IPL 2021 : ఇదేం బౌలింగ్ రియాన్.. అంపైర్ వార్నింగ్‌తో యాక్షన్ మార్చిన రియాన్ పరాగ్!

రియాన్ పరాగ్ బౌలింగ్ యాక్షన్ ఎలా ఉందో చూశారా?

  • Share this:
    క్రికెట్ (Cricket) అంటే పూర్తిగా బ్యాట్స్‌మెన్ ఆధిపత్యమే ఉంటుంది. ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ పరుగులు భారీగా సాధిస్తుంటే.. వారిని కట్టడి చేయడానికి బౌలర్లు ఎన్నో వైవిధ్యమైన బంతులు వేయాల్సి వస్తుంది. అయినా సరే బ్యాట్స్‌మెన్ స్విట్ షాట్లు, పెడల్ స్వీప్, స్వీప్ అంటూ క్రికెట్ బుక్‌లో లేని షాట్లు కూడా ఆడుతుంటారు. వికెట్ల ముందు ఎక్కడైనా నిలబడి కొట్టొచ్చు. వికెట్లు మొత్తం వదిలేసి ఆడొచ్చ. ఆ స్వేచ్చ బ్యాట్స్‌మాన్‌కు ఉన్నది. కానీ బౌలర్ల విషయంలో అలా ఉండదు. బంతులు ఎలా వేయాలనే దానిపై నిబందనలు ఉన్నాయి. బంతిని శరీరం నుంచి ఎక్కువగా వంచి బౌలింగ్ వేకుండా నిబంధనలు ఉన్నాయి. అయితే భూమికి సమాంతరంగా బంతిని వేయడాన్ని క్రికెట్ రూల్స్ నిషేధిస్తున్నది. ఐపీఎల్‌లో (IPL 2021) భాగంగా సోమవారం పంజాబ్ కింగ్స్‌తో (Punjab Kings) జరిగిన మ్యాచ్‌లో రియాన్ పరాగ్  (Riyan Parag)బౌలింగ్ యాక్షన్‌పై వివాదం నెలకొన్నది. క్రిస్ గేల్ (Chris Gayle) బ్యాటింగ్ చేస్తున్న సమయంలో పరాగ్ 'రౌండ్ ఆర్మ్' (Round Arm) బౌలింగ్ వేశాడు. అతడి మోచేయి దాదాపు మైదానానికి సమాంతరంగా తెచ్చాడు. ఇదే ఇంకా కిందకు చాపి వేస్తే 'అండర్ ఆర్మ్' (Under Arm) బౌలింగ్ కింద పరిగణిస్తారు. కానీ రియాన్ పరాగ్ చాలా చాణక్యంగా రౌండ్ ఆర్మ్ బంతి విసిరాడు.

    ఆ బంతిని గమనించిన అంపైర్ వెంటనే పరాగ్‌కు వార్నింగ్ ఇచ్చాడు. అలా బౌలింగ్ చేస్తే నిబంధనల ఉల్లంఘన కింద బ్యాన్ అయ్యే అవకాశం ఉందని హెచ్చరించాడు. దీంతో పరాగ్ వెంటనే బౌలింగ్ మార్చి తన స్టైల్‌లోనే బౌలింగ్ వేశాడు. కాగా, ఆ ఓవర్‌లోనే గేల్ భారీ షాట్ ఆడి బెన్‌‌స్టోక్స్‌కు క్యాచ్ ఇచ్చి పెవీలియన్ చేరడం గమనార్హం. క్రికెట్ నిబంధనల ప్రకారం రౌండ్ ఆర్మ్ బౌలింగ్‌పై నిషేధం లేదు . కానీ 90 డిగ్రీల కోణం కంటే ఎక్కువ అయితే దాన్ని అండర్ ఆర్మ్ కింద పరిగణించే అవకాశం ఉంటుంది. అనుమానాస్పద బౌలింగ్ యాక్షన్ వల్ల బౌలర్ల కెరీర్ కూడా దెబ్బతిన్న సందర్భాలు ఉన్నాయి. అందుకే అంపైర్లు ముందుగానే హెచ్చరిస్తుంటారు.





    గతంలో టీమ్ ఇండియాకు చెందిన రవిచంద్రన్ అశ్విన్, కేదార్ జాదవ్ 'రౌండ్ ఆర్మ్' బౌలింగ్ వేసి విమర్శలకు కొని తెచ్చుకున్నారు. గత సీజన్‌లోనే అశ్విన్ ఇలాంటి ప్రయోగం చేశాడు. ఆ సమయంలో మాజీ క్రికెటర్లు అశ్విన్ బౌలింగ్ యాక్షన్‌పై విరుచుకపడ్డారు. మరోవైపు కేదార్ జాదవ్ ఎప్పటి నుంచో రౌండ్ ఆర్మ బౌలింగ్ వేస్తున్నాడు. వీరిద్దరినీ స్పూర్తిగ తీసుకొనే తాజాగా రియాన్ పరాగ్ కూడా అలా ప్రయోగం చేశాడేమో అనే అనుమానాలు ఉన్నాయి. మరోవైపు రియాన్ పరాగ్ బౌలింగ్‌ యాక్షన్‌ను ఐపీఎల్ ట్విట్టర్ ఖాతాలో ఒక వీడియో పోస్ట్ చేశారు. ఈ బౌలింగ్‌ను ఏమని పిలుస్తారో ఆలోచించండి అని ట్వీట్ చేసింది. పరాగ్ బౌలింగ్ యాక్షన్ వివాదంతో కెప్టెన్ సంజూ శాంసన్ మరో ఓవర్ అతడికి ఇవ్వకపోవడం గమనార్హం.
    Published by:John Naveen Kora
    First published: