• HOME
  • »
  • NEWS
  • »
  • SPORTS
  • »
  • IMRAN TAHIR PAID TRIBUTE TO LATER CRICKETER TAHIR MUGHAL BY REMOVING HIS JERSEY AFTER PICKING A WICKET SRD

Viral Video : వికెట్ తీయగానే జెర్సీ విప్పేసిన తాహిర్..అతని షర్ట్ పై ఉన్న ఫోటో ఎవరిదంటే..

Viral Video : వికెట్ తీయగానే జెర్సీ విప్పేసిన  తాహిర్..అతని షర్ట్ పై ఉన్న ఫోటో ఎవరిదంటే..

ఇమ్రాన్ తాహిర్ (Photo Credit : Twitter)

Viral Video : సౌతాఫ్రికా లెగ్ స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. తాహిర్ ప్రస్తుతం పాకిస్థాన్ సూపర్ లీగ్ లో ముల్తాన్ సుల్తాన్ తరుఫున ఆడుతున్నాడు.

  • Share this:
    సౌతాఫ్రికా లెగ్ స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. తాహిర్ ప్రస్తుతం పాకిస్థాన్ సూపర్ లీగ్ లో ముల్తాన్ సుల్తాన్ తరుఫున ఆడుతున్నారు. నిన్న క్వెటా గ్లాడియేటర్స్ తో జరిగిన మ్యాచ్ లో వికెట్ తీసిన ఆనందంలో జెర్సీ విప్పేసి సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. అయితే, సౌతాఫ్రికా ప్లేయర్ ఇలా చేయడం వెనుక పెద్ద కారణం ఉంది. వివరాల్లోకెళితే.. గత జనవరి 10న పాకిస్తాన్‌ లోకల్‌ క్రికెటర్‌ తాహిర్‌ ముగల్‌ అనారోగ్యంతో కన్నుమూశాడు. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో 503 వికెట్లు తీసిన 43 ఏళ్ల ముగల్‌ ప్రస్తుతం లాహారి కోచ్‌గా పనిచేసేవాడు. ఆయన మృతికి నివాళిగా తాహిర్‌ జెర్సీ తీసేశాడు. అయితే తాహిర్‌.. ముగల్‌ ఫోటో ఉన్న షర్ట్‌ను ధరించి అతనికి ఘనమైన నివాళి అందించాడు. "మై బ్రదర్‌ మిస్‌ యూ.. రిప్‌" అంటూ షర్ట్‌పై రాసి ఉంది. తాహిర్‌ చర్యతో ఆశ్యర్యపోయిన సహచర ఆటగాళ్లు తర్వాత విషయం తెలుసుకొని అతన్ని అభినందనలతో ముంచెత్తారు. ​ఈ వీడియోను పీఎస్ఎల్ ట్విట్టర్ లో షేర్ చేసింది. అది ఇప్పుడు వైరల్ గా మారింది. తాహిర్ ముగల్.. గొంతు క్యాన్సర్ తో బాధపడుతూ చనిపోయాడు.

    ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. మొదట బ్యాటింగ్‌ చేసిన క్వెటా గ్లాడియేటర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల 176 పరుగులు చేసింది. ఓపెనర్‌ ఉస్మాన్‌ ఖాన్‌ (51 బంతుల్లో 81, 10 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించాడు. తర్వాత 177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముల్తాన్‌ సుల్తాన్‌ 19.4 ఓవర్లలో 154 పరుగులు చేసి ఆలౌటైంది. ముల్తాన్‌ ఇన్నింగ్స్‌లో ఎవరు చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్‌ ఆడలేదు.. గ్లాడియేటర్స్‌ బౌలర్లలో కైస్‌ అహ్మద్‌ 3 వికెట్లతో రాణించాడు. ఇమ్రాన్‌ తాహిర్ ‌పీఎస్‌ఎల్‌లో ఆడిన మొదటి మ్యాచ్‌లో 3 ఓవర్లు వేసి 22 పరుగులు ఇచ్చి 1 వికెట్‌ తీశాడు.


    ఇమ్రాన్ తాహిర్ సౌతాఫ్రికా తరుఫున 20 టెస్ట్ లు, 107 వన్డేలు, 38 టీ-20 మ్యాచ్ లు ఆడి...57, 173, 63 వికెట్లు తీశాడు. ఇక, ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.
    Published by:Sridhar Reddy
    First published:

    అగ్ర కథనాలు