ఐపీఎల్ ట్రోఫీ పోయింది... భార్య అనుష్క శర్మతో ఎంజాయ్ చేస్తున్న విరాట్ కోహ్లీ...

ఫ్లేఆఫ్ రేసు నుంచి నిష్కమించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు... చివరి మ్యాచ్‌కు ప్రాక్టీస్‌ను పెట్టి, భార్య అనుష్క శర్మతో కలిసి షికారుకు చెక్కేసిన విరాట్ కోహ్లీ...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: May 2, 2019, 4:43 PM IST
ఐపీఎల్ ట్రోఫీ పోయింది... భార్య అనుష్క శర్మతో ఎంజాయ్ చేస్తున్న విరాట్ కోహ్లీ...
ఐపీఎల్ ట్రోఫీ పోయింది... భార్య అనుష్క శర్మతో ఎంజాయ్ చేస్తున్న విరాట్ కోహ్లీ...
Chinthakindhi.Ramu | news18-telugu
Updated: May 2, 2019, 4:43 PM IST
‘ఈ సాలా కప్ నమ్‌దే’ (ఈ సారి కప్పు మాదే!)ఐపీఎల్ 2019 సీజన్ ప్రారంభానికి ముందు విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ పఠించిన మంత్రం ఇది. గత ఏడాది చెత్త ప్రదర్శనతో చిత్తైన బెంగళూరు ‘బెంగ’ ఈసారి తీరుతుందని అంతా భావించారు. కెప్టెన్ విరాట్ కోహ్లీ బీభత్సమైన ఫామ్‌లో ఉండడంతో బెంగళూరు, మిగిలిన జట్లకు గట్టి సవాల్ ఇస్తుందని ఆశ పడ్డారు. అయితే ఫస్ట్ మ్యాచ్ నుంచే సీన్ పూర్తిగా రివర్స్ అయ్యింది. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో 70 పరుగులకే ఆలౌట్ అయిన బెంగళూరు... చెత్త ప్రదర్శనతో సీజన్ ప్రారంభించింది. రెండో మ్యాచ్‌లో 200+పైగా స్కోరు సాధించి, సత్తాచాటారు బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ బ్యాట్స్‌మెన్. అయితే భారీ లక్ష్యాన్ని కాపాడుకోవడంతో బౌలర్లు విఫలయ్యారు. అక్కడి నుంచి మొదలైన పరాజయాల పరంపర డబుల్ హ్యాట్రిక్ కొట్టేదాకా సాగింది. ఎట్టకేలకు ఏడో మ్యాచ్ గెలిచి పాయింట్ల ఖాతా తెరిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...ఆ తర్వాత ఫామ్‌ను కొనసాగించలేకపోయింది. ఫలితంగా ప్రస్తుత సీజన్‌లో ఫ్లేఆఫ్ రేసు నుంచి తప్పుకున్న మొదటి జట్టుగా నిలిచింది.
View this post on Instagram

♥️ Credit - @suppeerrgram

A post shared by Virat Kohli (@virat.kohli) on


రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ కాస్తా వర్షం కారణంగా రద్దైయిన సంగతి తెలిసిందే. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించడంతో 5 ఓవర్లకు కుదించారు. మొదట బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ జట్టు 7 వికెట్లు కోల్పోయి 67 పరుగులు చేసింది. లక్ష్యచేధనలో 3.2 ఓవర్లలో వికెట్ కోల్పోయి 41 పరుగులు రాబట్టి, ఈజీ విక్టరీ సాధించేలా కనిపించింది రాజస్థాన్ రాయల్స్. అయితే మళ్లీ వర్షం పడడంతో ఓటమి నుంచి తప్పించుకున్న విరాట్ సేన... ఫ్లేఆఫ్ రేసు నుంచి అధికారికంగా తప్పుకుంది. ఈసారి కూడా కలల ‘ఐపీఎల్’ కప్ దూరం కావడంతో విషాదంలో కూరుకుపోయిన విరాట్ కోహ్లీకి వెన్నంటూ నిలిచింది అతని భార్య అనుష్క శర్మ. ఆర్‌సీబీకి ఇక ఒక్క మ్యాచ్ మాత్రమే మిగిలింది. అది ఓడినా, గెలిచినా పెద్ద ప్రభావం ఉండదు. దాంతో మ్యాచ్ ప్రాక్టీస్‌ను పక్కన బెట్టి, భార్య అనుష్క శర్మతో కలిసి షికారుకు చెక్కేశాడు విరాట్ కోహ్లీ. బుధవారం అనుష్క శర్మ పుట్టినరోజు సందర్భంగా ఆమెతో కలిసి ఓ అందమైన సరస్సు ఒడ్డున కూర్చుని, సూర్యుడిని చూస్తూ కబుర్లు చెప్పుకుంటున్న వీడియోను పోస్ట్ చేశాడు విరాట్ కోహ్లీ. ఐపీఎల్ ముగిసిన తర్వాత మే30న ఆరంభమయ్యే వన్డే ప్రపంచకప్ కోసం ఇంగ్లండ్ బయలుదేరనుంది భారత జట్టు. ఈ టోర్నీ ప్రారంభమైన 20 రోజుల వరకూ భార్య, ప్రేయసిలను అక్కడికి తీసుకురాకూడదని ఆంక్షలు విధించింది బీసీసీఐ. సో... మిగిలిన ఈ కాస్త సమయాన్ని భార్య అనుష్క శర్మతో గడపాలని ఫిక్స్ అయ్యాడు విరాట్ కోహ్లీ. ఐపీఎల్ మిగిల్చిన చేదు గాయాలను అందాల శ్రీమతి వలపులో మునిగి, మరిచిపోవాలని భావిస్తున్నాడు. అనుష్క శర్మ ప్రేమ కారణంగా ఐపీఎల్ పరాభవాన్ని విరాట్ కోహ్లీ తొందరగా మరిచిపోవాలని ఆయన ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.



First published: May 2, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...