క్రీడలు

  • associate partner

IPL 2018: రషీద్‌ ఖాన్‌ అంతు చూస్తా అన్నాడు.. అలానే చేశాడు

Rekulapally Saichand
Updated: June 25, 2020, 11:36 AM IST
IPL 2018: రషీద్‌ ఖాన్‌ అంతు చూస్తా అన్నాడు.. అలానే చేశాడు
కెెఎల్ రాహుల్
  • Share this:
కరోనా మహమ్మారి అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. క్రీడారంగం కూడా ఈ మహామ్మారి కారణంగా కుదేలవుతోంది . దాదాపు అన్ని మెగా ఈవెంట్లు ఇప్పటికే రద్దయ్యాయి. అయితే ఈవెంట్స్ లేకపోవడంతో ఆటగాళ్ళు వారి పర్సనల్ లైఫ్‌‌పై దృష్టి పెట్టారు. ఈ తరుణంలో టీమిండియా క్రికెటర్‌ మయాంక్‌ అగర్వాల్‌ 'ఓపెన్‌ నెట్స్‌ విత్‌ మయాంక్‌' పేరుతో ఓ చాట్‌షోను నిర్వహిస్తున్నాడు. క్రికెటర్లను ఇంటర్య్వూ చేస్తూ బిజీగా ఉంటున్నాడు. తాజాగా అతని షోలో కేఎల్‌ రాహుల్‌, క్రిస్‌ గేల్‌ పాల్గోన్నారు. ఈ చాట్‌‌లో ముఖ్యంగా ఐపీఎల్‌ మూమెంట్స్‌ను షేర్‌ చేసుకున్నారు

2018లో కింగ్స్‌ లెవెన్‌,సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌‌లో గేల్‌ విధ్వంసం గురించి ఈ షోలో చర్చించుకున్నారు. రాహుల్‌ మాట్లాడుతూ"2018 ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గేల్‌ సృష్టించిన విధ్వంసం ఇంకా నా కళ్ల ముందు మెదులుతూనే ఉంది. ఆరోజు గేల్‌ మంచి ఊపు మీదా ఉన్నాడు. అత్యధిక పరుగులు చేయాలనే ఉత్సాహం అతనిలో కనిపించింది. ముఖ్యంగా రషీద్‌ ఖాన్‌ బౌలింగ్‌కు వెస్తే అతని అంతు చూస్తానని నాతో చెప్పాడు. స్పిన్ అంటే ఇష్టం లేదని, స్పిన్నర్‌ నాపై చలాయిస్తే చూస్తూ ఊరుకోనన్నాడు. అంతలోనే రషీద్‌ బౌలింగ్‌ చేయడం వరుసగా 4 సిక్స్‌లు కొట్టి గేల్‌ తనేంటో నిరూపించుకున్నాడు. ఇదే నేను చూసిన ది బెస్ట్‌ మూమెంట్స్‌ అంటూ "రాహుల్‌ చెప్పుకొచ్చాడు.

2018 ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు సాధించిన మూడో బ్యాట్స్‌మన్‌గా రాహుల్‌ నిలిచాడు. కానీ ఆ సీజన్‌లో కింగ్స్‌ లెవెన్‌ పంజాబ్‌ ఏమాత్రం
ప్రభావం చూపలేకపోయింది. పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలిచింది.

 
First published: June 25, 2020, 11:36 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading