డోంట్ వర్రీ సర్ఫరాజ్... ఇమ్రాన్ ఖాన్ సలహా

సర్ఫరాజ్‌ దేశవాళీ క్రికెట్‌పై దృష్టిసారించాలని ఇమ్రాన్ ఖాన్ సూచించారు. అక్కడ రాణించి జాతీయ జట్టులో తిరిగి చోటు సంపాదించాలని అన్నారు.

news18-telugu
Updated: November 18, 2019, 10:42 PM IST
డోంట్ వర్రీ సర్ఫరాజ్... ఇమ్రాన్ ఖాన్ సలహా
సర్ఫరాజ్ అహ్మద్
  • Share this:
పేలవ ప్రదర్శన కారణంగా పాకిస్థాన్ జట్టులో స్థానం కోల్పోయిన మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మాద్‌కు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సలహా ఇచ్చారు. దేశవాళీలో రాణించి తిరిగి జట్టులో చోటు సంపాదించాలని సూచించారు. టీ20 ఆధారంగా ఆటగాడి ప్రతిభను అంచనా వేయడం సరికాదని.. టెస్టుల్లో, వన్డేల్లో ఆటతీరుని గమనించాలని ఇమ్రాన్ అన్నారు. సర్ఫరాజ్‌ దేశవాళీ క్రికెట్‌పై దృష్టిసారించాలని సూచించారు. అక్కడ రాణించి జాతీయ జట్టులో తిరిగి చోటు సంపాదించాలని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. పాక్‌ కోచ్‌గా మిస్బా ఉల్‌ హక్‌ను నియమించడం సరైన నిర్ణయమని... అతడు నిజాయతీ ఉన్న వ్యక్తి అని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యానించారు.

మిస్బా అనుభవం జట్టుకు ఎంతో ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. అతడి శిక్షణలో పాక్‌ సుదీర్ఘ ఫార్మాట్‌లో, వన్డేల్లో మరింత మెరుగవుతుందని భావిస్తున్నట్టు తెలిపారు. దేశవాళీ క్రికెట్‌ మెరుగైతే పాక్‌ క్రికెట్‌ అభివృద్ధి దిశలో పయనిస్తుందని అని ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నారు. గతనెలలో సర్ఫరాజ్‌ అహ్మద్‌ను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించిన పాక్‌ క్రికెట్‌ బోర్డు... శ్రీలంకతో జరిగే మూడు టీ20ల సిరీస్‌కు కూడా సర్ఫరాజ్ దూరం పెట్టింది.
Published by: Kishore Akkaladevi
First published: November 18, 2019, 10:42 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading