IN A FRIENDLY FOOT BALL MATCH AN OVER EXCITED DOG INVADED PLAY FOUR TIMES AND REFREE SHOWS RED CARD PICS GOES VIRAL SRD
Football : శునకం దెబ్బకి ఫుట్బాల్ మ్యాచ్ రద్దు..రిఫరీ రెడ్ కార్డు చూపినా వెనక్కి తగ్గని కుక్క..
Photo Credit : Twitter
Football : సెర్బియాలో సెకండ్ గ్రేడ్ టీమ్ ల మధ్య ఫుట్ బాల్ మ్యాచ్ హోరాహోరీగా సాగుతోంది. ఈ మ్యాచ్ లో ఎవరూ గెలిచారో వింటే షాక్ అవుతారు. మ్యాచ్ అన్నాక ఎవరో ఒకరు గెలుస్తారు..ఇందులో షాకింగ్ ఏముందనుకుంటున్నారా. ఈ మ్యాచ్ ఫలితాన్ని ఓ కుక్క శాసించింది.
సెర్బియాలో సెకండ్ గ్రేడ్ టీమ్ ల మధ్య ఫుట్ బాల్ మ్యాచ్ హోరాహోరీగా సాగుతోంది. ఈ మ్యాచ్ లో ఎవరూ గెలిచారో వింటే షాక్ అవుతారు. మ్యాచ్ అన్నాక ఎవరో ఒకరు గెలుస్తారు..ఇందులో షాకింగ్ ఏముందనుకుంటున్నారా. ఈ మ్యాచ్ ఫలితాన్ని ఓ కుక్క శాసించింది. అవును మీరు వింటున్నది నిజమే. ఓ కుక్క వల్ల ఈ మ్యాచ్ రద్దైంది. వివరాల్లోకెళితే.. సెర్బియాలో రాండ్నికీ మరియు కొలుబరా ల్యాజోరెవెక్ టీమ్ ల మధ్య ఫుట్ బాల్ పోరు జరుగుతోంది. కానీ, ఈ మ్యాచ్ కి నాలుగు సార్లు అంతరాయం కలిగించింది ఓ కుక్క. ఆ కుక్కను ఎన్ని సార్లు మైదానం బయటకు తరిమినా.. మళ్లీ పిచ్ మధ్యలోకి వచ్చి ఆటకు అంతరాయం కలిగించడం మొదలుపెట్టింది. దీన్ని దెబ్బకి రిఫరీ కూడా ఎక్కడో కాలింది. చివరికి ఏమి చేయాలో తెలియక రిఫరీ కుక్కకు రెడ్ కార్డ్ చూపించాడు. కానీ, శునకం గారు ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. నీ మాట నేనుందుకు వినాలి అన్నట్లు ఫోజిస్తూ మైదానం మధ్యలోనే నిలిచింది.
దీంతో ఏమి చేయాలో తెలియక మ్యాచ్ ను రద్దు చేశారు. అయితే, కుక్కకు రిఫరీ రెడ్ కార్డు చూపించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయ్. " కుక్క కూడా మ్యాచ్ లో ఆడాలనుకుంటోంది. ఆడిస్తే బాగుంటుంది కదా" అని ఒకరు కామెంట్ చేస్తే.. రిఫరీ మాట వినని ఆ కుక్కను మ్యాచ్ నుంచి సస్పెండ్ చేయాలని వేరొకరు ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు.
Serbia News
In a friendly between Kolubara and Radnički Kragujevac, an over-excited dog invaded play FOUR times. After the dog’s fourth incursion, the dog was sent off by the referee and, when it refused to leave the field, the match was abandoned. pic.twitter.com/eu9HFto8gX
సాధారణంగా మ్యాచ్ లో ప్రవర్తన మీరినందుకు ఆటగాళ్లకు రిఫరీ రెడ్ కార్డ్ జారీ చేస్తారు. రెడ్ కార్డ్ జారీ చేస్తే ఆ ప్లేయర్ గ్రౌండ్ వదిలి వెళ్లాల్సి ఉంటుంది. ఇక రెండు జట్ల మధ్య మ్యాచ్ ను కొంత సేపటి తర్వాత తిరిగి నిర్వహించారు. ఈ మ్యాచ్ లో కొలుబరా టీమ్ 3-0 గోల్స్ తేడాతో రాండ్నీకి జట్టుపై గెలిచింది.