రీడలు /

IND A vs BAN A : బంగ్లాదేశ్ కు పట్టపగలే చుక్కలు చూపించిన టీమిండియా.. పాపం భారత్ దెబ్బకు

IND A vs BAN A : బంగ్లాదేశ్ కు పట్టపగలే చుక్కలు చూపించిన టీమిండియా.. పాపం భారత్ దెబ్బకు

PC : TWITTER

PC : TWITTER

IND A vs BAN A : బంగ్లాదేశ్ ‘ఎ’ (Bangladesh A)జట్టుతో ఆరంభమైన నాలుగు రోజుల అనధికారిక టెస్టు మ్యాచ్ లో భారత్ ‘ఎ’ (India A) జట్టు తొలి రోజు అదరగొట్టింది. తొలుత బంగ్లాదేశ్ ను తక్కువ పరుగులకే కుప్పకూల్చి.. ఆ తర్వాత వికెట్ కోల్పోకుండా రోజును ముగించారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

IND A vs BAN A : బంగ్లాదేశ్ ‘ఎ’ (Bangladesh A)జట్టుతో ఆరంభమైన నాలుగు రోజుల అనధికారిక టెస్టు మ్యాచ్ లో భారత్ ‘ఎ’ (India A) జట్టు తొలి రోజు అదరగొట్టింది. తొలుత బంగ్లాదేశ్ ను తక్కువ పరుగులకే కుప్పకూల్చి.. ఆ తర్వాత వికెట్ కోల్పోకుండా రోజును ముగించారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 36 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 120 పరుగులు చేసింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (106 బంతుల్లో 61 బ్యాటింగ్; 8 ఫోర్లు), అభిమన్య ఈశ్వరన్ (111 బంతుల్లో 53 బ్యాటింగ్; 6 ఫోర్లు) అర్ధ శతకాలు బాదారు. వీరిద్దరి దెబ్బకు బంగ్లాదేశ్ బౌలర్లకు ఎలా బౌలింగ్ చేయాలో కూడా మరిచిపోయారు. ప్రస్తుతం భారత్ 8 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.

అంతకుముందు టీమిండియా  బౌలర్లు రెచ్చిపోయారు. సౌరభ్ కుమార్ 4 వికెట్లతో చెలరేగితే నవ్ దీప్ సైనీ 3 వికెట్లతో రఫ్పాడించాడు. దాంతో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ జట్టు కేవల 45 ఓవర్లలోనే 112 పరుగులకు ఆలౌటైంది. మొసదిక్ హుస్సేన్ (88 బంతుల్లో 63; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) ఒంటిరి పోరాటం చేశాడు. మొసదిక్ ఆడకపోయి ఉంటే బంగ్లాదేశ్ 50 పరుగుల లోపే ఆలౌటై ఉండేది. బంగ్లాదేశ్ జట్టులో ముగ్గురు బ్యాటర్లు మినహా మిగిలిన 8 మంది సింగిల్ డిజిట్ కే పెవిలియన్ కు చేరడం గమనార్హం. ఈ జట్టులో ఆడిన చాలా మంది డిసెంబర్ నెలలో భారత్ తో జరిగే టెస్టు సిరీస్ లో పాల్గొననున్నారు.

టాస్ నెగ్గిన భారత కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్ బంగ్లాదేశ్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. రెండో ఓవర్ లో ఓపెనర్ జాయ్ (1) వికెట్ ను తీసిన సైనీ భారత్ కు శుభారంభం చేశాడు. కాసేపటికి జకీర్ (0)ను ముఖేశ్ కుమార్ పెవిలియన్ కు చేర్చాడు. ఇక ఇక్కడి నుంచి వచ్చిన బ్యాటర్ వచ్చినట్లు పెవలియన్ కు చేరారు. అయితే మొసదిక్ కాసేపు ఒంటరి పోరాటం చేశాడు. అయితే బౌలింగ్ కు వచ్చిన సౌరభ్ కుమార్ మొసదిక్ తో పాటు మరో ముగ్గురిని అవుట్ చేసి బంగ్లాదేశ్ తక్కువ పరుగులకే ఆలౌట్ అయ్యేలా సాయపడ్డాడు.

తిలక్ వర్మకు అవకాశం

హైదరాబాద్ బ్యాటర్ తిలక్ వర్మకు తొలి అనధికారిక టెస్టులో ఆడే అవకాశం లభించింది. న్యూజిలాండ్ తో జరిగిన సిరీస్ లో అదరగొట్టిన తిలక్ వర్మ.. బంగ్లాదేశ్ తో జరిగే సిరీస్ కు కూడా ఎంపికయ్యాడు. భారత్, బంగ్లా జట్ల మధ్య రెండు అనధికారిక టెస్టు మ్యాచ్ లు జరగనున్నాయి. ఇందులో తిలక్ వర్మ రాణిస్తే టీమిండియాలో ఎంట్రీ ఇచ్చేందుకు తిలక్ వర్మ మరింత చేరువ అవుతాడు. ప్రస్తుతం ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న తిలక్ వర్మ.. ఈ ఏడాది జరిగిన సీజన్ లో ఆకట్టుకున్నాడు. ఆడుతున్నది తొలి సీజన్ అయినప్పటికీ అంచనాలకు మించి రాణించాడు. ఏకంగా కెప్టెన్ రోహిత్ శర్మతోనే ఆల్ ఫార్మాట్ క్రికెటర్ అంటూ తిలక్ వర్మ కితాబు కూాడా అందుకున్నాడు.

First published:

Tags: Bangladesh, IND vs BAN, India vs bangladesh, Team India

ఉత్తమ కథలు