ఖాళీ స్టేడియంలో ఐపీఎల్ ఆడేందుకు సిద్ధం...శిఖర్ ధావన్ కామెంట్...

ప్రపంచవ్యాప్తంగా సానుకూలతను వస్తుందని టీమ్ ఇండియా గబ్బర్ అన్నారు. ధావన్ మాట్లాడుతూ ఈ ఏడాది ఐపీఎల్ నిర్వహిస్తారని భావిస్తున్నట్లు తెలిపాడు. అదే జరిగితే చాలా మంచిదని పేర్కొన్నాడు.

news18-telugu
Updated: May 25, 2020, 4:37 PM IST
ఖాళీ స్టేడియంలో ఐపీఎల్ ఆడేందుకు సిద్ధం...శిఖర్ ధావన్ కామెంట్...
శిఖర్ ధవన్ (ఫైల్)
  • Share this:
కరోనా నేపథ్యంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL-2020) నిర్వహిస్తారా లేదా... అనేది క్రికెట్ అభిమానులను వేధిస్తున్న ప్రశ్న ఇదే. మరి ఐపీఎల్ నిర్వహిస్తే టీ 20 ప్రపంచ కప్‌ సంగతి ఏంటి అనేది ప్రశ్నార్థకంగా మారింది. అయితే ప్రపంచంలోని అత్యంత ధనిక క్రికెట్ లీగ్ అలాగే ఆస్ట్రేలియాలో జరగబోయే ప్రపంచ కప్ షెడ్యూల్‌ రెండింటి భవితవ్యం క్రికెట్ అభిమానులను కలవర పెడుతున్నాయి. అయితే ఈ ఏడాది ఐపీఎల్ నిర్వహించకపోతే, భారత క్రికెట్ బోర్డు (BCCI)కు రూ.4000 కోట్ల నష్టం కలిగిస్తుంది. ఐపిఎల్‌కు భారత ప్రభుత్వం నుండి గ్రీన్ సిగ్నల్ లభించినా, ఈ టోర్నమెంట్ ప్రతిసారీ దేశంలోని వివిధ నగరాల్లో జరుగుతుంది లేదా విదేశాలలో జరుగుతుంది. ప్రాణాంతకమైన కరోనావైరస్ సంక్రమణ కారణంగా భారత క్రికెటర్లు గత రెండు నెలలుగా తమ ఇళ్లలో ఉన్నారు. ఈ సందర్భంగా వారంతా క్రికెట్ అభివృద్ధి కోసం తమ సలహాలు సూచనలు ఇస్తున్నారు. తాజాగా గుర్గావ్‌లోని తన ఇంటి నుంచి శ్రీలంక స్టార్ ఆల్ రౌండర్ ఏంజెలో మాథ్యూస్‌తో వెబ్ చాట్ సందర్భంగా టీమ్ ఇండియా ఓపెనింగ్ బ్యాట్స్ మాన్ శిఖర్ ధావన్ ఈ ఏడాది ఐపీఎల్ సాధ్యమేనని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇదే జరిగితే, ఇది ప్రపంచవ్యాప్తంగా సానుకూలతను వస్తుందని టీమ్ ఇండియా గబ్బర్ అన్నారు. ధావన్ మాట్లాడుతూ ఈ ఏడాది ఐపీఎల్ నిర్వహిస్తారని భావిస్తున్నట్లు తెలిపాడు. అదే జరిగితే చాలా మంచిదని పేర్కొన్నాడు. అంతేకాదు భద్రతకు సంబంధించిన అన్ని అంశాలను జాగ్రత్తగా చూసుకోవాలని ధావన్ పేర్కొన్నాడు. ఐపీఎల్ నిర్వహిస్తే చాలా మంచిదని, ప్రపంచవ్యాప్తంగా పాజిటివిటీని ప్రేరేపిస్తుందని అన్నారు. ఇప్పటి వరకూ కరోనాకు సంబంధించిన వార్తలను మాత్రమే చూసి చదివి. ప్రేక్షకులు విసుగు చెందారని, ఇలాంటి పరిస్థితిలో, క్రీడా కార్యకలాపాలు ఒకసారి ప్రారంభిస్తే వాతావరణం మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.

ఐపిఎల్‌లోని ఢిల్లీ క్యాపిటల్స్ తరుపున ధావన్ ఈ సారి బరిలోకి దిగాల్సి ఉంది. అయితే ఈ సారి ప్రేక్షకులు లేకుండా ఐపిఎల్ ఆడటం అవసరం అని అలా తిరిగి ప్రారంభించగలిగితే, తాము ఆడేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు.
First published: May 25, 2020, 4:37 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading