టీ20 ప్రపంచకప్ 2021లో భాగంగా డూ ఆర్ డై మ్యాచ్ కు టీమిండియా (Team India) రెడీ అయింది. న్యూజిలాండ్ (New Zealand) జట్టుతో తాడోపేడో తేల్చుకోవడానికి కోహ్లీసేన రెడీ అయింది. ఈ మ్యాచ్ గెలిచిన జట్టుకే సెమీస్ అవకాశాలు ఎక్కువగా ఉంటాయ్. దీంతో, ఈ మ్యాచ్ టీమిండియాకు చాలా కీలకం. అయితే, కీలక మ్యాచ్ కు ముందు టీమిండియా క్రికెటర్ల పిల్లలు హాలోవిన్ పార్టీలో పాల్గొన్నారు. ప్రాక్టీస్ సెషన్ లతో బిజీబిజీగా గడిపిన క్రికెటర్లు అందరూ సరదాగా జరిగిన పార్టీలో పాల్గొని ఆటపాటలతో అలరించారు. కోహ్లీ కూతురు.. అశ్విన్ పిల్లలు.. రోహిత్ శర్మ పాప.. అందరూ ఒక చోట చేరి సరదాగా గేమ్స్ ఆడారు. విచిత్ర వస్త్రధారణతో అందరూ ఆకట్టుకున్నారు.
ఈ వేడుకలో హిట్టర్ కిషన్ కిషన్, ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ డ్యాన్స్ చేశారు. ఇద్దరూ ఒకరి చేతుల్లో ఒకరు చేతులు వేసుకుని జంటగా డ్యాన్స్ చేశారు. మిగతా ఆటగాళ్లు వీరిద్దరి డ్యాన్స్‌ను ఆస్వాదించారు. కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా చాలా ఎంజాయ్ చేశాడు. యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ పిల్లలకు బహుమతులు పంపిణీ చేశాడు. పంత్ ఒక బ్యాగ్ నిండా చాక్లెట్లు, టోఫీలు తెచ్చి జట్టు సభ్యుల పిల్లలకు పంచాడు. రవిచంద్రన్ అశ్విన్ కుమార్తెలు, రోహిత్ శర్మ కుమార్తె పంత్ నుంచి చాక్లెట్లు, టోపీలు అందుకున్నారు.
View this post on Instagram
ఇక, ఈ పార్టీలో అనుష్క శర్మ, విరాట్ కోహ్లీల కూతురు వామికనే హైలెట్ గా నిలిచింది. వామిక దేవకన్యలా ముస్తాబయింది. సీతకోకచిలుక ఫ్రిల్లీ ఫ్రాక్ ధరించి ఓ ఎంజిల్లా నేలపై కూర్చుని సందడి చేసింది. విరాట్ కోహ్లీ తన చేతుల్లో వామికతో క్యాండీలను తీసుకున్నాడు. ఆపై ఇతర క్రికెటర్ల పిల్లలతో కలిసి వామిక ఆడుకుంది. ఇందుకు సంబందించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఎప్పటిలానే వామిక పూర్తి మొహం మాత్రం కనిపించలేదు. దీంతో ఫ్యాన్స్ మరోసారి నిరాశకు గురయ్యారు.
View this post on Instagram
పాకిస్థాన్ చేతిలో ఓటమి తర్వాత న్యూజిలాండ్‌తో ఆదివారం జరిగే మ్యాచ్ కోసం భారత్ (India Vs New Zealand) సిద్ధమవుతోంది. ఆ టీమ్తోనూ ఓటమి ఎదురైతే టోర్నమెంట్ ఆశలపై నీలి మేఘాలు కమ్ముకున్నట్లే అవుతుంది. మరోవైపు, న్యూజిలాండ్ ది కూడా అదే పరిస్థితి. పాకిస్థాన్ చేతితో ఎదురైన పరాజయాన్ని మరిచి టోర్నీ ముందుకు సాగాలంటే తప్ప గెలవాల్సిన మ్యాచ్ కోసం సమాయత్తం అవుతోంది.
View this post on Instagram
టీమిండియాతో అమీతుమీ తేల్చుకోనుంది. అయితే, ఐసీసీ టోర్నీల్లో న్యూజిలాండ్ కు టీమిండియాపై ఘనమైన రికార్డు ఉంది. గత 18 ఏళ్లల్లో న్యూజిలాండ్ పై ఐసీసీ టోర్నీల్లో విజయాన్ని అందుకోలేకపోయింది టీమిండియా. ఐసీసీ టోర్నీల్లో ఒక్కసారి మాత్రమే న్యూజిలాండ్ పై విజయాన్ని అందుకుంది టీమిండియా.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ind vs Nz, India vs newzealand, Rohit sharma, T20 World Cup 2021, Team India, Viral Video, Virat kohli