IN THE FINAL OVER NEEDING 35 BUT JOHN GLASS SMASHED SIX SIXES IN THE FINAL SIX BALLS TO HELP HIS TEAM TO A MEMORABLE WIN SRD
Viral : బ్యాటింగ్ లో అరాచకం.. విజయానికి 6 బంతుల్లో 35 పరుగులు..ఆ తర్వాత పెను విధ్వంసం..
Photo Credit : Twitter
Viral : ఆఖరి ఓవర్లో 35 పరుగులు విజయానికి అవసరం అన్నప్పుడు బ్యాటింగ్ చేస్తున్న జట్టు ఆశలు వదులుకోవడం సహజం. ఎందుకంటే ఆడిన ప్రతీ బంతిని సిక్స్ కొడితే గానీ మ్యాచ్ గెలవడం సాధ్యమవుతుంది. కానీ, ఇక్కడే అద్భుతం జరిగింది.
క్రికెట్ అంటేనే ఓ అద్భుతం అంటారు.. అందులోనూ ధనాధన్ ఫార్మట్ టీ20 వచ్చాక ఆట ఇంకాస్త అదుర్స్ అనిపిస్తోంది. అభిమానులను ఫుల్ మీల్స్ లాంటి విందు అందిస్తోంది. ఇక అందులో ఆటగాళ్లు చేసే అద్భుత విన్యాషాలు నెవ్వర్ భిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్ అనేలా ఉంటాయి. అలాంటి పొట్టి క్రికెట్లో సంచలనాలు నమోదు కావడం సర్వసాధారణం. ఓడిపోతుందని అనుకునే జట్టు అనూహ్యంగా గెలవచ్చు. అదే విధంగా ఓటమి అంచుల్లో ఉన్న జట్టు విజయమూ సాధించవచ్చు.అయితే, ఆఖరి ఓవర్లో 35 పరుగులు విజయానికి అవసరం అన్నప్పుడు బ్యాటింగ్ చేస్తున్న జట్టు ఆశలు వదులుకోవడం సహజం. ఎందుకంటే ఆడిన ప్రతీ బంతిని సిక్స్ కొడితే గానీ మ్యాచ్ గెలవడం సాధ్యమవుతుంది. అచ్చంగా అదే పరిస్థితిలో దాదాపు ఓటమి అంచున ఉన్న టీమ్‌కు అద్భుత విజయాన్ని అందించాడు బాలీమెనా బ్యాట్ప్‌మెన్ జాన్ గ్లాస్.
క్లబ్ క్రికెట్లో భాగంగా జాన్ గ్లాస్ ఈ అరుదైన ఫీట్‌ను అందుకున్నాడు. అందులోనూ టోర్నీ ఫైనల్ మ్యాచ్.. అందుంలోనూ ఆఖరి ఓవర్.. అసలు ఒత్తిడి అనే పదాన్ని దరి చేరనీయకుండా ఆరు బంతుల్లో ఆరు సిక్స్‌లు బాది జాన్ గ్లాస్ అద్భుతం చేశాడు. ఐర్లాండ్ ఎల్వీఎస్ టీ20లో క్రెగాగ్, బాలీమెనా మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన క్రెగాగ్ జట్టు నిర్ణీత ఓవర్లకు 147 పరుగులు చేసింది. ఇక ఈ టార్గెట్‌ను చేధించే క్రమంలో బాలీమెనా 19 ఓవర్లకు ఏడు వికెట్లు నష్టపోయి 113 పరుగులు చేసి పీకల్లోతు కష్టాల్లో ఉంది. చివరి ఓవర్‌కు 35 పరుగులు కావాల్సి ఉండగా.. గ్లాస్(87*) అద్భుతం చేశాడు. ఆరు బంతుల్లో 6 సిక్సర్లు కొట్టి తన జట్టును విజేతగా నిలిపాడు. ఇక ఇదే మ్యాచ్‌లో గ్లాస్ సోదరుడు సామ్ హ్యాట్రిక్ సాధించడం విశేషం.
JOHN GLASS TAKE A BOW!
He has just hit 36 off the final over and Ballymena are the 2021 Lagan Valley Steels 2021 champions.
ఇక టీ20ల్లో ఆరు బంతుల్లో ఆరు సిక్స్‌లు అనగానే మొదట గుర్తుకు వచ్చేది యువరాజ్ సింగ్ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 2007 టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో యువీ ఈ ఫీట్‌ను నమోదు చేశాడు. ఆండ్రూ ఫ్లింటాఫ్‌పై కోపంతో స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌ను చీల్చి చెండాడుతూ ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు చరిత్ర సృష్టించాడు. ఆ తర్వాత హర్షలే గిబ్స్, కీరన్ పొలార్డ్‌లు అంతర్జాతీయ క్రికెట్లో ఇలాంటి ఫీట్లే నమోదు చేశారు. అయితే ఒక మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్‌లో ఆఖరి ఓవర్లో ఆరు బంతుల్లో ఆరు సిక్స్‌లు బాదడం అనేది ఇదే తొలిసారి. ప్రస్తుతం జాన్ గ్లాస్ పేరు సోషల్ మీడియాలో మారుమోగుతోంది. వీడెవడో యువీ కజిన్ బ్రదర్ లా ఉన్నడంటూ కామెంట్లు చేస్తున్నారు.
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.